సంజీవని

నిద్రలేమి ఓ జబ్బే (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: నిద్ర సరిగా పట్టడం లేదు. దీనివలన ప్రమాదమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వివరంగా చెప్పగలరు?
-కానూరు రామచంద్రరావు, గుంటూరు
జ: అనిద్ర, అతి నిద్రా రెండూ భవిష్యత్తులో పక్షవాతం లాంటి నరాల జబ్బులకు దారితీస్తాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వటానికి నిద్ర అనే ఒక వ్యవస్థని శరీరమే కల్పించుకుంది. ఈ వ్యవస్థని మనం దెబ్బతీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మనిషి పగలు శ్రమించి, రాత్రికి నిద్రపోవటం ద్వారా ఎనర్జీలను రీఛార్జి చేసుకోవటం ప్రకృతి ధర్మం. కాలానికి ఆహారం, కాలానికి నిద్ర, కాలానికి విరేచనం ఇలా కాల ధర్మాల్ని పాటిస్తే కొన్ని అకారణ సమస్యలు పుట్టకుండానే తగ్గిపోతాయి.
‘అనిద్ర’ అంటే తగినంత నిద్రపట్టకపోవడం (ఇన్‌సామ్నియా) వలన సహజమైన శరీర ‘విశ్రాంతి వ్యవస్థ’ దెబ్బతింటుంది. అది రక్తపోటుకు, పక్షవాతానికీ దారితీయవచ్చని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. ఏ కారణం చేత పక్షవాతం వచ్చినా తగినంత నిద్ర కల్పిస్తే పక్షవాతం త్వరగా తగ్గుతుందనేది కూడా ఈ పరిశోధనలు చెప్తున్నాయి.
విచారం, విషాదం, ఆందోళన, నిస్సహాయత, నైరాశ్యం, ఉత్సాహం కోల్పోవటం ఈ పదాలన్నీ డిప్రెషన్ అనే ఒక్క మాటకిందకు వస్తాయి. నిద్ర దెబ్బతినటానికి ఇది ముఖ్య కారణం. వ్యక్తి ఆహార విహారాలు, జీవన విధానం కూడా ఇందుకు తోడ్పడతాయి. మధ్యరాత్రిలో ఊపిరాడనట్టు అవడం (స్లీప్ అప్నోయా), గొంతులోకి ముక్కులోకి పుల్లని నీళ్ళు చిమ్మినట్టయి అర్థరాత్రి లేచి కూర్చోవలసి రావడం (ళచిళన యళఒ్యఔ్ద్ఘ్జఆజఒ), ఫీడకలలు.. వీటివలన నిద్రాభంగం ఏర్పడి నిద్రలేమికి కారణవౌతాయి. డిప్రెషన్ వలన నిద్రలేమి ఏర్పడటం ఒక్కటే కాదు, నిద్రలేమి వలన డిప్రెషన్ కూడా ఏర్పడవచ్చు కూడా! ఈ రెండు సమస్యలు ఒకదాన్ని ఒకటి పెంచుకుంటాయన్న మాట. రెండూ తోడైతే వ్యాధి అసాధ్య వ్యాధిగా మారుతున్నట్టు లెక్క. కమ్మగా నిద్రపోగలిగినవారికి డిప్రెషన్ లాంటి పరిస్థితులు దూరంగా ఉంటాయని కూడా అర్థం చేసుకోవచ్చు.
బీపీ పెరగటానికి డిప్రెషను కూడా ఒక కారణమే! బీపీ పెరిగినపుడు మెదడులో రక్తనాళాన్ని పగలకొట్టుకుని ఆ ప్రెషర్ బయటకు పోతుంది. పగిలిన ఆ రక్తనాళంలోంచి రక్తం స్రవించి అది అక్కడే గడ్డకట్టుకొంటుంది. మెదడులో కాళ్ళకు చేతులకూ మూతికీ సంబంధించిన కేంద్రాలలో రక్తస్రావంవలన ఆయా అవయవాలు పక్షవాతానికి గురౌతాయి. నిద్రలేమి ఇందుకు తోడ్పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారిలో పక్షవాతం తిరగబెట్టే ప్రమాదం కూడా వుంది. పక్షవాతం వచ్చాక నిద్రాలోపాన్ని సరిచేస్తే పక్షవాతంలో త్వరగా మార్పు వచ్చే అవకాశం కూడా వుంది.
నిద్ర మనిషికి సహజ లక్షణం. పుట్టుకతోనే నిద్ర లేకపోవటం అనేది సాధారణంగా ఉండదు. ఘఆ్ఘ చ్ఘిౄజజ్ఘ జశఒ్యౄశజ్ఘ(ని) అనే అసాధారణ వ్యాధి ఒకటుంది. వంశపారంపర్యంగా సంక్రమించే ఒక మెదడు వ్యాధి. మతిభ్రమ (్ద్ఘఖషజశ్ఘఆజ్యశ), మానసికంగా అయోమయం (ష్యశచిఖఒజ్యశ్ఘ ఒఆ్ఘఆళ) చిత్తవైకల్యం (ళౄళశఆజ్ఘ) లాంటి లక్షణాలు ఏర్పడి ప్రాణాపాయ స్థితిని తేవచ్చు. ఇది నూటిక్కోటికి ఒకరికివచ్చే వ్యాధి. నిద్ర సరిగా పట్టనివాళ్ళందరికీ ఈ వ్యాధి ఉన్నదని కాదు. నిద్రపట్టే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
నిద్ర కొందరికి ఎక్కువగా పడుతుంది. కొందరిలో మొదటినుంచీ తక్కువగానే ఉంటుంది. అది శరీర తత్త్వాలను బట్టి ఉంటుంది. నిద్ర తక్కువగా పట్టేది వాత శరీర తత్వం ఉన్నవారికే! మామూలు వ్యక్తులకు 7-8 గంటలు నిద్ర అవసరం అయితే వాత శరీర తత్వం ఉన్నవారికి 6-7 గంటలు నిద్ర సరిపోతుంది.
వయోవృద్ధుల్లో వాతదోషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అందువలన వయసులో ఉన్నపుడు వచ్చినతంగా నిద్ర వృద్ధాప్యంలో రాదు. పడుకోగానే నిద్రరాకపోవడం, మధ్య మధ్య మెలకువ రావడం, మూత్ర విసర్జనకోసం వెళ్లాల్సి రావటం- వీటివలన నిద్ర సరిగా పట్టటం లేదనే భయం కలుగుతుంది.
రోజువారీ జీవితంలో చెదురుమదురులు, వాతం వికారం చెందటం నిద్రలేమికి కారణం అవుతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. వాత వికారమే మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. నాడీ వ్యవస్థని బలహీనపరుస్తుంది. అదే పక్షవాతానికీ దారితీస్తుంది.
కమ్మగా నిద్రపోతే వాతం తగ్గుతుంది. జాగరణలు చేస్తే వాతం పెరుగుతుంది. ఈ వాతం అనేక వాత వ్యాధులకు దారితీస్తుంది. అర్థరాత్రిదాకా టీవీలకు అంటుకుపోయే అలవాటున్నవారందరికీ వాత వ్యాధులు సంక్రమించే ప్రమాదం వుంది. వీళ్ళు భవిష్యత్తులో నిద్రలేమితో బాధపడే అవకాశం కూడా వుందన్నమాట.
స్వర్ణమాక్షిక భస్మ, నిద్రోదయ చూర్ణం, వాత కులాంతకరసం లాంటి ఔషధాలు ఆయుర్వేద వైద్యుని సలహా మీద వాడుకుంటే నిద్రాలోపం సరి అవుతుంది. బ్రాహ్మీ రసాయనం, అశ్వగంథాతి చూర్ణం లేదా లేహ్యం ఇంకా ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.
నిద్ర సరిగా పట్టనివాళ్ళు వాతం వేడిని కలిగించే పులుపు పదార్థాలు మానేసి బాగా చలవచేసేవి తీసుకోవాలి. ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా నిద్రాద్యవస్థ అంటే పడుకున్న చాలాసేపటిదాకా నిద్ర పట్టక అవస్థపడే పరిస్థితిని ఈ బ్రీదింగ్ వ్యాయామం తగ్గిస్తుంది.
5 గ్రాముల జాజికాయ, 5 గ్రాముల జాపత్రి, 10 గ్రాముల మరాఠీ మొగ్గలు, 3 గ్రాముల పచ్చకర్పూరం పలుకులు ఈ నాలుగూ పచారీ షాపులో దొరుకుతాయి. ఈ మోతాదుల్లో వీటిని తీసుకుని దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. పావు చెంచా మోతాదులో గ్లాసు వేడిపాలలో కలుపుకుని రోజూ రాత్రి పూట తాగుతూ ఉంటే నిద్రలేమితనం త్వరగా తగ్గుతుంది.
భోజనానికీ భోజనానికి మధ్య స్వల్ప విరామం ఉన్నా అపకారమే.. దీర్ఘ విరామం ఉన్నా అపకారమే. రెండూ నిద్ర సహజత్వాన్ని చెడగొడతాయి. అదేపనిగా కాఫీ, టీల సేవన, తీవ్ర ఆల్కహాల్ అలవాటు, అతిగా చల్లని ఆహార పదార్థాలు, పానీయాలు, అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర కాలిన లేదా వేగిన పదార్థాలు, రాత్రిపూట ముఖ్యంగా శనగపిండి లేదా మైదాపిండితో వండిన పిండి వంటకాలు, వాతాన్ని పెంచే ఆహార ద్రవ్యాలు, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కీళ్ళనొప్పులు, డైటింగ్ పేరున అర్థాకలితో రాత్రిళ్ళు పడుకోవటం ఇవన్నీ నిద్రాభంగానికి కారణాలే!
శరీర శ్రమ తక్కువగా ఉన్నవారు పగలు పడుకున్నందువలన రాత్రి నిద్ర తగ్గుతుంది. నిద్ర సరిగా పట్టడం లేదనుకునేవారు తెల్లవారు జామునే లేచి వ్యాయామం, నడక లాంటివి కొనసాగించాలి. మధ్యాహ్నం భోజనం కాగానే ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని నిద్రపోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
రాత్రి నిద్ర మేల్కొన్న వ్యక్తులు ఎంతసేపు మేల్కొన్నారో అందులో సగం సమయం ఉదయానే్న కాలకృత్యాలు తీర్చుకుని, ఏమీ తినకుండా అప్పుడు పడుకుంటే నిద్ర పోనందువలన కలిగే అలసట తీరుతుంది. పగటి నిద్ర వద్దంటే భోజనం చేయగానే నిద్రపోవద్దని చెప్పటమే! అది రాత్రిపూట భోజనానికి వర్తిస్తుంది. రాత్రి 7-8 గంటల మధ్యే భోజనం ముగించి 10 లోపు పడుకునే అలవాటు చేసుకుంటే ఆరోగ్యదాయకంగా వుంటుంది.
నిద్రాలేమి ఎక్కువమంది విషయంలో స్వయంకృతమే!

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,purnachandgv@gmail.com