సంజీవని

నొప్పి నివారణ మందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానంగా ఇవి రెండు రకాలు. మొదటిది నాన్‌నార్కొటిక్ డ్రగ్స్. మందుల షాపులల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని కొనుక్కోవచ్చు. ఉదాహరణకి యాస్పిరిన్, పేరాసిట్‌మల్, బ్రూఫిన్, ఫెల్డిన్ లాంటివి. ఇవన్నీ మైల్డ్ పెయిన్ కిల్లర్స్. జ్వరం, తలనొప్పి, కండర నొప్పులు, కీళ్ళనొప్పులకు వీటిని తీసుకొంటుంటారు.
రెండవ రకం నొప్పి నివారణ మందులు- నార్కొటిక్స్. ఈ శక్తివంతమైన మందుల్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. పెద్ద శస్త్ర చికిత్సలైన తర్వాత ఈ నొప్పినివారణ మందుల్ని వాడమంటారు. కోడీన్, మార్ఫిన్, డోలాక్సిన్, ఫసెప్టోన్ నార్కొటిక్ మందుల్లో కొన్ని. ఈ నార్కోటిక్ డ్రగ్స్‌కి వాడేవాళ్ళు బానిసయ్యే ప్రమాదముంది.
ఈ మందుల్ని వాడేవాళ్ళు కారు నడిపేప్పుడు ఇతర వాహనాల్ని నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ పెద్ద వస్తువులతో పనిచేస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రియాక్షన్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ మందులు కొద్దిగా మత్తుని కలిగిస్తాయి. ముఖ్యంగా పడుకుని ధూమపానం చేయకూడదు. ఈ మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్స్, ఇతర మత్తుని కలిగించే మందుల్ని వాడకూడదు. తల తిరగడం, వాంతులు, దురద, అజీర్ణం లాంటి భిన్న లక్షణాలు కనిపించవచ్చు. ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. నొప్పి నివారణ మందులవల్ల డైరెక్ట్ కెమికల్ ఎఫెక్ట్ వుండవచ్చు.
నార్కొటిక్ నొప్పి మందుల్ని వైద్యుల సలహా మేరకే వాడడం మంచిది. లేకపోతే వాటికి బానిసయ్యే ప్రమాదముంది. నిజంగా నొప్పి ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి పెద్ద డోస్‌లు అవసరమవుతాయి. అందుకే ఈ నొప్పి నివాణ మందుల్ని వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు. తీసుకోవడం మంచిది కాదు.

-డా.బి.ఎస్.ఆర్.మూర్తి జనరల్ సర్జన్, గజపతినగరం, 9866685439