సంజీవని

కఢుపులో పుళ్ళకీ మానసిక ఒత్తిడే కారణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార నాళంలోపల మెత్తటి, నున్నటి పొర కప్పి ఉంటుంది. దీనిని మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. ఈ పొర ఏ కారణానైనా చిరిగితే ఏర్పడే పుళ్ళని ‘అల్సర్స్’ అంటారు.
అధిక మానసిక ఒత్తిడిలో సాధారణంగా ఈ పొర దెబ్బతింటుంటుంది. అంటే మానసిక ఒత్తిడితో కడుపులో రసాయనాల ఉత్పత్తి పెరిగి, ఈ ఇబ్బంది కలుగుతుంటుంది.
సాధారణంగా 40 సంవత్సరాలకి పైబడిన వాళ్ళలో అల్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే, వీళ్ళలో చాలామంది స్టిరాయిడ్ మందుల్ని వాడుతుండవచ్చు. యాస్పిరిన్ యాంటి స్టిరాయిడల్, యాంటి ఇన్‌ఫ్లమేటరి మందుల్ని వాడుతుండడంవల్లా కడుపులో పుళ్ళు ఏర్పడవచ్చు. ఒ గ్రూప్ వాళ్ళకి గాస్ట్రిక్ లేక డియోడినల్ అల్సర్స్ తేలికగా రావచ్చు. అలాగే ధూమపానం చేసే వాళ్ళకు కడుపులో పుళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. బహిష్ఠులాగిపోయిన స్ర్తిలలోనూ కడుపులో పుళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
ఒకసారి కడుపులో పుళ్ళు ఏర్పడి తగ్గినా- మళ్ళీ ఆ ప్రదేశంలోనే పుళ్ళు ఏర్పడే అవకాశాలు తక్కువ. కాబట్టి మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఏ మందుల్ని బడితే ఆ మందుల్ని వేసుకోకూడదు.