సంజీవని

అతి మూత్రం.. కానుగతో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:మూత్రం ఎక్కువగా అవుతోంది. చికిత్స తీసుకుంటున్నాను. ఆయుర్వేదంలో ఏవైనా ఉపాయాలున్నాయా?
శ్రీనివాసరావు కానూరు, మధిర
జ: అతి మూత్రానికి అనేక కారణాలున్నాయి. మీరు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అదనంగా కొంత ఆయుర్వేద సహాయం తీసుకోవచ్చు.
కానుగ చెట్లు రోడ్డుప్రక్కన పెరిగేవే! ఎర్రటి పూలు పూస్తాయి. ఊరి పెద్దల్ని అడిగి తెలుసుకోండి. బజార్లో దొరకటం కష్టం. వీటి ఆకులకూ, పూలకూ చెక్కకు కూడా షుగరు వ్యాధిమీద పనిచేసే గుణం ఉంది. మూత్రం అతిగా అవటాన్ని ఆపుతుంది. పావుచెంచా పొడిని పాలలో వేసి బాగా కాచి తాగవచ్చు. తేనెతో తీసుకోవచ్చు.
తులసిని సమూలంగా తీసుకుని నీడన ఎండించి దంచిన పొడిని ఒక చెంచా వరకూ నీళ్లలోగానీ పాలలోగానీ వేసి మరగకాచుకుని తాగితే అతి మూత్రం, ఇతర మూత్ర వ్యాధులూ త్వరగా అదుపులోకి వస్తాయి.
వాము పొడిని గ్లాసు నీళ్లలో పావుచెంచా మోతాదులో వేసి మరగకాచుకుని మంచినీళ్లకు బదులుగా ఈ వాము నీళ్లను తాగుతూ వుంటే అతి మూత్రం తగ్గుతుంది. మెంతికూరతో ఇష్టమైన వంటకాన్ని వారంలో మూడు నాలుగుసార్లయినా తీసుకోవటం, ఒక చెంచా మెంతుల్ని రోజూ ఉదయానే్న నోట్లో వేసుకుని నీళ్లు తాగి మింగటం ఈ వ్యాధిలో ఉపయోగపడే సలహాలు.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com