శిప్ర వాక్యం

చైనాలో మతస్వేచ్ఛ ప్రశ్నార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు రష్యాను ‘్భలోక స్వర్గం’ అంటూ మనదేశంలోని కమ్యూనిస్టులు అభివర్ణించేవారు. రష్యా విచ్ఛిత్తి తర్వాత ఇప్పుడు చైనా ‘్భతల స్వర్గం’ అని వామపక్షవాదులు కొత్త పల్లవి అందుకున్నారు. రష్యాలో స్టాలిన్ అధికారంలోకి రాగానే మాస్కోలో కొన్ని వందల చర్చిలు నేలమట్టమైన సంగతి చరిత్ర. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్నాక ఆరు లక్షల బౌద్ధవిహారాలు నేలమట్టమయ్యాయి. కాగా, గత నెల 26న ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త ప్రచారమైంది. దాన్ని ప్రకటించినవారు క్రైస్తవ కార్డినల్. ఆ వార్త సారాంశం ఏమంటే- రోమన్ కాథలిక్ మతాన్ని, చర్చిలను కమ్యూనిస్టు చైనా నిర్మూలిస్తుందని. ‘మతం ఓ మత్తుమందు’ అనే వారు ఆలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో మతసంస్థలను ఎందుకు బ్రతకనిస్తారు?
హాంగ్‌కాంగ్‌లో జోసఫ్‌జెన్ ఏకంగా వాటికన్ పోప్ (ఫ్రాన్సిస్)నే హెచ్చరించాడు. చైనాతో మీరు సయోధ్యతో ఉంటే మొత్తం కాథలిక్ మతం నేలమట్టమవుతుందని జోసఫ్‌జెన్ హెచ్చరించాడు. కోటి ఇరవై లక్షల కాథలిక్కులపై కమ్యూనిస్టుపార్టీ ఆధిపత్యం చెలాయిస్తూ వారి అధిపతిని తానే నిర్ణయించటం ఏమిటి? అని జోసఫ్ జెన్ ప్రశ్నించాడు. ‘చర్చిలు నేలమట్టమైనాయి. బైబిలు అమ్మకాలు ఆగిపోయాయి. శిలువలు తొలగించారు. ఐనా చైనాతో సయోధ్యతతో ఉండాలని పోప్ ఎలా భావిస్తున్నారు? పోప్ అర్జెంటినా మూలాలు ఈ దుస్థితికి కారణం అని జోసఫ్‌జెన్ తీవ్రంగా వాటికన్‌పై కూడా తిరగబడ్డాడు. మనదేశంలోని క్రైస్తవులు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మద్దతునిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ జోసఫ్ జెన్ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
***
వరంగల్ నుండి మావోయిస్టు నేత వెంకటేశ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఎన్నికలను బహిష్కరించ వలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చాడు. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియపై మావోయిస్టులకు విశ్వాసం లేదు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం లభిస్తుందనేది వారి మూల సిద్ధాంతం. జంగిల్, రూరల్, అర్బన్, మీడియా మావోయిస్టులు వేర్వేరుగా వ్యూహరచనలు చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఇద్దరు ప్రజానేతలను మావోలు హత్యచేయటం ఇటీవలి సంఘటనయే. ఇప్పుడు తెలంగాణలో ప్రజాగాయకుడు గద్దర్ , ఆయన కొడుకు సూర్య కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉంటున్నారు. గద్దర్ ‘అర్బన్ మావోయిస్టు’ అని అందరికీ తెలుసు. ఇక తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం మావోయిస్టు సానుభూతిపరుడు. ఆయన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో ఎన్నికల పొత్తుపెట్టుకొని ‘మహాకూటమి’లో భాగస్వామిగా మారాడు. నల్గొండ జిల్లాలో ప్రముఖ నాయకులు కొందరు ఎన్నికల్లో గెలుపు కోసం ఉగ్రవాద ముఠాలపై ఆధారపడుతున్నారన్న వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. విభిన్న సిద్ధాంతాలున్న నేతలు ఇపుడు తెలంగాణ ఎన్నికల సమయంలో ‘మహాకూటమి’ పేరిట ఒకే గొడుగు కిందకు చేరారు.
***
వైకాపా అధినేత జగన్‌పై ఇటీవల విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాప్రయత్నం జరిగింది. లోగడ ఇలాంటి హత్యారాజకీయాలు చాలా జరిగాయి. తెలంగాణలో శ్రీపాదరావు, హయగ్రీవాచారి, పోలీసు అధికారి వ్యాస్, మాధవరెడ్డి.. ఇలా ఎందరినో మావోయిస్టులు హతమార్చారు. అయినా రాజకీయ నాయకులకు బుద్ధిరాలేదు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ మావోయిస్టులకు సానుభూతి తెలుపుతూ జంగిల్ మావోయిస్టులు ఆయుధాలు రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు కొనుక్కోవడానికి నిధులు అందజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ మానవ హక్కుల కోసం పనిచేసే సంస్థ. యుద్ధ సమయాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఈ సంస్థ వారు గణనీయమైన సేవలు అందించారు. ఇలాంటి సంస్థలలో సహజంగా జాతీయ వ్యతిరేక శక్తులు ప్రవేశించి స్వతంత్ర దేశాల సార్వభౌమాధికారాలను హరించేందుకు అంతర్జాతీయంగా కుట్రలు జరగటం సహజం. వీరి కేంద్ర కార్యాలయాలు బ్రిటన్‌లో ఉంటాయి. అక్కడి నుండి భారీగా నిధులు విడుదలవుతాయి. ఇటీవల మన దేశంలోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయాలపై సోదాలు జరగడంతో ఆ సంస్థ అధ్యక్షుడు ఖండించారు. తమను నేరచరితులుగా చూడటం తగదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో నిజానిజాలు ఏమిటి? అక్రమంగా విదేశీ నిధులను సేకరించి, కేంద్ర ప్రభుత్వాన్ని, ఐ.టి.శాఖను మోసగించడం అనే ఆరోపణలను ఆమ్నెస్టీ సంస్థ ఎదుర్కొంటోంది. ఆ సంస్థ డైరెక్టర్ ఆకార్ పటేల్ బెంగుళూరులో మాట్లాడుతూ, తాము నిబంధనలకు లోబడి పనిచేస్తున్నామని చెప్పినప్పటికీ ఇ.డి వద్ద ఇప్పుడు స్పష్టమైన ఆధారాలున్నాయట! ఆమ్నెస్టీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, పారదర్శకత లోపించిందన్నది ఆరోపణ. 40 లక్షల మందికి తాము మేలు చేస్తుండగా- కేంద్ర ప్రభుత్వం తమ బ్యాంకు ఎకౌంట్లను స్తంభింపజేసిందని పటేల్ వాపోయారు. ‘మా కార్యకలాపాల వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు కదా’- అని ఆయన అన్నారు. వెబ్‌సైట్‌లో అక్రమ లావాదేవీల వివరాలు ఉండవుకదా? ఆమ్నెస్టీ సంస్థ ప్రధానంగా మతం మార్పిడులకు మద్దతు ఇవ్వడం, జాతి వ్యతిరేక ఆందోళనలకు ఆర్థిక సహాయం చేయడం అనేవి ప్రధాన ఆరోపణలు. మావోయిస్టులకు, ఆమ్నెస్టీకి మధ్యగల సంబంధాలను కూడా మన నిఘా వ్యవస్థ అధ్యయనం చేస్తున్నది.
***
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల మాయావతితో దేశ రాజకీయాల గురించి చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీని గద్దెదింపాలన్నదే ఈ ఇద్దరి ఆలోచన. ఐతే మోదీకి బదులు ఎవరు ప్రధాని కావాలనే అంశంపై ఏకాభిప్రాయం లేదు. మాయావతి సహా చాలామంది విపక్ష నేతలకు ప్రధాని పదవిపై ఆరాటం పెరుగుతోంది. ఏపీలో తెదేపాకు మరోసారి అధికారం కష్టమేనన్న సర్వేలు ఇటీవల వెలువడుతున్నాయి. అలాంటపుడు కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పడం సాధ్యమేనా? వైకాపా అధినేతపై హత్యాయత్నం కేవలం ‘జగన్నాటకం’ అంటూ తెలుగుదేశం అభివర్ణించింది. మరోవైపు చంద్రబాబు అభద్రతాభావంతో అసహనంతో మాట్లాడడం ఇటీవల మనం చూస్తున్నాము. ‘అక్రమాస్తుల కేసులో మొదటి ముద్దాయి అయిన జగన్‌ను ఎలా ముఖ్యమంత్రిని చేస్తారు?’అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ రంగంలో ముద్దాయిలు కాని వారు ఎందరున్నారు?
ఆంధ్రప్రదేశ్‌లో కొందరిపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. చాలా కీలక పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా కక్షసాధింపుచర్య అని తెదేపా అంటోంది. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని పట్టుకుంటే కక్ష సాధింపు అవుతుందా? పశుదాణా కుంభకోణంలో పట్టుబడ్డ బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. తమిళనాడులో మన్నార్‌గుడి మాఫియా డాన్ వికె శశికళ కటకటాల పాలైంది. సినీనటి, వైకాపా ఎమ్మెల్యే రోజాపై మరో సినీనటుడు శివాజీ మండిపడ్డాడు. ‘నేను తిట్టడం మొదలుపెడితే వాళ్ల చెవుల నుండి రక్తం కారాలి’ అన్నాడు. చంద్రబాబుకు శివాజీ బీనామీగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణ. ఇందుకు ఆధారాలు చూపవలసిన బాధ్యత ఐటి శాఖ మీద ఉంటుంది. అప్పటి వరకూ శివాజీరాజా నిర్దోషియే.
***
గత నెలాఖరులో ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటించారు. జపాన్ ప్రధాని షింజే అబేతో ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా తన కండబలం ప్రదర్శిస్తున్న సమయంలో ఈ శాంతి ఒప్పందాలు చాలా నిర్ణయాత్మకమైవి -అని అంతర్జాతీయ పత్రికలు వ్యాఖ్యానించాయి. చైనా దక్షిణ సముద్ర ప్రాంతంలో చాలాకాలంగా సంక్షోభం ఉంది. టిబెట్‌ను కబళించినట్లే జపాన్‌ను కబళించాలని చైనా ఉవ్విళ్లూరుతున్నది. జపాన్‌కు అమెరికా నుండి రక్షణ కవచం ఉంది. ఇప్పుడు ఇండో-జపాన్ ఒడంబడిక అటు ఇరు దేశాలకూ ఉభయతారకంగా ఉంటుంది. చైనా తన పరోక్షయుద్ధాన్ని ఆపకపోయినా ఇండియాలో ప్రత్యక్ష యుద్ధానికి దిగడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి ఉంటుంది. నేపాల్, టిబెట్,లడక్ ప్రాంతాల్లో చైనా తన సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. పాకిస్తాన్ నుండి దత్తత తీసుకున్న భూభాగాలలో రోడ్లువేసి, విమానాశ్రయాలు నిర్మించింది. అంటే ఢిల్లీపై దాడి చైనాకు సుగమం అని అర్థం. ఇప్పుడు ఇండియాపై చైనా దాడిచేస్తే- ఇండియా వెంట నమ్మకంగా జపాన్, రష్యా, ఫ్రాన్సులు ఉంటాయని ఈ ఒడంబడికల అర్థం.
***
రాహుల్ గాంధీ ఉజ్జయిని వెళ్ళి మహాకాళేశ్వరునికి క్షీరాభిషేకం చేయటం వార్తల్లోకెక్కింది. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తాను ఆదర్శహిందువునని రాహుల్‌జీ ఆరాటపడుతున్నారు. ఫిరోజ్ గాంధీ పార్సీ మతస్థుడు. ఆయన కొడుకు రాజీవ్ గాంధీ పార్సీ. రాహుల్ తల్లి సోనియా రోమన్ కాథలిక్. మరి రాహుల్‌జీ హిందువు ఎట్లా అవుతాడు? లోగడ రాహుల్ యజ్ఞోపవీతం ధరించి సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని అర్చించాడు. తాను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకున్నాడు. ‘బ్రాహ్మణులు అంటే భూసురులు కానివారు అసురులు’ అని కొద్దిరోజుల క్రితం యుపిలో జరిగిన ఒక బ్రాహ్మణ సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. హిందువులు టెర్రరిస్టులు-తాలిబన్లు అన్న నోటితోనే రాహుల్ తాను ఆదర్శహిందూ, బ్రాహ్మణుణ్ణి- అని ఎలా చెప్పుకుంటారు?

ప్రొ. ముదిగొండ శివప్రసాద్