శ్రీకాకుళం

మాతృత్వం ‘సురక్షితం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 9: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ యోజన కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆసుపత్రిలో పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, వైద్యఆరోగ్యశాఖ జాయింట్ డైరక్టర్ వాణీశ్రీ పాల్గొన్నారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సురక్షిత మాతృత్వం - శిశు సంవరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ శిశువుకు జన్మనిచ్చే సమయంలో ఏ మాతృమూర్తి మృత్యువాత పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యూనిసెఫ్ నిర్ణయించిన లక్ష్యం మేరకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర, ర్రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం ముఖ్యంగా మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలు అమలుచేస్తూ ప్రత్యేకంగా గర్భిణీ స్ర్తిల కొరుకు ఈ పి.ఎం.ఎస్.ఎం.ఎ. కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీకాకుళం ఎం.పి. కింజరాపు రామ్మోహన్‌నాయుడు పాల్గొని మాట్లాడారు. మాతృశిశు మరణాలు దేశంలోనే అతిముఖ్యమైన అంశమని అన్నారు. వీటిని గణనీయంగా తగ్గించి నాగరిక సమాజంలో ముందుండాలని అన్నారు. ఆరోగ్యకర దేశం తయారుచేయాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర ప్రనుత్వం సైతం 108 అంబులెన్స్ ద్వారా ఉచిత రవాణా, ప్రసూతి అనంతరం 102 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా సురక్షితంగా ఇంటికి చేర్చడం, పౌష్టికాహారాన్ని అందించడం వంటి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ కార్యక్రమాలను ప్రజలకు వివరంగా తెలియజేసి వాటిని సద్వినియోగపరుచుకునే విధంగా చైతన్యపరచాలన్నారు. రాష్ట్రంలో కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రశంసిస్తూ వాటిని దేశవ్యాప్తంగా అమలుచేయడానికి చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ పథకాన్ని జిల్లాలో 24 ఆసుపత్రుల్లో ప్రాధమికంగా ప్రారంభించాలని చెప్పారు. ఈ కార్యక్రమం కింద ప్రతీ నెల 9వ తేదీన గర్భిణీలకు వైద్యపరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గర్భిణీగా ఉన్న మహిళలు రెండవ త్రైమాసికంలో ఉన్నప్పుడు (4 నుంచి 6 నెలలు), మూడవ త్రైమాసికం (7 నుంచి 9 నెలలు)లో వైద్యపరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో అత్యంత ప్రమాదకర పరిస్థితి (హైరిస్క్)లో ఉండేవారికి ప్రత్యేక వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. దీనిద్వారా మాతృమరణాలు తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళి మేరకు లక్ష ప్రసవాలు జరిగితే వందలోపు మాత్రమే మాతృ మరణాలు సంభవించవచ్చని సూచన ఉందని అయితే దేశంలో ఒక్క మాతృ శిశు మరణ కూడా జరగకుండా ఉండేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆసుపత్రికి గతంలో 40 శాతం మంది మాత్రమే వైద్యసేవలకు వచ్చేవారని ఇప్పుడు 70 శాతం వరకూ వస్తున్నారన్నారు. ఈ సంఖ్య శతశాతం కావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుదలపై ప్రత్యేకదృష్టి పెట్టామని అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రతిష్టాత్మకమైన రిమ్స్‌పైన కూడా దృష్టిపెట్టామన్నారు. అత్యంత సుందరంగా తీర్చిదిదుటకు చర్యలు చేపడుతున్నామన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో మంచి వైద్యసేవలు అందించుటకు కిందస్థాయి నుంచి పైస్థాయి వరకూ గల సిబ్బంది, అధికారులు కృషి చేయాలన్నారు. ఆసుపత్రికి వైద్యసేవలు కొరకు వచ్చేవారిపై బాధ్యతతో వ్యవహరించాలని, దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు.
జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ మాట్లాడుతూ పి.ఎం.ఎస్.ఎం.ఎ. మంచి కార్యక్రమని అన్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను తప్పకపాటించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ గర్భిణీల అవసరాలను గుర్తించాలని అన్నారు. పేదల పట్ల అభిమానంతో, ఆదరణతో వైద్యసిబ్బంది ఉండాలని కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ పి.ఎం.ఎస్.ఎం.ఎ. కార్యక్రమం కింద గర్భిణీ సమయంలో నాణ్యమైన వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. అవసరమైన ల్యాబ్ పరీక్షలు, స్కానింగ్, పోషకాహారం వంటి విషయాల్లో చక్కటి సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. రిమ్స్ ఆసుపత్రితోపాటు రాజాం, పాలకొండ, టెక్కలి ప్రాంతీయ ఆసుపత్రులు, 19 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఐదు రౌండ్ ది క్లాక్ పనిచేసే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పి.ఎం.ఎస్.ఎం.ఎ. క్లీనిక్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. జననీ సురక్ష యోజన పథకం కింద ఆసుపత్రిలో ప్రసవాలకు గ్రామీణ స్ర్తిలకు 1000 రూపాయలు, పట్టణ స్ర్తిలకు 600 రూపాయలు పారితోషికం అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో పి.ఎం.ఎస్.ఎం.ఎ కింద గర్భిణీలకు చేపట్టే ఆరోగ్యపరీక్షల రికార్డును ఎం.పి., జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే, కలెక్టర్ విడుదల చేసారు. ఇందుకు సంబంధించిన వివిధ విభాగాలను రిమ్స్‌లో ప్రారంభోత్సవం చేసారు. తనిఖీలకు కోసం వచ్చిన గర్భిణీలకు సత్యసాయిసేవాసమితి మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరక్టర్ డాక్టర్ బి.ఎల్.ఎస్.ప్రసాద్, ప్రసూతి వైద్యులు, ఈ పథకం నోడల్ అధికారి డాక్టర్ అరవింద్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.సునీల్‌నాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డాక్టర్ బి.సూర్యారావు, రిమ్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.