శ్రీకాకుళం

‘తమ్ముళ్ళ’పై మావోల గురి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
ఎక్కడ అన్యాయం జరిగితే.. అక్కడ ఎర్రదండు అడ్డుకోవడం ఉద్యమాల గడ్డ శ్రీకాకుళం చరిత్రకు కొత్తేమీకాదు. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి రైస్‌మిల్లర్లు, పారిశ్రామికవేత్తలకు అల్టిమేటం జారీ చేస్తూ అన్యాయాన్ని సహించేది లేదని లేఖాస్త్రాలు సంధిస్తునే సామాన్య జనం సానుభూతిని పొందేలా మావోలు ప్రతిచర్యలకు పూనుకోవడం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని, ఇటు ఒడిశా రాష్ట్రంలో అజ్ఞాతవాసంలో గల మావో అగ్రనేతలు తిరిగి ఏవోబీలో ఉనికి కాపాడుకునేలా కార్యకలాపాలు మొదలుపెడుతూ, అధికారాన్ని అడ్డంపెట్టుకుని, రెవెన్యూ, ఇంజనీర్లతో కుమ్మక్కై వంశధార ప్రాజెక్టులో అవినీతికి పాల్పడుతున్నారంటూ తెలుగుతమ్ముళ్ళపై బాణాన్ని ఎక్కుపెట్టారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ అధికారుల ఆరాలో తేలినట్టు సమాచారం. దీంతో మరోసారి మావోల అలజడి ఏమిటంటూ పోలీసు ఉన్నతాధికారులు సైతం తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
న్యాయం కోసం నిర్వాసితుల సాయం?
గతంలో మావోలకు పట్టున్న అటు ఉద్దానం నుంచి ఇటు భామిని వరకూ తిరిగి మావోల రీ ఎంట్రీని స్వాగతించేలా దగాపడ్డ వంశధార నిర్వాసితులు సహకారం అందించేందుకు నడుంబిగిస్తున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా ఇటువంటి పరిస్థితులకు తావివ్వని ప్రభుత్వాలు తాజాగా వంశధార నిర్వాసితుల పరిహారాన్ని కొంతమంది తెలుగుతమ్ముళ్ళు దళారులగా అవతారమెత్తి ఫలహారంగా రూ. తొమ్మిది కోట్లు బుక్కేశారంటూ వారిపై కనె్నర్ర చేస్తామంటూ అల్టిమేటం పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
దుగ్గిపురం వాసులకు మావోల నుంచి లేఖ?
దుగ్గిపురం నిర్వాసిత కాలనీకి చెందిన కొంతమంది దళారులకు ఏవోబీ దళం నుంచి హెచ్చరిక సమాచారం అందినట్టు సమాచారం. గత నెల 28 నుంచి ఆగస్టు 3 వరకూ మావోల అమరవీరుల వారోత్సవాలు ఏవోబీలో నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి ఉనికిని చాటుకునేందుకు మావోల సంస్థల బెదిరింపులు, హెచ్చరికలు చేస్తుంటారంటూ ఇటీవలే నకిలీ హెచ్చరికలు కూడా వస్తుండడంతో పోలీసులు సాదాసీదాగా తీసుకుంటున్నారు. అయితే, ఈ వంశధార నిర్వాసితుల సమస్య అలాకాదని మావోల జోక్యం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నిఘావిభాగం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో నేరుగా సిఎం నివేదికలు కోరినట్టు ఆలస్యంగా తెలిసింది.
గతంలో భామిని, బత్తిలి, కొత్తూరు, పారాపురం, హిరమండలం, సీతంపేట, హడ్డుబంగి వంటి గిరిజన జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో గిరిపుత్రులపై పెత్తందారులు చేసే అరాచకాలు, దాడులపై తిరుగుబావుటా ఎగురవేసే చరిత్ర కలిగిన ఏవోబీ దశాబ్దకాలంగా అటువంటి వ్యూహాల జోలికిపోలేదు. అలాగే, పదేళ్ళు కాంగ్రెస్ సర్కార్‌లో కూడా వంశధార ప్రాజెక్టులో వంద కోట్ల రూపాయలు అవినీతి జరిగినప్పటికీ, మావోల కదలికలు వంశధార నిర్వాసిత కాలనీల్లో కన్పించలేదు. కానీ, రెండేళ్ళ టిడిపి పాలన తర్వాత వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్యాకేజీల్లో తొమ్మిది కోట్ల రూ.లు తెలుగుతమ్ముళ్ళు కొందరు దళారులుగా వ్యవహారిస్తూ బినామీ పేర్లతో అధికారులను లోబరుచుకుని బుక్కేయడంతోనే మావోలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.
ముఖ్యమంత్రి సీరియస్!
ఇప్పటివరకూ మైదాన ప్రాంతాల్లో మావోలు పంచాయతీ అంతంతమాత్రంగా వుండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వంశధార ప్రాజెక్టు విషయంలో వారి జోక్యంపై సి.ఎం. సీరియస్‌గా యంత్రాంగంపై వ్యవహారించినట్టు సమాచారం. మావోలు ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధమంటూ ప్రజాప్రతినిధులు, దళారులకు అల్టిమేటం ఇవ్వడం చరిత్ర మరల పునరావృతం అయితే జిల్లా ఎరుపెక్కే పరిస్థితులు లేకపోలేదు. దీనిపై పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గతంలో చెల్లించిన బిల్లులు, బినామీ పట్టాలు వాటన్నింటిపై ఆగమేఘాలతో ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయసమాచారం. పోలీసులు మరింత క్షేత్రస్థాయికి వెళ్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలు కన్పిస్తున్నా మావోలను ఎవరు ఆశ్రయించారు, వారి ఎలా నిర్వాసితులతో సంప్రదిస్తున్నారన్నదానిపై కూడా పోలీసునిఘావర్గాలు దృష్టిసారించినట్టు అత్యంత రహస్యంగా తెలిసింది.

ప్రజాసాధికార సర్వే వేగవంతం
రణస్థలం, జూలై 30: ప్రభుత్వం సదుద్దేశంతో చేపడుతున్న ప్రత్యేక సాధికార సర్వేను వేగవంతం చేయాలని కమిషనర్, ప్రత్యేకాధికారి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు మండల పరిధిలోని కోస్ట గ్రామంలో సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన మాట్లాడుతూ కుటుంబంలోని పూర్తివివరాలు అందజేయాలని, దీనివలన భవిష్యత్‌లో ఎన్నో ప్రయోజనాలుంటాయని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దారు కార్యాలయంలో సర్వే బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నత్తనడకగా సాగుతోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళ సర్వే చేస్తే అందరూ అందుబాటులో ఉంటారని, కనీసం ఒక్కొక్కరు ఒక్కో సర్వే బృందం 15 ఇళ్ల వరకు సర్వే నిర్వహించాలని సూచించారు. తహశీల్దారు కె.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
సర్వే కమిషనర్ పరిశీలన
శ్రీకాకుళం(రూరల్): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సాధికార సర్వేను వేగవంతం చేయాలని కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి లవ్ అగర్వాల్ అన్నారు. శనివారం మండలంలోని పాతృనివలస పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సాధికార సర్వేను పరిశీలించారు. శ్రీకాకుళం మండలంలో సర్వే నత్తనడకను సాగుతోందని మరింత వేగవంతం చేయాలని సూచించారు. తీరప్రాంత గ్రామాల్లో సిగ్నల్స్ సక్రమంగా రాకపోవడంతో సర్వే జాప్యం జరుగుతుందని సిబ్బంది తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఆర్డీవో బలివాడ దయానిధి, తహశీల్దార్ సనపల సుధాసాగర్, వీఆర్వీలు, సర్వే సిబ్బంది ఉన్నారు. అలాగే నగరంలోని కెల్లవీధిలో నిర్వహించే సర్వేను కూడా ఈ బృందం సర్వేను పరిశీలించింది.

వేంకటేశ్వర స్వామికి విశేష పూజలు
శ్రీకాకుళం కల్చరల్, జూలై 30: నగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం స్వామివారికి పూల అలంకరణలు, అభిషేకాలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దూదివారి వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు రామశాస్ర్తీ, శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష అర్చనలు జరిపారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా గుజరాత్‌పేటలో గల నారాయణ తిరుమలలో విశేష పూజలు నిర్వహించారు. అర్చకుడు జి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూల అలంకరణలు చేస్తూ భకులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కలెక్టరు బంగ్లావద్ద బాలాజీ తిరుమల వద్ద ఉదయమే కమిటీ కార్యదర్శి బెహరా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం భజనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే శివబాలాజీ ఆలయంలో కూడా విశేష పూజలు నిర్వహించారు.

కొత్త టీకాలపట్ల అవగాహన అవసరం
శ్రీకాకుళం(టౌన్), జూలై 30: పిల్లలకు వేసే వ్యాధినిరోధక టీకాలు పట్ల వైద్యాధికారులు అవగాహన కలిగి వుండాలని కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.సావిత్రి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో వ్యాధి నిరోధక టీకాల జిల్లాస్థాయి వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పిల్లల్లో వచ్చే వ్యాధుల తీవ్రత దృష్ట్యా నూతన టీకాల ఆవశ్యకత పెరిగిందన్నారు.

ఏఓబిలో మావోల ప్రభావం లేదు
కొత్తూరు, జూలై 30: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా లేదని జిల్లా ఎస్‌పి జె.బ్రహ్మారెడ్డి అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సర్కిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. గతంలో మాదిరిగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల ప్రభావం పూర్తిగా లేదని స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో స్పెషల్ పార్టీ పోలీసులతో సీతంపేట, భామిని ఏజెన్సీలో కూంబింగ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. అపరిచితులపై నిత్యం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. నిత్యం వాహన తనిఖీలు చేస్తూ అపరిచితులు తారసపడితే అటువంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండు సంవత్సరాల కిందట కొత్తూరులో ఏటిఎం లూఠీకి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించలేకపోయామన్నారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పోలీస్‌స్టేషన్ స్థానంలో నూతనంగా భవనాలు నిర్మించేందుకు ఆధునిక హంగులతో కూడిన భవనాలను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వానికి నివేదికలు అందజేశామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టుల పట్ల యువత ఆకర్షితులుగా ఉండకుండా ఉండేందుకు యూత్ క్యాంపైన్లు నిర్వహిస్తూ పోలీస్, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించి శిక్షణలు అందజేసే యోచనతో ప్రభుత్వం ఉన్నట్టు ఆయన తెలిపారు. భూ తగాదాల్లో పోలీస్ అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. భూ తగాదాల్లో జోక్యం చేసుకొని అక్రమాలకు పాల్పడే పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలిపారు. అనంతరం మాజీ ఏ ఎంసి చైర్మన్ గోగుల చల్లంనాయుడు, చల్ల ధర్మారావులు ఎస్‌పిని కలిసి కొత్తూరు పట్టణం పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలపై పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్‌పికి వౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్‌పి బ్రహ్మారెడ్డి స్థానిక ఎస్ ఐను ఆదేశించారు. ఆయన వెంట పాలకొండ డిఎస్‌పి ఆదినారాయణ, ఎస్‌ఐ విజయకుమార్, ట్రైనీ ఎస్ ఐ హరికృష్ణ, సిబ్బంది ఉన్నారు.

‘హోదా’ కోసం పోరాటానికైనా సిద్ధం
సంతబొమ్మాళి, జూలై 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు ఎటువంటి పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన సంతబొమ్మాళిలో శనివారం విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినా, విస్మరించారన్నారు. టిడిపి నుంచి ఉన్న ప్రతినిధులందరూ సిఎం చంద్రబాబునాయుడు నిర్ణయంపై ఆధారపడి ఉన్నామని చెప్పారు. బిజెపి రాష్ట్రాన్ని ఆదుకుంటుందని ఎన్నో రకాలుగా ఆశపడినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా జరిగిన చర్చల్లో దేశంలోని 11 రాజకీయపార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గూర్చి ప్రస్తావించారని, వెంకయ్యనాయుడు, అరుణజైట్లీ సమాధానం చెప్పేందుకు నిరాకరించారన్నారు. పార్లమెంట్‌లోని చట్టాలను అమలు చేయాలని పలుమార్లు తాను ప్రస్తావించానని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పలుమార్లు పలుమార్లు ప్రస్తావించానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపితో పొత్తు ఉండడామా లేదా అనేది బిజెపి, టిడిపి పార్టీలకు చెందిన కమిటీ పెద్దలు నిర్ణయించాల్సి ఉందని, సిఎం చంద్రబాబునాయుడు ఈ విషయం నిర్ణయం తీసుకోవడంపై
ఆధారపడి ఉందన్నారు. విలేఖర్ల సమావేశంలో జెడ్‌పిటిసి లక్ష్మిదేవి, ఎఎంసి చైర్మన్ వై.విజయలక్ష్మి, ఎంపిపి కృష్ణవేణి, మండల టిడిపి అధ్యక్షుడు బీమారావు, పిఎసిఎస్ అధ్యక్షుడు ఎ.రాంప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు సూరాడ భీమారావు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
నిరంతర పోరాటం: డిసిసి చీఫ్
శ్రీకాకుళం(టౌన్): రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డోల జగన్మోహనరావు పేర్కొన్నారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో శాసనమండలి సభ్యుడు పీరుకట్ల విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడే చిత్తశుద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. విభజనలో ప్రతి రాజకీయ పార్టీ పాత్ర ఇమిడి ఉందని తెలిపారు. అయితే, దేశంలో ఇతర రాష్ట్రాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో అప్పటి యుపిఎ ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసిందన్నారు. అందులో ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఐదేళ్లు ప్రకటిస్తే, కాదుకాదు పదేళ్లు అని ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు వాదించారన్నారు. నేడు కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై వెంకయ్యనాయుడు మాట్లాడిన తీరును పరిశీలిస్తే మన రాష్ట్రానికిచెందిన వారైనందుకు సిగ్గుపడుతున్నామన్నారు. ఒకవేళ రాష్ట్ర అభివృద్ధికి వెంకయ్యనాయుడు కృషిచేస్తే హోదాకై ఏం ప్రయత్నాలు చేశారో వెల్లడించాలన్నారు. నైతిక విలువలు లేని ఇటువంటి రాజకీయ పార్టీలకు అధికారం ఇస్తే ఇటువంటి నిర్ణయాలే వెలువడతాయని, అది ఆయా పార్టీలకే శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని తెలిపారు. సమావేశంలో నంబాళ్ల రాజశేఖర్, సనపల అన్నాజీ, రత్నాల నర్శింహమూర్తి, గంజి ఆర్ ఎజ్రా, కె.వియల్. ఈశ్వరి, అల్లిబిల్లి రాథ, కొంక్యాణ మురళి తదితరులు పాల్గొన్నారు.