శ్రీకాకుళం

తుపానును ఎదుర్కొనేందుకు యంత్రాంగం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 27: కయాంత్ తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం వెల్లడించారు. ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియంలో జరుగుతున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లా యంత్రాంగాన్ని పూర్తి అప్రమత్త చేశామన్నారు. ముఖ్యంగా 11 తీరప్రాంత మండలాల అధికారులను ప్రత్యేకంగా ఆదేశించామని చెప్పారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు పూర్తి జాగరూకతతో ఉండాలని ఆదేవించామన్నారు.
మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని సూచించామని చెప్పారు. తీరప్రాంత గ్రామాలలో తుపాను సమాచారం అందించాలని ఆదేవించామని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08942 240557 ఏర్పాటు చేయడంతోపాటు, రెవెన్యూ డివిజన్, మండల కార్యాలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, ఎవరైనా వేటకు వెళ్ళి ఉంటే తిరిగి రావాలని ఆయన కోరారు. విశాఖపట్నంకు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల రూరంలో కేంద్రీకృతమై ఉందని అన్నారు. ఈ నెల 28, 29 తేదీలలో దీని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. తదనుగుణంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ నెల 25వ తేదీన విపత్తులను ఎదుర్కొనే పరిస్థితులపై రెడ్‌క్రాస్ సౌజన్యంతో జిల్లా యంత్రాంగం సమావేశం, మాక్ డ్రిల్ నిర్వహించిందన్నారు. విద్య,వైద్య, పంచాయతీ, మున్సిపాలిటీలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఆర్ అండ్ బి, జలవనరులశాఖ పశుసంవర్ధక శాఖ, పోలీసు తదితర శాఖలన్నిటిని సిద్ధం చేశామని కలెక్టర్ చెప్పారు.
సిక్కోలులో వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ తుపాను ప్రభావంతో గురువారం రాత్రి సిక్కోలులో వర్షం పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను పశ్చిమమధ్య బంగాళాఖాతంలోనికి ప్రవేశించి క్రమేపి జిల్లావైపు దూసుకురావడంతో వర్షాలు కురిసాయి. తుపానుపై జిల్లా యంత్రాంగం అధికారులను ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.
దీని ప్రభావం వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ హెచ్చరిక సూచికలు జారీ చేశారు. జిల్లా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తంచేశారు. ఈదురుగాలులతో వర్షం కురియడంతో ప్రజలు కూడా ముందుగానే అప్రమత్తమయ్యారు.