శ్రీకాకుళం

24లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రపుకొత్తూరు, నవంబర్ 6: రాష్ట్రంలో వచ్చే జూన్ 2వ తేదీ నాటికి 24 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్‌లు అందించడం టిడిపి ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాలశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆదివారం రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న నగరంపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపనతో పాటు గ్రామంలో జరిగిన జనచైతన్య యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సునీత మాట్లాడుతూ వంటావార్పులో మహిళల ఇబ్బందులను తొలగించేందుకు దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టిడిపి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతు రుణమాఫీ ద్వారా లబ్ధిపొందిన వారే రుణమాఫీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఇటువంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఎంపి కె.రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ టిడిపికి వజ్రపుకొత్తూరు కంచుకోట అన్నారు. అంతకుముందు బెండిగేటు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు మంత్రిని కలిసి మంచినీటి సమస్యను తీర్చాలని ఏకరువు పెట్టారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షురాలు శిరీష, ఎంపిపి జి.వసంతస్వామి, మండల టిడిపి అధ్యక్షుడు శశిభూషణ్, సర్పంచ్ డి విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పి.విఠల్, డి.వెంకటకుమార్ చౌదరి, ఎస్ చక్రవర్తి, డి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.