శ్రీకాకుళం

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, నవంబర్ 21: మత్స్యకారుల సంక్షేమమే నా ధ్యేయమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్ అన్నారు. తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మండలంలో ఇసుకలపాలెం మత్స్యకార గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మత్స్యకారులను ఎస్‌టిలో చేర్పేంచేందుకు ఇప్పటికే పలాస ఎమ్మెల్యే శివాజీ సహకారంతో సిఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చామన్నారు. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛను సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టు పేర్కొన్నారు. మరికొన్ని నెలలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చుతుందన్నారు. మత్స్యకార గ్రామానికి సముద్ర తీరానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు ఫారెస్టు డిపార్టుమెంట్, పంచాయతీశాఖ అధికారులతో మాట్లాడామని, అంచనా వ్యయం రూపొందించామన్నారు.
ఏడాదిలోపు అన్ని మత్స్యకార గ్రామాలకు రహదారులు నిర్మిస్తామన్నారు. వేట సమయంలో నష్టపరిహారం అందడం లేదని మత్స్యకారులకు తమ దృష్టికి తీసుకువచ్చారని, అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. నాలుగు మండలాల మత్స్యకారులకు ఈ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.
మత్స్యకారుల అభివృద్ధికి చంద్రబాబునాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్‌నాయుడులు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారన్నారు. పదేళ్లులో లేని అభివృద్ధి రెండున్నర ఏళ్లులో అభివృద్ధి జరిగిందన్నారు. కొంతమంది వైకాపా మాట్లాడడం దారుణంగా ఉందన్నారు. ఇసుకలపాలెం సర్పంచ్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి శ్రీనివాసరావు, జడ్‌పిటిసి చంద్రమోహన్, తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షుడు సోమయ్య తదితరులు మాట్లాడుతూ దేశం పార్టీ హాయంలో మత్స్యకార గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. మరింత అభివృద్ధి కోసం తమకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేదం ఫౌండేషన్ ప్రతినిధి మురళీ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మత్స్యకారులు పాల్గొన్నారు. అంతకుముందు మత్స్యకారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

పెద్ద నోట్ల రద్దుతో
‘్భజనం’కు ఇబ్బందులు
పొందూరు, నవంబర్ 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయ ప్రభావం మధ్యాహ్న భోజనం ఏజెన్సీలపై పడింది. 2వేల నోట్లు వస్తుండటంతో చిల్లర లేక పెద్దనోట్లు చెల్లక కాయగూరలతోపాటు ఇతర నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్నాయి. కిరాణా దుకాణాల్లో కూడా అరువులు ఇవ్వడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సుమారు 75 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాలు అమలు జరుగుతున్నాయి. మండల కేంద్రానికి వచ్చి కూరగాయలు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమర్చి వంటివి కొనాలంటే చిల్లర లేక తాము పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎంఇఒ గోవిందరావు వద్ద ప్రస్తావించగా సమస్య వాస్తవమేనని, చిల్లర సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.