శ్రీకాకుళం

రాజకీయ ఉద్దండుడు హరిబాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 21: మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత గొర్లె హరిబాబునాయుడు మంచి స్నేహశీలి, సేవాభావం గల నాయకుడని ఎఐసిసి కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతురావు అన్నారు. సోమవారం జిల్లాలో రణస్థలం మండలం పాతర్లపల్లిలో జరిగిన హరిబాబు సంతాపసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసమస్యల పట్ల మంచి అవగాహన కలిగి ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎంతోమంది శిష్యులను తయారు చేసి జిల్లా
అంతటా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్ రాజకీయాల్లో ద్రోణంరాజు సత్యన్నారాయణ తరువాత ఎఐసిసి స్థాయిలో మంచి పట్టు ఉన్న నేతగా హరిబాబు వెలుగు వెలిగారని గుర్తుచేశారు. ప్రజా సమస్యల పట్ల ఉన్న శ్రద్ధ కుటుంబసభ్యులపై హరిబాబుకు ఉండేదికాదని అందువల్లే సొంత ఆస్తులు కూడబెట్టుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అప్పలసూర్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, దేశం పార్టీ నేత చౌదరి బాబ్జీ, కిమిడి రామకృష్ణంనాయుడు, చిన్న శ్రీను, సిసిఎం నాయకుడు చౌదరి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా హరిబాబునాయుడు చిత్రపటానికి హనుమంతురావుతోపాటు ఇతర నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగి 2014 ఎన్నికల ముందు టిడిపిలోకి చేరినవిషయం తెలిసిందే. ప్రజాసేవకే ఈయన జీవితాన్ని అంకితం చేశారు. 1991 నుంచి 2004 వరకూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా సేవలందించి, ఆయన రాజకీయ అనుభవాలను సంతాపసభకు హాజరైన అన్నీ పార్టీల నేతలు కొనియాడారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎఐసిసి సభ్యునిగా ఎదిగిన హరిబాబు ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఈయన సమీప బంధువు గొర్లె శ్రీరాములనాయుడు అనుచరునిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, అనంతరకాలంలో ఆయనే్న విభేదించి పార్టీలో ఎదిగిన ఘనుడుగా అభివర్ణించారు. అప్పట్లో ఎచ్చెర్ల రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఈయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. 1999, 2004లో పాతపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఆయన 2006లో జెడ్పీ చైర్మన్ పదవికి ఆశించి, హిరమండలం జెడ్‌పిటిసిగా ఎన్నికయ్యారు. వివిధ రాజకీయ సమీకరణాలు జెడ్పీ చైర్మన్ పదవి హరిబాబుకు వరించకుండా చేసాయి. 2007 స్థానిక సంస్థల అభ్యర్థిగా ఎమ్మెల్సీ టిక్కెట్టును ఆశించడం, అప్పుడు కూడా రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టిడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుదారునిగా కొనసాగుతూ 2009 సార్వత్రిక ఎన్నిలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎచ్చెర్ల జనరల్ కేటగిరీకి మారడంతో ప్రజారాజ్యం టిక్కెట్టును ఆశించారు. ఎచ్చెర్ల టిక్కెట్టు కిమిడి కళావెంకటరావుకు ఇవ్వడంతో మనస్థాపం చెంది స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు టిడీపీలో చేరారు. హరిబాబు రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ చౌదరి తేజేశ్వరరావు, ఇతర నేతలంతా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.