శ్రీకాకుళం

మరో రెండు రోజులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 22: జిల్లాలో నీటి తీరువా, నాలా పన్నులను ఈ నెల 24వ తేదీ వరకూ పాత ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లతో చెల్లింపు చేయవచ్చని జాయింట్ కలెక్టర్ కె.వి.ఎస్.చక్రధర బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24వ తేదీ వరకూ వీఆర్వో వద్దగాని, లేదా సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయంలోగాని, పాత నోట్లతో చెల్లింపు చేయవచ్చని చెప్పారు. చెల్లింపు చేసిన మొత్తాలకు రశీదు పొందాలని ఆయన సూచించారు. నీటి తీరువా పన్ను శ్రీకాకుళం డివిజన్‌లో 10.83 కోట్ల రూ.లు, పాలకొండ డివిజన్‌లో 10.32 కోట్లు, టెక్కలి డిలిజన్‌లో 9.89 కోట్లు చెల్లించాల్సివుందని ఆయన పేర్కొన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం మండలంలో రూ. 64 లక్షలు, గారలో 64.80 లక్షలు, నరసన్నపేటలో 1.89 లక్షలు, పోలాకిలో 1.61 లక్షలు, ఎచ్చెర్లలో 80 లక్షలు, లావేరులో 3.33 లక్షలు, పొందూరులో 90.30 లక్షలు, జి.సిగడాంలో 4.72 లక్షలు, ఆమదాలవలసలో 94.57 లక్షలు, సరుబుజ్జిల్లో 55.99 లక్షలు, ఎల్.ఎన్.పేటలో 71.94 లక్షలు, బూర్జలో 2.03 కోట్లు, పాలకొండ మండలంలో 1.25 కోట్లు, వీరఘట్టాంలో 2.51 కోట్లు, వంగరలో 1.48 కోట్లు, రేగిడి ఆమదాలవలసలో 1.93 కోట్లు, రాజాంలో ఆరు లక్షలు, సంతకవిటిలో 2.10 కోట్లు, సీతంపేటలో 1.25 లక్షలు, కొత్తూరులో 6.39 లక్షలు, భామినిలో 8.02 లక్షలు,
హిరమండలంలో 51.59 లక్షలు, పాతపట్నంలో 11.99 లక్షలు, మెళియాపుట్టిలో 16.83 లక్షలు, సారవకోటలో 5.35 లక్షలు, ఇచ్ఛాపురంలో 72.98 లక్షలు, కవిటిలో 82000, కంచిలిలో 13.60 లక్షలు, సోంపేటలో 19.71 లలు, మందసలో 62.49 లక్షలు, పలాసలో 41.72 లక్షలు, వజ్రపుకొత్తూరులో 45.29 లక్షలు, నందిగాంలో 1.49 కోట్లు, టెక్కలిలో 71.40 లక్షలు, సంతబొమ్మాళిలో 2.21 కోట్లు, కోబబొమ్మాళిలో 97.39 లక్షలు, జలుమూరులో 1.80 కోట్లు నీటితీరువా చెల్లించాలని అన్నారు. నాలాగా శ్రీకాకుళం డివిజన్‌లో రూ. కోటి రూపాయలు, పాలకొండ డివిజన్‌లో 52.24 లక్షలు, టెక్కలి డివిజన్‌లో 56.34 లక్షలు వెరశి రూ. రెండు కోట్లు వసూలు కావాల్సివుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు, రియర్టర్లు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.