శ్రీకాకుళం

పెద్దనోట్ల రద్దు ఆర్థిక సంస్కరణకే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 4: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లు రద్దుచేయడం ఆర్థిక సంస్కరణలు తెచ్చేందుకేనని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యడ్లపాటి రఘునాధబాబు అన్నారు. స్థానిక హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్లసమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లాక్ మనీ రోజురోజుకీ పెరిగిపోతుందని ఇన్‌కమ్‌ట్యాక్ దాడులు ఇంకా ముమ్మరం చేయనున్నట్లు స్పష్టంచేశారు. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటిలో 950 గ్రాములు వరకు బంగారం ఉండవచ్చునని అంతకుమించినట్లయితే దానికి లెక్కలు చూపించాలని స్పష్టంచేశారు. దీనిని ప్రతిపక్షాలు వక్రంగా ప్రచారం చేస్తున్నాయన్నారు. 30లక్షల కన్న తక్కువ విలువగల బంగారం ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం 62.2శాతం నల్లధనం ఉందని దీనిని వెలికితీసినట్లయితే బ్యాంకులో డిపాజిట్లు పెరిగి వడ్డీ రేట్లు తగ్గుతాయని తద్వారా వస్తు ఉత్పత్తికూడా పెరుగుతుందన్నారు. నరేంద్రమోదీ చిత్తశుద్ధితోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని దీనికి అందరూ సహకరించాలన్నారు. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూపించడం సరికాదన్నారు. మూడు నెలల్లో అంతా సర్ధుబాటు అవుతుందన్నారు. పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో కఠినంగా వ్యవహరించే నాయకుడు మోదీ అని తెలియజేశారు. ఇటీవల ఓ టిడిపి ఎమ్మెల్యే అయిన రాజకీయ నాయకుడిపై కూడా దాడి చేసి రూ.350 కోట్లు పట్టుకున్నట్లు స్పష్టంచేశారు. ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ రానున్న కాలంలో పేద బడుగు బలహీనవర్గాలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, దుప్పలరవీంద్రబాబు, అట్టాడ రవిబాబ్జీ, రెడ్డి నారాయణరావు, చల్లా వెంకటేశ్వరరావు, సంపతిరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జనసేనాని పర్యటనకు సహకరించండి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 4: జనసేనాని పవన్‌కళ్యాణ్ ఈనెల 6న ఇచ్ఛాపురం రానున్న సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన సభ విజయవంతమయ్యేందుకు తమకు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం.శ్రీనివాసరెడ్డిలను ఆదివారం ఆ పార్టీ కార్యకర్తలు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు మణికంఠ పిక్చర్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశానికి ఈరెండుశాఖల సిబ్బంది తనకు సహకరించాలని కోరారు. మంగళవారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు జనసేనాని పవన్‌కళ్యాణ్ మూత్రపిండ వ్యాధిగ్రస్తులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్న కారణంగా పరిమిత సంఖ్యలో ముందస్తు పాస్‌లు అందుకున్న వారికే అనుమతి ఉన్నందున ఇప్పటికే సభకు సంబంధించి పోలీస్‌యంత్రాంగంనుండి సంబంధిత అనుమతులు తీసుకున్నామని ఉన్నతాధికారులకు తెలిపారు. ఇటీవల ఎస్పీ జె.బ్రహ్మారెడ్డిని కలిసి సభా ప్రాంగణానికి యువత పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భద్రతలు భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరినట్లు జనసేన కార్యకర్తలు తెలియజేశారు. పవన్‌సభకు ముందుగా జనసేన కార్యకర్తలు జారీ చేసిన పాస్ లు ఉన్నావారే రావాలని, మీడియా మిత్రులు మినహా వేరెవ్వరికీ ఈ ప్రాంగణంలోనికి అనుమతి లేదని సభ నిర్వాహకులు తెలియజేశారు. డి ఎం అండ్ హెచ్‌వో కలిసిన వారిలో జనసేన కార్యకర్తలు ప్రదీప్, చైతన్య, మనోజ్‌కుమార్, నాయుడు, గురుప్రసాద్, నవీన్ ,వెంకీ తదితరులు ఉన్నారు.