శ్రీకాకుళం

ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 4: ప్రభుత్వ పథకాలనుసకాలంలో ప్రజలకు అందజేసి నిర్థేశించిన లక్ష్యాలను అధిగమించాలని జెడ్పి చైర్‌పర్సన్ చైదరి ధనలక్ష్మీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం జెడ్పి సమావేశ మందిరంలో 2,4,1,7,3,5,6వ స్థాయి సంఘసమావేశాలు జరిగాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశాల్లో ముందుగా 2,1,7వ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. 4,3,5,6 ఫోరం సభ్యులు హాజరు కాకపోవడంతో ఆయా సంఘ సమావేశాలను వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో పథకాలను అందిస్తుందని వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు కొంతమేర వినియోగించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అధికారులపై ఉందని సూచించారు. ఆదిశగా అధికారులు పనిచేయాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి, నీరు-చెట్టు, చేనేతజౌలు శాఖ అందిస్తున్న కార్యక్రమాల నిర్వహణపై ఆమె సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను అధిగమించడంలో ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. ఎన్ టి ఆర్ జలసిరి పథకాన్నివేసవి కాలంలో అమలు చేయడం ద్వారా నీటి నిల్వల స్థితిగతులు తెలుస్తాయని, వర్షాకాలంలో నీటి నిల్వల స్థాయి పెరిగి ఉంటుందని ఇటువంటి విషయాలను అధికారులు దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలను అధిగమించాలని చెప్పారు. అదే విధంగా నీరు-చెట్టు పథకం కింద ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చిస్తుందని, అయితే వాటి లక్ష్యాల అమలులో కొన్నిలోపాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మొక్కలు నాటిన అనంతరం వాటిన సంరక్షించకపోవడంతో ప్రభుత్వధ్యేయం నెరవేరడం లేదని అటువాటిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థద్వారా అందిస్తున్న స్ర్తి నిధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్ర్తినిధిని అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దనోట్లు రద్దుతో పింఛన్‌దారులకు ఏర్పడిన సమస్యను తొలగించేందుకు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డుమా, సెట్ శ్రీ, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సహకార బ్యాంకు, చేనేత-జౌలీ, పంచాయతీ రాజ్, పరిశ్రమల శాఖల పనితీరుపై వివరాలు అడిగితెలుసుకున్నారు. ఈ సమావేశాల్లో జెడ్పి సి ఈవో బి.నగేష్, డిపివో కోటేశ్వరరావు, జిల్లా సహకార అధికారి శ్రీహరిరావు, హౌసింగ్ పిడి పి ఆర్ నర్శింగరావు, సెట్ శ్రీ సి ఈవో వి వి ఆర్ ఎస్ మూర్తి, పోలాకి జెడ్పిటీసీ గొండు రామన్న ఇతర అధికారులు పాల్గొన్నారు.