శ్రీకాకుళం

కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 9: ప్రజాస్వామ్యవ్యవస్థలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో కచ్చితమైన ఓటర్ల జాబితా తయారీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు ఐ.శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరంలో 2017 స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై నిర్వహించిన సమావేశానికి ఆయన విచ్చేసారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీ ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే నిమిత్తం ముందుగా ఓటరుగా నమోదు కావాలన్నారు. అదేవిధంగా ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలో వలసపోయిన, మరణించిన, చిరునామా మారిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించి తొలగించాలన్నారు. తొలగింపు ప్రక్రియను ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలన్నారు. మరమ్మత్తులకు గురికాబడిన, శిధిలావస్థకు చేరుకున్న పోలింగు స్టేషన్లను నూతన భవనానికి మార్పు ప్రక్రియలను ముందుగానే చేపట్టి రాబోయే ఎన్నికలకు ముందుగానే సన్నద్ధం చేయాలన్నారు. కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ జనాభాలో 65 శాతం ఓటర్లుండాలనీ, జిల్లాలో 71.5 శాతం నమోదైన ఓటర్ల జాబితా, మహిళా, పురుష ఓటర్ల నిష్పత్తిని పరిశీలన చేయాలని తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయి అధికారులు నివేదికపై ఎన్నికల, సహాయ ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయి అధికారులమ నివేదికపై ఎన్నికల, సహాయ ఎన్నికల అధికరాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తుదిజాబితా తయారు చేయాలన్నారు. ఈ నెల 11న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో నూతన ఓటరుల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియలో భాగంగా ఫారం 6,7,8,8ఎలలో పూరించి సమాచారాన్ని సంబంధిత పోలింగ్ కేంద్రాలలో సంబంధిత అధికారులకు అందజేయాలని తెలిపారు. జిల్లాలోని ఓటర్లు దీనిని సద్వినియోగం పరుచుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జెసీ-2 రజనీకాంతారావు, డి.ఆర్.డి.ఎ. పీడీ కిషోర్, భూసేకరణ అధికారులు మరియు ఎన్నికల అధికారులు సీతారామారావు, బి.గోవర్ధనరావు, ఆర్డీవోలు బి.దయానిధి, గున్నయ్య, సహాయ ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.