శ్రీకాకుళం

నగదురహిత లావాదేవీల ప్రచార రథం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 9: మారుమూల గ్రామాల్లోని నగదురహిత లావాదేవీలపై అవగాహన కలిగించేందుకు ఆర్‌బిఐ స్టేట్‌బ్యాంకు ఏర్పాటు చేసిన సంచార రథాన్ని ఓటర్ల జాబితా పరిశీలకుడు ఐ.శ్రీనివాస శ్రీనరేష్, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్ బిఐ రీజనల్ మేనేజర్ డి.మేరీసగాయతోపాటు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రజలకు నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి-2 పి.రజనీకాంతారావు, ఎస్ బి ఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

‘ఎన్టీఆర్ వైద్య సేవలపై అసత్యప్రచారం’
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 9: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)పై వైకాపా నేతలు అసత్యప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి ఆరోగ్యభద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసి ప్రజారోగ్య వ్యవస్థను చక్కదిద్దే కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. వైకాపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ముకాసి ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం చేశారని ఆమె విమర్శించారు. 2004 సంవత్సరానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం స్విమ్స్‌లో అమలు చేసిన ప్రాణదానం పథకానికి పేరుమార్చి ఆరోగ్యశ్రీగా పేరుమార్చారని 2009 నవంబర్ వరకు 23 జిల్లాల్లో రూ.1361కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి రెండుశాతం నిధులు కేటాయించగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతం 5శాతం వరకు నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఎన్టీ ఆర్ వైద్యసేవ కిందకు రాని వారికి కూడా వైద్యభీమా సదుపాయం కల్పిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు.

చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి : కలెక్టర్
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 9: చేనేత కార్మికులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో చేనేత జౌలు శాఖ కమిషనర్ ఐ.శ్రీనివాసశ్రీనరేష్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 చేనేత క్లస్టర్ భవనాలను నిర్మించామని త్వరలో వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పొందూరు ఖాదీ తయారు చేస్తున్న చేనేత కార్మికులు జీవన ప్రమాణాలు దయనీయంగా ఉన్నాయన్నారు. ప్రతీ చేనేత కార్మికుని దినసరి ఆదాయం కనీసం రూ.400 పొందే విధంగా వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ కార్మికుడికి నిరంతరం పనికల్పించడం, నూతన ప్రక్రియలపై శిక్షణ ఇవ్వడం తయారైన వస్త్రాలకు మార్కెట్ సౌకర్యం కల్పించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జెసి-2 పి.రజనీకాంతారావు, శ్రీకాకుళం, విజయనగరం ఏడిలు జి.రాజారావు, పెద్దిరాజు, సర్వశిక్ష అభియాన్ కార్యనిర్వహకా ఇంజినీరు సుగుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.