శ్రీకాకుళం

దివ్యదర్శనాన్ని సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, డిసెంబర్ 9: రాష్ట్ర దేవాదాయ శాఖ నిరుపేద వర్గాలకు ఉచితంగా పుణ్యక్షేత్రాలు దర్శనార్థం దివ్యదర్శనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలి తహశీల్దార్ జె.రామారావు తెలిపారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దివ్యదర్శనానికి సంబంధించి పెట్టెను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ నెల రెండుసార్లు పుణ్యక్షేత్రాల దర్శనానికి ఉచితంగా బస్సు సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వివరించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసి కులాలకు సంబంధించి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇవో రమణయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
‘వందనోట్లు వస్తే పింఛన్ ఇస్తాం’
సారవకోట, డిసెంబర్ 9: పెద్దనోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిణామాలలో భాగంగా బహిరంగ మార్కెట్‌లోనే కాకుండా బ్యాంకుల్లో కూడా చిల్లర కొరత శుక్రవారం కూడా తీవ్రరూపం దాల్చింది. పింఛన్ లబ్ధిదారులకు రూ.1000 పైకాన్ని ఇవ్వలేని స్థితి బ్యాంకుల్లో నెలకొంది. తమ బ్యాంకులో రూ.2వేల నోట్లు మాత్రమే అతికొద్దిగా ఉన్నాయని ఉన్నతాధికారులకు రూ.100నోట్లు సరఫరా చేసిన రోజు తాము పింఛన్ లబ్ధిదారులకు రూ.1000చొప్పున సొమ్ము చెల్లించగలమని మండల కేంద్రంలో గల గ్రామీణ బ్యాంకు సిబ్బంది స్పష్టంచేశారు. దీనితో వందలాది మంది పింఛన్ దారులు ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఇద్దరు లబ్ధిదారులకు కలిసి రూ.2వేలను మూడు రోజులుగా చెల్లించిన బ్యాంకు అధికారులు శుక్రవారం నాటికి పూర్తిగా తమ నిస్సహాయతను ప్రకటించారు.
ముగిసిన కానిస్టేబుళ్ల ఎంపిక
ఎచ్చెర్ల, డిసెంబర్ 9: కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 5 నుండి శుక్రవారం వరకు స్థానిక ఎఆర్ పెరడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఎంపికలు శుక్రవారంతో ముగిశాయి. రాత పరీక్షకు 4753మంది అర్హత సాధించగా 4344మంది శారీరక కొలతలకు హాజరయ్యారు. వీరిలో 3625మంది క్రీడాంశాలకు ఎంపికయ్యారు. సెన్సర్ల వ్యవస్థతో క్రీడాంశాలు పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ సాంకేతిక లోపాలు తల్లెత్తడంతో ఈ పరీక్షలు మరింత జాప్యం చోటుచేసుకున్న విషయం విదితమే. అయితే, క్రీడాంశాలకు అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈనెల 21 నుండి 23వరకు 100, 1600 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్‌ను నిర్వహిస్తున్నట్టు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జె.బ్రహ్మారెడ్డి స్పష్టంచేశారు. క్రీడాంశాల షెడ్యూల్‌ను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అర్హత సాధించిన అభ్యర్తులకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు. క్రీడాంశాల్లో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తామని ఎస్పీ స్పష్టంచేశారు. ఈ ఎంపిక ప్రక్రియ పర్యవేక్షించిన వారిలో ఎఎస్పీ తిరుమలరావు, డిఎస్పీలు భార్గవరావునాయుడు, వివేకానంద, ఆర్‌ఐ కోటేశ్వరరావు, సిఐ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.