శ్రీకాకుళం

అధిగమిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్); డిసెంబర్ 9: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం ఆర్టీసీకాంప్లెక్స్‌ను పరిశీలించారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విషయాలపై ప్రాంతీయ మేనేజర్ ఆర్.అప్పన్నను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆర్టీసీ ప్రస్తుత కొంతమేర నష్టాల్లో ఉందని దాన్ని భర్తీ చేసే చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రతీ రోజు 69లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరుస్తోందన్నారు. అయితే ప్రైవేటు వాహనాలు రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నాయని వాటి సేవలను కోటి మందికిపైగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఇతర సంస్థల నుండి రావాల్సిన బకాయిలు ఉన్నాయన్నారు. ఆర్టీసీ కార్మికుల పింఛన్ గూర్చి ప్రస్తావించగా సంస్థ ముందుగా కుదుటపడాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం తక్కువగా ఉందని తెలియజేయగా వాటిని పరిష్కరిస్తామన్నారు.
డెస్క్ జర్నలిస్టుకు బస్సు
సౌకర్యం కల్పించాలి
డెస్క్ జర్నలిస్ట్‌లకు బస్సు సౌకర్యం కల్పించాలని జర్నలిస్ట్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఎం.డి మాట్లాడుతూ సమాచార శాఖామంత్రి పల్లె రఘునాధరెడ్డి ఈ విషయంపై చర్చించారని ఇది ఆర్థికపరమైన నిర్ణయమని బోర్డు మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమీషనర్ సిహెచ్ శ్రీదేవి, డెప్యూటీ సిటిఎం కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.