శ్రీకాకుళం

పీకనొక్కేస్తారు... జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 9: బీదోళ్ళ పీకనొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే - వచ్చే ఎన్నికల్లో టిడిపి పాలకుల పీకను బీదలు నొక్కేస్తారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ కలెక్టరేట్ వద్ద జిల్లా వైకాపా ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ప్రజాహక్కు అంటూ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం బీదలకు ఎంతో ప్రయోజనకారైన పథకమన్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదవర్గాలు, శ్రమజీవులు, అణగారిన వర్గాలు, మైనార్టీలు, గొంతువిప్పి గట్టిగా మాట్లాడలేని వర్గాల తరుఫున నిలబడి మాట్లాడే పార్టీయే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీదవర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం లేనిరోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రి అంటే పేదలు భయపడేవారని, బిల్లులు చెల్లించేందుకు ఆందోళన ఉండేదన్నారు. సంపన్నుడే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు ఆలోచించే రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పేదోడు డబ్బులు చెల్లించే కౌంటర్ ఎక్కడఉందో కూడా చూడకుండా వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. బీదకుటుంబాలు కూలీలతో గడిపే 80 శాతం మంది ప్రజలు తల్లిదండ్రులు, వారి పిల్లలు, మనుమలో మంచానపడితే డాక్టర్ వద్దకు పట్టుకుపోయేవారని, మందులున్నాయి, డాక్టర్లు ఉన్నారు, ఆసుపత్రి ఉంది కాని - ఆరోగ్యశ్రీ లేదుకనుక లక్షలాది రూపాయలు కావాలంటూ కార్పొరేట్ ఆసుపత్రులు
చెప్పేవారని, అదే ఆరోగ్యశ్రీ అమలు చేసిన తర్వాత దర్జాగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుని ఇంటికి ధైర్యంగా బీదోళ్ళు వచ్చేవారని, వైఎస్సార్ ప్రభుత్వం ఉంటే చాలు అన్నట్టు బీదలకు భరోసా కల్పించిందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి బీదలపై కన్నుకుట్టుందని, బీదల సంక్షేమాన్ని హరించేస్తున్నారంటూ ధర్మాన ఆరోపించారు. బీదలకు అన్యాయం జరగకుండా నిలబడేందుకు వైకాపా ఉందని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే సర్కార్ పీక నొక్కేయడానికి బీదలు సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి కావల్సిన బడ్జెట్‌ను పెంచకపోవడానికి పథకాన్ని నీరుగాల్చడానికే అంటూ ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పథకం నిర్వీర్యం అవుతుందన్న
పన్నాగం రాష్టమ్రంతటా జరుగుతుందన్నారు. క్యాబినెట్ సమావేశాల్లో వేలాది ఎకరాల భూములు కేటాయింపులు, సర్కార్ రియల్‌ఎస్టేట్ వ్యాపార నిర్ణయాలే తప్ప ఏమీ జరగడంలేదన్నారు. పదేళ్ళు క్రితం చేసిన తప్పులు మళ్లీమళ్లీ బాబు చేస్తున్నారని, ప్రజలకు వైద్యం, విద్య రాజ్యాంగం హక్కు అన్నారు. ఆదాయం పెరుగుతున్న కొద్ది ఆ రంగాలకు నిధులు కేటాయింపులు పెంచాల్సివున్నప్పటికీ, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రిఫర్ చేయడమే ఇక్కడ రిమ్స్ ప్రధాన విధి అంటూ ఆరోపంచారు. అటువంటి పరిస్థితులపై పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులు ఓవరాయాక్షన్, కలెక్టర్ మట్టి, మొక్కలు నాటడం ఇదేనే బీదలకు సాయం చేయడమంటు ప్రశ్నించారు. బీదల తరుఫున వైకాపా పోరాటం చేస్తోందని, సర్కార్ మారాలని చెప్పేందుకే ఈ ధర్నా అన్నారు. నేను మారుతాను అంటూ...మారలేదని సి.ఎం. నిర్ణయాలు రుజువుచేస్తున్నాయన్నారు. ఎకరాల భూములు అమ్ముకోవడం తప్ప రెండున్నర ఏళ్ళుగా ఏమీ చేయలేదన్నారు. కలెక్టర్ చలనం లేని విగ్రహంలా ప్రభుత్వం మార్చేసిందన్నారు. పోలీసులకు ఇసుకలారీలపై జనం ఫిర్యాదులు చేస్తే ఏ పార్టీదంటూ అడగడంలో వారి విధులు పారదర్శకత ఏమిటో అర్థమవుతుందన్నారు. ఇటువంటి పరిస్థితులపై వైకాపా బీదల తరుఫున మాట్లాడాలని, వైఎస్సార్ స్వరాన్ని మన స్వరంగానే వినిపించాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. దొంగలు, అవినీతిపరులు, అడ్డగోలుగా ధనవంతుల పల్లకిలు మోసిన ప్రభుత్వం అంటూ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీదల తరుఫున పోరాటానికి నడుంకట్టి, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా కాపాడుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. దీనికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే బీదల ఆగ్రహానికి ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ధర్మాన హెచ్చరించారు.