శ్రీకాకుళం

అవినీతిపరులను ప్రోత్సహిస్తున్న పాలకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 9: అవినీతి అంటే ఆగ్రహం కట్టలు తెంచుకుని - పాలకులైనా, ప్రభుత్వ అధికారులైనా కడిగిపారేయడం కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహంకు అలవాటే. అదే రీతిలో మరోసారి శుక్రవారం ఎసీబీశాఖ అధ్వర్యంలో ఇక్కడ సూర్యమహాల్ జంక్షన్‌లో ప్రారంభించిన విద్యార్థుల ర్యాలీని ప్రారంభించేందుకు వచ్చిన కలెక్టర్ వందకోట్ల నల్లధనం, 100 కేజీల బంగారంతో ఐటీ అధికారులకు పట్టుబడిన శేఖర్‌రెడ్డి ఉదాంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అతి పవిత్రమైన తిరుమలతిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా ఇంటువంటి నల్లకుబేరులను ఎంపిక చేసి పాలకులు తప్పు చేస్తున్నారని సుతిమెత్తగా తెలుగుదేశం ప్రభుత్వంపై చురకులు వేశారు. అవినీతిపరులను ప్రోత్సహించే విధానంలో పాలకులు ఉన్నంతవరకూ భావితరాలకు అవినీతిరహిత సమాజాన్ని అందించలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యువతే అవినీతి రహిత సమాజ స్థాపనకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లేనే ఉందని, యువత తలచుకుంటే సాధించలేనిదీ ఏమీ లేదని పేర్కొన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల ముగింపు సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఏసీబీ డి.ఎస్పీ కరణం రాజేంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. అవినీతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, అటువంటి వ్యవస్థను ప్రోత్సహించరాదని చెప్పారు. జిల్లాలో అవినీతి నిరోధకశాఖ పనితీరు బాగుందని, అవినీతిపరులపై చర్యలు చేపడుతున్న ఎసీబీశాఖ అధికారులను అభినందించారు. అనంతరం ఎసీబీ శాఖ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎసీబీ డి.ఎస్పీ కరణం రాజేంద్ర మాట్లాడుతూ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాలను ఈ నెల 3వ నుంచి జిల్లాలో నిర్వహించుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వ,
ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల అవినీతికి వ్యతిరేకంగా ఈ వారోత్సవాలను జరుపుకుంటున్నామని, అవినీతిని నిర్మూలిద్దాం-నిశ్శబ్ధాన్ని చేదిద్దాం, అవినీతిని ప్రశ్నిద్దాం -దేశ భవిష్యత్తును కాపాడుదాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అవినీతిపై ప్రజల్లో చైతన్యం రావాలని, ముఖ్యంగా యువత చైతన్యం పొంది ఈ అవినీతిని అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎసీబీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు బరాటం కామేశ్వరరావు, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డీన్ ఆచార్య డి.కృష్ణమూర్తి, ఇందిరాప్రసాద్, వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

...

ఆంధ్రభూమి బ్యూరో
ధర్నా విజయవంతం

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 9: పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి రూపొందించిన రాజీవ్‌గాంధీ ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ వైద్య సేవ అంటూ పేరు మార్చిన తెలుగుదేశం ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తుందని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలుకు పిలుపునిచ్చారు. దీనితో ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం కలెక్టరేట్‌కు చేరుకొని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై నిరసన గళం వినిపించారు
బీసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ ఎనలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. జిల్లాలో రాక్షస పాలన సాగుతుందని రైతాంగం అదోగతి పాలౌతున్నారన్నారు. జిల్లాకు చెందిన మంత్రులకు సంపాదన తప్ప వేరే పనిలేదని పేదలకు జరిగిన అన్యాయం పట్ల జిల్లా కలెక్టర్ స్పందించాలన్నారు. మాజీ మంత్రి, హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ పెద్దపీఠ వేశారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి కార్యక్రమాలు ఆ వ్యక్తి మరణం తరువాత దాని విలువ తెలిసిందని ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తే ప్రతిఘటన చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పేదల సంజీవినిని నిర్వీర్యం చేస్తే సహించేది లేదన్నారు. టిడిపి నాయకులు ఆర్భాటాలకు, కృష్ణాపుష్కరాలకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారే తప్ప ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయింపులు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, నేతలు ఎన్ని ధనుంజయ, చల్లా రవికుమార్, టొంపల సీతారాం, గొర్లె కిరణ్, అందవరపు వరహానృసింహం, అందవరపు సూరిబాబు, ఎం వి పద్మావతి, మామిడి శ్రీకాంత్, సురంగి మోహనరావు, చిట్టి జనార్థనరావు, పిరియావిజయ, సురవరం పాపారావు, సనపల నారాయణరావు, శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు.