శ్రీకాకుళం

అణుపార్కు రద్దు చేస్తారా? లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణస్థలం, డిసెంబర్ 27: కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటు చేస్తారా? పూర్తిగా రద్దు చేస్తారా? ఏదో ఒకటి తేల్చాలని అధికారుల ముందు కొవ్వాడ నాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. ఏళ్ళ తరబడి కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇప్పటికీ ఏదీ తేల్చకుండా
నానుస్తున్నారని దీని వలన అభివృద్ధికి దూరం అవుతున్నామని వారు పేర్కొన్నారు. కొవ్వాడ గ్రామంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఇటీవలి నిర్వహించిన సర్వే వివరాలను మత్స్యకారుల ముందు ప్రకటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు అధికారుల ముందు 20రకాలతో కూడిన డిమాండ్లను పెట్టారు. తమకు అనుకూలమైన ప్రాంతంలోనే పునరావాస కాలనీ నిర్మించాలని, అదే విధంగా ప్రతీ ఇంటికీ ఒక ఉద్యోగం ఇవ్వాలని, పదిసెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించాలని తదితర డిమాండ్లను అధికారులు ముందు చెప్పారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మత్స్యకారులకు అనుకూలంగానే ప్యాకేజీ ఉంటుందని ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పునరావాస కాలనీ ఏర్పాటు చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరుస్తామని ప్రకటించారు. గ్రామ సభ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా సీటు నేతలను ఉదయానే్న అదుపులోనికి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దయానిధి, భూసేకరణ అధికారి సీతారామరావు, సర్పంచ్, మత్స్యకార నాయకులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అలసత్వం వద్దు
పాలకొండ(టౌన్), డిసెంబర్ 27: విధులు నిర్వహించడంలో అలసత్వం కారణంగానే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సకాలంలో చేరడం లేదని కలెక్టర్ లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. ఆర్‌డిఒ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం డివిజన్‌లోని 13 మండలాల రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డివిజన్‌లో 10.53 కోట్ల రూ.లు నీటితీరువా బకాయిలు ఉందన్నారు. మండలాల వారీగా ఇప్పటివరకు వసూలైన బకాయిలపై తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. పాలకొండ మండలంలో 1.27 కోట్ల బకాయి ఉండగా, ఇప్పటివరకు రూ.4 లక్షలు మాత్రమే వసూలైన వైనంపై ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్‌లోని 13 మండలాల్లో కూడా ఇదే తీరు ఉందన్నారు. కనీసం 20 శాతం కూడా ఏ మండలంలోనూ నీటితీరువా వసూళ్లు జరగలేదు. దీంతో తహశీల్దార్ల పనితీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా మండల రెవెన్యూ యంత్రాంగంతో సమావేశం నిర్వహించి వసూళ్లపై దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం రాకపోతే జీతాలు ఏ విధంగా చెల్లింపులు జరుగుతాయని, మీకు రావాల్సిన జీతం ఆలస్యమైతే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అలాగే రహదారులకు ఇరువైపులా ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ రాళ్లే కనిపిస్తున్నాయన్నారు. నాలా వసూళ్లు మాత్రం కనీసం చూపించడం లేదని, రియల్ వ్యాపారులపై ఎందుకు
మక్కువ చూపిస్తున్నారో అని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలపై ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పించాలన్నారు. నిరక్షరాస్యులు సైతం ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరిపే విధంగా కృషి చేయాలన్నారు. నీటితీరువా వసూళ్లు, నాలా చెల్లింపులు కూడా ఆన్‌లైన్ ద్వారా జరపాలని సూచించారు. జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమానికి పూర్తి సమాచారంతో సిద్ధం కావాలని చెప్పారు. అలాగే మండల కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్మార్ట్ సర్వే ఇప్పటికే పూర్తి కావాల్సి వచ్చిందని, మరింత వేగవంతం చేసి నివేదికను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి చక్రధర్‌బాబు, జిల్లా సర్వేశాఖ ఎడి, ఆర్‌డిఒ రెడ్డి గున్నయ్య, డివిజన్‌లోని 13 మండలాల తహశీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.