శ్రీకాకుళం

భూసేకరణ చట్టాన్ని సవరించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 12: భూ సేకరణ 2013 చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, సవరణలు చేయాలనుకుంటున్న ఆలోచనలను విరమించుకోవాలని భూహక్కుల పో రాట కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చే సింది. క్రాంతిభవన్‌లో శుక్రవారం కె.మోహనరావు అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ బడాపెట్టుబడి దారులకు, కార్పొరేట్లకు పేదల భూములను దారాదత్తం చేయడానికి భూములపై ఆధారపడిన పేదలకు నష్టపరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 2013 భూసేకరణ చట్టాన్ని సవరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని, తక్షణమే మంత్రివర్గ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
బ్రిటిష్ ప్రభుత్వం 1894లో భూసేకరణ చట్టాన్ని తెచ్చి రైతుల భూములను గుంజుకొని దానిపై ఆధారపడిన పేదల కడుపులు కొట్టారని, అదేచట్టం 2013 వరకు అమలు జరిగిందని, దీనికి వ్యతిరేకంగా వా మపక్ష, ప్రజాతంత్ర శక్తులు రైతాంగ పోరాటాల ఫలితంగా 2013 భూసేకరణ చట్టం సాధించుకున్నారన్నారు.
సా మాజిక ప్రభావం అంచనా రైతాంగం ఆమోదం, భూమిపై ఆధారపడిన ప్రజలకు న్యాయమైన పరిహారం రెండు పంటల భూమిని తీసుకోరాదన్న వాటి ని సవరించి పేదలకు అన్యాయం చేసేందుకు పూనుకుందని, ఈ ఆలోచనను తక్షణమే విరమించాలని కోరారు. జిల్లా లో వంశధార ఆఫ్‌సోర్ ఇతర ప్రాజెక్టుల్లో 2013 చట్టాన్ని అమలుచేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా కార్యదర్శి కోరాడ నారాయణరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, లండ వెంకటరావు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తా మాడ సన్యాసిరావు, తిరుపతిరావు, సిటు నాయకులు ఏ.సత్యన్నారాయణ, వై.చలపతి, గొండు రఘురాం, గేదెల చిరంజీవులు పాల్గొన్నారు.

‘సంస్కృతీ, సాంప్రదాయాలను గౌరవిద్దాం’
గార, జనవరి 12: భారతీయుల సంస్కృతీ, సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని గౌరవిస్తూ భావితరాలకు చాటిచెప్పాలని ఎం.పి.పి. గుండ అమ్మలు స్పష్టం చేశారు. మండలం కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయిలో సంక్రాంతి సంబరాలు అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.పి.పి. అమ్మలు మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో నాటి సంస్కృతి, సంప్రదాయాలు కొంతవర కు విస్మరించే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. సాంప్రదాయబద్ధమైన సాంస్కృతిని భావితరాలకు అందజేసే దిశగా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, సర్పంచులు బడగల వెంకటప్పారావు, గొండు వెంకటరమణమూర్తితోపాటు పీస వెంకటరమణమూర్తి, ఎంపిడిఓ ఆర్.స్వ రూపరాణి, తహశీల్దారు సింహాచలం సం క్రాంతి సంబరాలుపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం గావించారు. సాంకేతికంగా వ్యవసాయం చేస్తున్న వమరవెల్లి పంచాయతీ సుగ్గుదాలినాయుడుపేటకు చెందిన జేరి విజయ్‌కుమార్‌కు పురస్కారం అందజేశారు.