శ్రీకాకుళం

విధులే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జనవరి 20: విధులే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజల్లో మంచి గుర్తింపుఇస్తాయని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ స్పష్టంచేశారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడిఓగా విధులు నిర్వహించి డుమా ఏపిడిగా డెపిటేషన్ బదిలీ అయిన పంచాది రాధ అభినందన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగులకు అంకితభావం తప్పనిసరి అన్నారు. సమర్థత, ప్రజా సంబంధాలు నెరపడంలో రాధ అందరి మన్ననలను పొందారని కొనియాడారు. ప్రభుత్వ లక్ష్యాలు అధిగమించేందుకు నిరంతరం శ్రమించే అధికారిణిగా పనిచేసిన ప్రతీచోటా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అందరిని కలుపుకొని సమస్యలను పరిష్కరిచడంలో ముందువరుసలో ఓ అధికారిణి నిలవడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా పూర్వపు అధ్యక్షుడు చౌదరి బాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఇటువంటి అధికారుల వలన మంచిపేరు లభిస్తుందన్నారు. తహశీల్దార్ కిమిడి రామ్మోహన్, ఇన్‌ఛార్జి ఎంపిడివో మిశ్రా, ఇవోఆర్డీ మోహన్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, కార్యదర్శి వి.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాది రాధను అందరూ ఘనంగా సన్మానించారు.

విద్యార్థులకు విశాఖ డెయిరీ ఉపకార వేతనాలు
గార, జనవరి 20: జిల్లాలో తొమ్మిది, పది, ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ. చదువుతున్న విద్యార్థిని, విద్యార్ధులకు విశాఖ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ద్వారా ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు విశాఖ డెయిరీ ప్రతినిధి రమణ స్పష్టం చేశారు. మండలం అంపోలు పంచాయతీ లింగాలవలసలో ఉప సర్పంచు ముద్దాడ సత్యం ఆధ్వర్యంలో విశాఖ డెయిరీ రైతుల కుటుంబాల విద్యార్థిని, విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ శుక్రవారం చేపట్టారు. ఈసందర్భంగా విశాఖ డెయిరీ ప్రతినిధి రమణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారుల కుటుంబాల విద్యార్థ్ధులకు 500 రూపాయలు చొప్పున నాలుగువేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముద్దాడ గోవిందరావు, శీర శ్రీరాములు, సూపర్‌వైజర్ రమణ పాల్గొన్నారు.