శ్రీకాకుళం

ప్రాణాలు పోయే వరకు వైర్లు సరిచేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జనవరి 20: గ్రామాలలో విద్యుత్ వైర్లు క్రిందకు వేలాడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని, విరిగిపోయిన స్తంభాలు ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని కూర్మనాథపురం సర్పంచ్ సుధాకర్, ఎంపిటిసి రాము విద్యుత్ అధికారులపై ధ్వజమెత్తారు. శుక్రవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ శాఖ పనితీరుపై వీరు నిలదీశారు. అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని, ప్రాణాలు పోయేవరకు ఈ పనులు చేపట్టరా? అంటూ ఏఇ శ్రీనివాస్‌ను నిలదీశారు. ఒకటి రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని ఏఇ ఇచ్చిన హామీపై సర్పంచ్‌లు సంతృప్తి చెందలేదు. ఈ దశలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మండలాధ్యక్షుడు చిన్నాల కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెలుగు శాఖపై జరిగిన చర్చలో కూర్మనాథపురం, అవలింగి ధర్మలక్ష్మీపురం సర్పంచ్‌లు సుధాకర్, ధర్మారావు, కాళ్ల సింహాచలం, చీడిపుడి ఎంపిటిసి నిక్కు కృష్ణారావు మాట్లాడుతూ పసుపు-కుంకుమల పేరుతో ప్రభుత్వ డబ్బులు బ్యాంకు నుండి ఇవ్వడానికి వెలుగు శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది ఒక్కో మహిళ నుండి సేవా రుసుము పేరుతో రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని, వసూలు చేసిన సొమ్ములను తిరిగి మహిళలకు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మండలంలో 18 సంఘాలకు వివిధ కారణాల వలన పసుపు-కుంకుమ డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ చేయలేదని ఏ.పిఎం ఈశ్వరరావు తెలిపారు. చంద్రన్నబీమాలో లబ్ధిదారుల జాబితాలను ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారని, బీమా డబ్బులు చెల్లించిన వారికి రశీదులు ఇవ్వడం లేదని కూర్మనాథపురం సర్పంచ్ సుధాకర్ నిలదీశారు. అవలంగి గ్రామానికి సమీపంలో దొర చెరువు పనులు చేపట్టకుండానే నీరు-చెట్టు పథకం కింద డబ్బులు చెల్లించారని, ఇదే ధర్మలక్ష్మీపురం పంచాయతీ పాటూరు వద్ద అడ్డుకర్ర చెరువు మదుము కూలిపోయిందని, దీనిని వెంటనే నిర్మించాలని సర్పంచ్ కాళ్ల సింహాచలం డిమాండ్ చేశారు. అటవీ శాఖ పద్దుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జోక్యం చేసుకొని ఏనుగుల సంచారంపై ఆరాతీశారు. ఇప్పటివరకు ఏనుగుల దాడి వలన పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని, నష్పపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుడితి ఆరోగ్య కేంద్రానికి రక్తపరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సిబ్బందిని నియమించాలని వైద్యాధికారి చింతాడ కృష్ణమోహన్ సభ దృష్టికి తెచ్చారు.
ఉపాధ్యాయుడు లేని కారణంగా తమపంచాయతీ పరిధిలోని మర్రిపాడు పాఠశాలను సమగ్రగిరిజనాభివృద్ధి సంస్థ అధికారులు మూసివేశారని, గ్రామంలో 17మంది విద్యార్థులు ఉన్నారని సర్పంచ్ సుధాకర్ సభ దృష్టికి తెచ్చారు. ఇటీవల మృతి చెందిన జమచక్రం సర్పంచ్ బోర నారాయణమ్మ ఆత్మశాంతికి సమావేశంలో సభ్యులు రెండు నిముషాలు వౌనం పాటించి సంతాపం తెలియజేశారు. చిరవగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ గ్రామాలకు, గ్రామపంచాయతీలకు విడుదలైన నిధులను మార్చి నెలాఖరులోగా ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని , సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. రాబోవు వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఇప్పటినుంచే చర్యలు గైకొనాలని, వివిధ స్థాయిలలో ఉన్న రక్షితమంచినీటి పథకాల నిర్మాణాలు పూర్తి చేయించడానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఏ ఎం సి చైర్మన్ వెలమల చంద్రభూషణ్, ఎంపిడివో లవరాజు, తహశీల్దార్ ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షులు జయలక్ష్మీ, ప్రత్యేక సలహాదారుడు వెంకటరావు పాల్గొన్నారు.

టెన్త్ పరీక్షలకు 424మంది విద్యార్థులు
సారవకోట, జనవరి 20: తన పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల నుండి ఈ ఏడాది 424మంది గిరిజన విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారని మెళియాపుట్టి ఏపిడబ్య్లూఓ కె.వెంకటరమణ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ తన పరిధిలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, సారవకోట, ఎల్ ఎన్ పేట, కొత్తూరు మండలాల పరిధిలో 14 పాఠశాలలు ఉన్నాయని, ఇందులో పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఉన్నట్లు ఆయన చెప్పారు. అత్యధికంగా 327మంది బాలికలు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇటీవల ఆల్ ఇన్ వన్ పుస్తకాలను సరఫరా చేశామన్నారు. ఐటిడిఏ సీతంపేట పరిధిలో గత ఏడాది 1891మంది విద్యార్థులు 10వ తరగతి విద్యార్థ్ధులు పరీక్షలు రాయగా, 1839మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొంది 97.25శాతం ఫలితాలు సాధించారని తెలిపారు. ఈ ఏడాది శతశాతం ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నామని వెంకటరమణ తెలిపారు.