శ్రీకాకుళం

రైలులోనే కవలలు జననం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జనవరి 20: బెంగుళూరు నుంచి బీహార్‌కు రైలులో ప్రయాణిస్తున్న తలాత్ పర్వాంగ్ ఆడ,మగ శిశువులకు జన్మనిచ్చింది. రైలు పలాస రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి ముందే ఆమెకు పురిటినొప్పులు రావడంతో ప్రయాణీకులు సహకరించడంతో రైలులోనే పండంటి కవలలకు జన్మించింది. ఈ విషయాన్ని రైల్వేసిబ్బంది స్థానిక రైల్వేస్టేషన్ మాస్టర్ స్వామికి సమాచారం అందించడంతో స్టేషన్‌మాస్టర్ రైలు వచ్చే సమయానికి వైద్యసిబ్బందిని ఏర్పాటుచేశారు. తల్లిబిడ్డలను చికిత్స నిమిత్తం 108లో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి తల్లిబిడ్డలు క్షేమమేనని చెప్పారు. ఈమెతోపాటు భర్త ఎం.డి.అక్రమ్ ఉన్నారు.
హక్కులు చట్టాలపై అవగాహన ఉండాలి
* జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి మేరీగ్రేస్‌కుమారి
శ్రీకాకుళం(రూరల్), జనవరి 20:్భరత రాజ్యాంగ కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలని, అప్పుడే వారికి తగిన న్యాయం చేకూరుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.మేరీగ్రేస్‌కుమారి అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పిఎన్‌కాలనీలోని సాయివిద్యామందిర్‌లో హక్కులు-చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. వలస కూలీలకు ఎక్కువ డబ్బులను ఆశచూపి మహిళల అక్రమ రవాణా జరుగుతున్న సంగతిని గుర్తు చేశారు. అటువంటి వాటి నిరోధించేందుకు మానవ అక్రమ రవాణా చట్టం ఒకటుందని, దాని గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలన్నారు. బాలలను అక్రమంగా తరలించి బాల కార్మికులుగా చేస్తున్నారని, అటువంటి వాటిని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్రమ రవాణాపై ఏ ఒక్కరికైనా సమాచారం అందినట్లయితే తమ సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం తెలిపినట్లయితే వాటిని నిరోధించవచ్చునన్నారు. అనంతరం వివిధ చట్టాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ప్రతీ విద్యార్థి చట్టాలతోపాటు ప్రభుత్వాలు కల్పించిన హక్కులు తెలుసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో పేనల్ లాయర్ జి.ఇందిరప్రసాద్, శ్రీసాయివిద్యామందిర్ డైరెక్టర్ సూర్యారావు, ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, కార్యదర్శి ఎస్.లక్ష్మీ, న్యాయవాదులు జి.విశాలాక్షి పాల్గొన్నారు.