శ్రీకాకుళం

యుద్ధప్రాతిపదికన వంశధార పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 20: వంశధార, తోటపల్లి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకొని జూన్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఉపాధి కార్మిక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ నాటికి నీరు విడుదల చేసి రైతుల సాగునీటి కష్టాలు అధిగమించాలన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలాఖరు నాటికి తోటపల్లి ప్రాజెక్టుకు భూసేకరణ పనులు పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు జరపాలన్నారు. ప్రభుత్వపరంగా, న్యాయపరంగా నిర్వాసితులకు అన్ని సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామన్నారు. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు పనులకు అడ్డు తగిలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిష్ఠాత్మక వంశధార పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. భూసేకరణ జరగాల్సిన వంశధార ఇతర జలవనరుల ప్రాజెక్టుల పనులకు ఆ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే నష్టపరిహారం చెల్లించిన కోరాడ గ్రామంలో గృహ కట్టడాలను తక్షణమే చెల్లించి పనులు ప్రారంభించాలని వంశధార ఎస్‌ఇని ఆదేశించారు. ఇందుకోసం 70మంది సభ్యులతో కూడిన పోలీస్ బృందాన్ని ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగిన చోట వినియోగించాలన్నారు. వంశధార ప్యాకేజీ-87లో మట్టి పనులు, కాంక్రీటు పనులు అనుకున్నంత స్థాయిలో జరగక పోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్యాకేజీ 88లో విద్యుత్ స్తంభం తొలగించేందుకు మూడు రోజుల్లో పూర్తి చేసి సంబంధిత కాంట్రాక్టర్‌కు భూమిని అప్పగించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఇని ఆదేశించారు. ఫిబ్రవరి మొదటివారంలో మరోసారి సమీక్షిస్తాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. హిరమండలం, గాజులకొల్లివలస, తులగాం గ్రామ ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు తక్షణమే రెండు బోర్లు నిర్మించి 10వేల లీటర్లసామర్థ్యం కలిగిన ఐదు ట్యాంకులను ఏర్పాటుచేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆర్‌డబ్య్లూఎస్ ఎస్‌ఇకి సూచించారు. నీతి అయోగ్ కింద జనవరి 26వతేదీన ప్రతీ గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని మంత్రి అచ్చెన్న అన్నారు. గ్రామ సభల్లో స్థానిక అవసరాలను గమనించి వాటిపై చర్చించాలని తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరపాలన్నారు. ఈసభలను ఫొటోలో తీయించి డాక్యూమెంటేషన్ తయారు చేసి వాట్సాప్‌లో భద్రపరచాలన్నారు.
* రథసప్తమి ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
వచ్చేనెల 3వతేదీన జరగనున్న రధసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీసూర్యనారాయణస్వామివారి దేవస్థానంలో జరగబోవు రధసప్తమి వేడుకలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది తలెత్తిన ఇబ్బందులు, లోపాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆలయ ఇవో శ్యామలాదేవిని ఆదేశించారు. ప్రముఖుల దర్శనాలను తెల్లవారుజామున 12:30- 4:00గంటల మధ్య భక్తులతోపాటు స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈఏడాది సుమారు ఐదు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ 100మీటర్ల క్యూలైన్‌లో ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ సరఫరా చేయాలన్నారు. దేవాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయ పవిత్రతకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రథసప్తమి వేడుకలు విజయవంతం అయ్యేందుకు కార్పొరేషన్, పోలీస్, హెల్త్ , ఆర్టీసీ, రోడ్ల భవనాల శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
* నగర రహిత గ్రామంగా జమ్ము
జిల్లాలో నరసన్నపేట మండలం జమ్ము గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని శతశాతం నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇదేస్ఫూర్తితో జిల్లాలో ఉన్న మిగిలిన గ్రామాలు కూడా నగదు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
* రూ.5 లక్షల చెక్కు అందజేసిన మంత్రి
ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం గతంలో కోటబొమ్మాళి ఆర్టీసీ బస్‌స్టాండ్ స్థలాన్ని రైతు బజారుగా మార్చిందని, ఇందుకు స్థలం విలువ రూ.5 లక్షల చెక్కును ఆర్టీసీ డిఎం రవికుమార్‌కు అందజేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ చెక్కును శుక్రవారం డిఎంకు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మున్సిపల్ కమీషనర్ పిఏ శోభ, జెసి చక్రధరబాబు, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, ఆర్డీవోలు దయానిధి, గున్నయ్య, వెంకటేశ్వరరావు, పిడి కిషోర్‌కుమార్, వంశధార ఎస్‌ఇ బి.అప్పలనాయుడు, అధికారులు ఉన్నారు.

కిడ్నీ వ్యాధితో మహిళ మృతి
వజ్రపుకొత్తూరు, జనవరి 20: ఉద్దానం తీర ప్రాంత గ్రామాలను కిడ్నీ వ్యాధి మహమ్మారి వణికిస్తోంది. మరో వ్యక్తి కిడ్నీ వ్యాధితో మృతి చెందింది. మండలంలోని పాత టెక్కలి పంచాయతీ మడేవానిపేటకు చెందిన మడే ముత్యాలమ్మ(56) కిడ్నీ వ్యాధితో శుక్రవారం మృతి చెందింది. గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. విశాఖ, హైదరాబాద్‌లలో గత మూడేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ వ స్తున్న ఆమె మృత్యువాత పడ్డారు. మృతురాలు విశ్రాంత విఆర్‌వో అప్పలస్వామి భార్య. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతి పట్ల మాజీ ఎంపిపి ఎం.సూర్యనారాయణ, సర్పంచ్ పి.రమణమూర్తి సంతాపం వ్యక్తం చేశారు.