శ్రీకాకుళం

పేదలను నిర్మూలించే బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 2: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేదరికాన్ని నిర్మూలించేది కాదని, పేదలను నిర్మూలించేదిగా ఉందని శ్రీకాకుళం నగర కార్యదర్శి టి.తిరుపతిరావు అన్నారు. స్థానిక పిఎస్‌ఎన్‌ఎం స్కూల్ జంక్షన్‌లో బడ్జెట్ ప్రతుల దహనం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలికే విధంగా ఉందని ఏర్పాట్ల రాయితీలు ఇచ్చారన్నారు. రైతులకు, దళితులకు, మహిళలకు మొండిచేయి చూపించారని తెలిపారు. విశాఖ రైల్వేజోన్ గురించి, వెనుకబడ్డ ఉత్తరాంధ్ర కోసం కేటాయింపులు లేకపోవడం అన్యాయమన్నారు. శ్రీకాకుళం కేంద్రానికి ఇస్తామన్న రైల్వేలైన్ కలగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ అంతా ప్రైవేటీకరణకు బలం చేకూర్చేదని తెలిపారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా వారికి ఏ ప్రయోజనాలు లేకుండా చేసే బడ్జెట్ అన్నారు. పేదలందరికీ జన్‌ధన్ యోజన ద్వారా ఎంతడబ్బులు వేశారో ప్రస్తావించలేదన్నారు. పేదలకు పరోక్షంగా రూ.75వేల కోట్ల అధిక పన్నులు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో వై.చలపతి, సూరయ్య, బి.లక్ష్మీ, నక్క అప్పన్న, చిన్నమ్మడు పాల్గొన్నారు.

రథసప్తమికి సర్వం సిద్ధం
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 2: అరవసల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు, పాలకులు సర్వం సిద్ధం చేశారు. గురువారం రాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. వెలుగుల రేడు నిజరూప దర్శనం చేసుకుంటే చాలు అనే ఆశతో ఎక్కడెక్కడ నుంచే భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూలైన్లలో ఉన్నవారికి ఎండ తగలకుండా షామియానాలు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఉచిత దర్శనం భక్తులకు అసౌకర్యం కలుగకుండా మధ్యమధ్యలో స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు డాగ్‌స్వ్కాడ్‌తో అరసవల్లి దేవస్థానం, పరిసర ప్రాంతాల్లో క్యూలైన్లవద్ద తనిఖీలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాన్ని అందించేందుకు లడ్డూలను కూడా సిద్ధం చేశారు. ముఖద్వారం నుంచి విఐపి దర్శనానికి అవకాశం కల్పించారు. వాహనాల 80 అడుగుల రోడ్డుసమీపంలోనే పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంద్రపుష్కరిణీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా లోపలికి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.