శ్రీకాకుళం

సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా వెళితేనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఫిబ్రవరి 3: టిడిపి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తుందని, సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా వెళితేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టిడిపి కార్యాలయం ఆవరణలో మున్సిపాలిటీకి మంజూరైన 454 పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రలో పేదలు పడుతున్న ఇబ్బందులను చూసి పింఛను రూ.1000 చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారని, ఈ మేరకు అమలు చేసి తమది చేతల ప్రభుత్వం అని నిరూపించారన్నారు. గత ప్రభుత్వం కేంద్రం వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు ఇస్తున్న పింఛను ఇద్దరికి రూ.200 వంతున పంచి ఆర్భాట ప్రచారం చేసుకుందన్నారు.
పలాస-కాశీబుగ్గ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.67 కోట్ల 12 లక్షలతో ప్రతిపాదన చేశామని, దీనికి భూమిపూజ ఈ నెలలోనే చేపట్టనున్నట్లు అచ్చెన్న వెల్లడించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు, అధికారుల పర్యవేక్షణలోనే అర్హులకు పింఛన్లు అందిస్తామన్నారు. పింఛన్ల ఎంపికలో పారదర్శకత పాటించామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 2 వేలు కొత్త పింఛన్లు మంజూరు చేసి చంద్రబాబు పేదల పట్ల తనకు ఉన్న నిబద్ధతను నిరూపించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి.విఠల్‌రావు, ఎఎంసి చైర్మన్ ఎం.శ్రీనివాసరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, కమీషనర్ జగన్మోహనరావు, వైస్‌చైర్మన్ జి.సూర్యనారాయణ, కౌన్సిలర్‌లు ఎల్.కామేశ్వరరావు, పి.చక్రధర్, రాంబాబు పాల్గొన్నారు.

మార్కెట్ యార్డుల్లో మరో 30 గిడ్డంగులు
నిర్మించేందుకు ప్రతిపాదనలు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో కొత్తగా మార్కెట్ యా ర్డుల్లో 65 వేల మెట్రిక్‌టన్నుల ఆహా ర ధాన్యాలను నిల్వ ఉంచేందుకు 30 గిడ్డంగులను నిర్మించేందుకు ప్రతిపాదించామని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్, డైరెక్టర్ పి.మ ల్లికార్జునరావు అన్నారు. శుక్రవా రం ఆయన స్థానిక వ్యవసాయమార్కెట్ కమిటీ, మండల పరిషత్ కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించే ఆహారధాన్యాల ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా రైతుబజార్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 114 రైతుబజారులను ఏర్పాటు చేసామని, వాటిలో 80ను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. మరో 6 సిద్దంగా ఉన్నాయన్నారు. మరో 15 రైతుబజార్లను మార్చినెలాఖరుకు పూర్తి చేయనున్నామన్నారు. మరో 13 రైతుబజార్ల నిర్మాణానికి ప్రతిపాదించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 7 చోట్ల మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కుప్పం, అనంతపురం జిల్లాలో అమరవతంలో వక్కచెక్కలను నిల్వ చేసేందుకు అనువైన మార్కెట్ యార్డులను నిర్మిస్తామని తెలిపారు. విజయనగరం జిల్లాలో రామభద్రాపురంలో కూరగాయాల యార్డు, తూర్పుగోదావరి జిల్లాలో అల్లవరం, దుర్గిలో, శ్రీకాకుళం జిల్లాలో జలుమూరులో కొత్తగా మార్కెట్ యార్డులను నిర్మిస్తామన్నారు. ఈయనతోపాటు వ్యవసాయశాఖ జెడి శ్రీనివాసరావు, డిడి సుధాకర్, ఎడి శ్యామకుమార్, ఎఎంసి ఛైర్మన్ విజయలక్ష్మి, ఎంపిడివో రేణుక, కార్యదర్శి అనూరాధ, సర్పంచ్ సింహాద్రిమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తమ్మతల్లి ఆలయంలో మల్లికార్జునరావు పూజలు నిర్వహించారు.