శ్రీకాకుళం

నగర పంచాయతీకి కరెంట్ కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, ఫిబ్రవరి 3: అధికారులు ఒకరికొకరు వారి ప్రతాపాన్ని చూపించుకున్నారు. రాజాం నగర పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది చార్జింగ్ లైట్ల సాయంతో విధులు నిర్వహించాల్సి వస్తుంది. దీనికి కారణం రాజాం రక్షిత మంచినీటి పథకానికి సుమారు రూ.23 లక్షలు బకాయి ఉన్నందున ఆ శాఖాధికారులు కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన పంచాయతీ అధికారులు ఈశ్వరనారాయణ కాలనీలో నివసిస్తున్న విద్యుత్ ఏడి ఇంటికి మంచినీటి సరఫరా నిలిపివేశారు. ఇరు శాఖల మధ్య అంతర్గత పోరు చూపర్లకు వినోదం కలిగిస్తుంది. ఇరు శాఖల అధికారులు మాట్లాడుకోవాల్సింది పోయి ఒకరిపై ఒకరు కక్ష తీర్చుకోవడం శోచనీయమని పలువురు అంటున్నారు. నగర పంచాయతీ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ శాఖకు భారీ స్థాయిలో బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేయడం లేదని చెల్లింపులు చేయడం లేదు. అలాగే నగర పంచాయతీకి కూడా అధికారులు తమ కార్యాలయాల పన్నులు చెల్లించడం లేదు. ప్రజల నుంచి రుద్ది రుద్ది బకాయి వసూలుచేస్తున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాల నుంచి వసూళ్లపై ప్రదర్శిస్తున్న అలసత్వం ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల జరిగిన పరిణామం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

కు.ని శస్తచ్రికిత్స వికటించి
బాలింత మృతి
సరుబుజ్జిలి, ఫిబ్రవరి 3: మండలంలోని సలంత్రి గ్రామ పంచాయతీ బురిడివలస గ్రామానికి చెందిన బొత్స దమయంతి(26) అనే బాలింతకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స వికటించి మృతి చెందినట్టు భర్త కృష్ణారావు తెలిపారు. తన భార్యకు గత నెల 25వతేదీన స్థానిక ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది సూచనలు మేరకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయడానికి నిర్ణయించామన్నారు. అదేరోజు ఆమదాలవలస 30 పడకల ఆసుపత్రిలో వైద్యులు దమయంతికి శస్త్ర చికిత్స నిర్వహించి ఇంటికి పంపించారని తెలిపారు. మూడు రోజుల తర్వాత శరీరమంతా ఇన్‌ఫెక్షన్ వ్యాపించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దమయంతిని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. అక్కడ వైద్యుల సూచనల మేరకు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించిందని, ఉన్నత వైద్యం కోసం విశాఖపట్నం తీసుకెళ్లమని చెప్పగా వెంటనే విశాఖపట్నం కేర్ ఆసుపత్రిలో చేర్పించామన్నారు. చికిత్స పొందుతూ ఈ నెల 3వ తేదీన తన భార్య మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఆసుపత్రిలో రూ.3 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయని, దీనిపై కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసిన వైద్యాధికారి ఇంటి ముందు మండల దళిత సంఘం ఆధ్వర్యంలో మృతదేహంతో ధర్నా చేస్తామని మండల దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఈశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దళిత కుటుంబానికి న్యాయం చేసి, బాలింత మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.