శ్రీకాకుళం

విధి నిర్వహణలో అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 20: పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జె.బ్రహ్మారెడ్డి స్పష్టంచేశారు. ఈ నెల 6వతేదీన ప్రారంభమైన మొబలైజేషన్ సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ మాట్లాడుతూ మొబలైజేషన్‌లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అన్వయించి మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావం అవసరమని గుర్తుంచుకోవాలన్నారు. కొత్త పరిశ్రమలు జిల్లాకు వస్తున్న దృష్ట్యా మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వ్యాయాయంపై దృష్టి సారించి శారీరక దారుఢ్యాన్ని పెంచగలిగితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పరిడమిల్లుతారన్నారు. విధుల్లో చిత్తశుద్ధి అవసరమని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లపై మరింత శ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తిరుమలరావు, ఏఆర్‌డిఎస్పీ చంద్రబాబు, ఆర్‌ఐ కోటేశ్వరబాబు, ప్రసాద్ పాల్గొన్నారు.

అరటితోటలను ధ్వంసం చేసిన గజరాజులు
కొత్తూరు, ఫిబ్రవరి 20: మండలం నివగాం గ్రామంలో ఉన్న అరటితోటలను సోమవారం ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. మూడు రోజుల నుంచి నివగాం సమీపంలో కొండకు ఆనుకొని ఉన్న జీడితోటల్లో ఏనుగులు మకాం వేశాయి. మధ్యాహ్నం ఎండలకు ఏనుగులు తోటల్లోనే ఉంటూ సాయంత్రం బయటకు వచ్చి అరటితోటలతోపాటు జీడిపంటను ధ్వంసం చేశాయి. నివగాం గ్రామానికి చెందిన బి.సింగమయ్య అనే రైతుకు చెందిన అరటితోటను నాశనం చేసినట్టు అటవీ అధికారులు గుర్తించగా, గుంపులో ఉన్న నాలుగు ఏనుగులు రెండేసి వంతున విడిపోయి పరిసర ప్రాంతాల్లో సంచరించడంతో వాటి నుంచి ప్రాణహాని లేకుండా ఉండేందుకు అటవీ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. నివగాం, గులుమూరు రహదారి మీదుగా రాకపోకలు సాగించవద్దని అధికారులు చెబుతున్నారు.

వైద్య సేవలు అందించండి
* జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 20: ప్రభుత్వపరంగా వైద్యసేవలను అందించాలని జిల్లా కలెక్టరు డా.పి. లక్ష్మీనృసింహం వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్సుకు జిల్లా నలుమూలల నుండి పలు వినతులు వచ్చాయి. ముందుగా భామిని మండలం నేరడి గ్రామం నుండి సున్నా సెట్టి బుల్లు తన కుమార్తె మాధశ్రీ వయస్సు 9సంవత్సరాలైనా నడిచే స్ధితిలో లేదన్నారు. సుమారు ఒకటిన్నర సంవత్సరాల వయస్సులో తీవ్రమైన జ్వరం వచ్చిన తర్వాత పాప కాళ్ళు చచ్చుబడిపోయాయని, ఆమెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని కోరగా పైవిధంగా కలెక్టరు స్పందిస్తూ, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సారుపల్లి లీలావతి తనకు 2014లో ఆడపిల్ల పుట్టిందని, తనకు బంగారుతల్లి పథకాన్ని అందించాలని కోరారు. పొందూరు మండలం నుండి చదువుల తులసి తాను వికలాంగురాలినని, సర్వశిక్ష ఆభయాన్ ద్వారా పొరుగుసేవల కింద, ఆర్ట్సు ఇన్‌స్ట్రక్టర్ కింద జిల్లా పరిషత్ హైస్కూల్‌లో తాను అర్హురాలినని, తనను ఉద్యోగంలో నియమించాలని కోరారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం నుండి మామిడి ఈశ్వరమ్మ, భామిని మండలం సొలికిరి నుండి బిల్లంగి తేజోవతి, నెయ్యిగాపుల తవిటమ్మ, తమకు ఇంటి స్ధలం మంజూరు, ఇంటిని నిర్మించాలని కోరారు. కొత్తూరు మండలం ఆకుల తంపర నుండి మేడాన రోహిణమ్మ తుపానులో ఇల్లు కూలింది. తనకు ఇంటిని మంజూరు చేయాలని కోరారు. హిరమండలం నుండి జి.ఉమ వంశధార నిర్వాసితులు. తమకు 5సెంట్ల భూమిని నష్టపరిహారంగా ఇవ్వవల్సి ఉండగా, 2సెంట్ల స్ధలాన్ని మాత్రమే అందించారని, మిగిలిన 3సెంట్ల స్ధలాన్ని , లేదా దానికి సరిపడా సొమ్మును త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. పలాస మండలం గరుడఖండి నుండి సాసుమాన పాపమ్మ 2014 ,2015లో తన పంటలు దోమపోటువల్ల పోయాయి. పంటనష్టపరిహారాన్ని అందించాలని కోరారు. సరుబుజ్జిలి మండలం యరగాం నుండి నిమ్మకాయల చంద్రశేఖర్, మాలపేట ద్వారా పురుషోత్తపురానికి వెళ్ళే చెక్‌డాం ఛానల్ గట్లు పాడైపోయినందున బట్టిగట్లు మరమ్మత్తు చేయాలని కోరారు. పిఎస్‌ఎన్‌ఎం స్కూలు జంక్షను నుండి రామలక్ష్మణ జంక్షను వరకు రోడ్డు వెడల్పు చేసే ప్రక్రియలో రోడ్డును వెడల్పు చేస్తున్నారని, ఆవిధంగా కాకుండా రోడ్డునకు ఇరువైపులా సమానంగా రోడ్డు వెడల్పు చేయాలని స్థానికులు కోరారు. సత్వరమే సమస్యలు పరిష్కరించనున్నట్లు కలెక్టరు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు కె.వి.ఎన్ చక్రధరబాబు, జెసి-2 పి. రజనీకాంతారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ పథకసంచాలకుడు జి. కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.