శ్రీకాకుళం

గ్రూప్-2 పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపిపిఎస్‌సి) గ్రూప్ -2 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని జెసి-2 పి.రజనీకాంతారావు తెలిపారు. 26వతేదీన జరగనున్న ఈ పరీక్షకు జిల్లాలో 32,205 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, ఇందుకు 103 కేంద్రాలను ఏర్పాటుచేశామని తెలిపారు. శ్రీకాకుళంలో 38 కేంద్రాలు, ఎచ్చెర్లలో 5, ఆమదాలవలసలో 2, గార 2, పొందూరు 3, నరసన్నపేట 8, రణస్థలం 9, బూర్జ 1, టెక్కలి 8, కోటబొమ్మాళి 5, పలాస 4, ఇచ్ఛాపురం 2, సోంపేట 4, పాలకొండ 6, రాజాం 6 కేంద్రాలను ఏర్పాటుచేశామని తెలిపారు. గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు సమన్వయ అధికారులు, సహాయసమన్వయ అధికారులతో గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జెసి -2 పరీక్షల విధివిధానాలను తెలిపారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగరాదన్నారు. తాగునీటిని ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలవద్ద వైద్య శిబిరాలను ఏర్పాటుచేయాలని, బందోబస్తు ఏర్పాటుచేయాలని అన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు తమవివరాలు పూర్తిగా ఓఎంఆర్ షీట్‌పై రాసినదీ లేనిది ఇన్విజిలేటర్ చూడాలన్నారు. పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థులందరూ సమాధాన పత్రాలు సమర్పించిందీ లేనిదీ సరిచూడాలన్నారు. కేంద్రాలలో సిటింగ్ ప్లాన్ పక్కాగా ఉండాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు, గర్భిణులు ఉంటే వారిని గ్రౌండ్‌ఫ్లోర్‌లో పరీక్షలు రాయించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అంధులకు, ఇప్పటికే సర్వీస్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సహాయకులను అందిస్తారని సహాయకులు ఒరిజినల్ ఆధార్, లేదా ఇతర ధ్రువీకరణ పత్రం అందించాలన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా 103మంది చీఫ్ సూపరింటెండెంట్లు 32మంది సమన్వయ అధికారులు 103మంది సహాయ సమన్వయ అధికారులను నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తామని జిరాక్స్ కేంద్రాలు మూసి వేయాలన్నారు.
అభ్యర్థులకు సూచనలు: అభ్యర్థులు ఉదయం 9గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ముందుగా చేరుకోవడం వలన అభ్యర్థులకు ఉపశమనం, ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షను చక్కగా రాసే అవకాశం కలుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 9:45గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని, తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదన్నారు. సెల్‌ఫోన్‌లను అనుమతించేది లేదని పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని అన్నారు. క్యాలిక్యూలేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమన్నారు. పరీక్షా ఓఎంఆర్ షీట్‌ను బ్లూ, లేదా బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే మార్క్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జెల్ పెన్నులను, పెన్సిన్‌లను ఉపయోగించరాదన్నారు. పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు హాల్‌టికెట్ విధిగా తీసుకురావాలని, ఆధార్, పాన్, ఓటర్లు గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర గుర్తింపు కలిగిన కార్డులను ధ్రువీకరణ పత్రంగా తీసుకువచ్చి ఇన్విజిలేటర్‌కు చూపించాలని స్పష్టంచేశారు. పరీక్షా కేంద్రంలో ఓఎంఆర్ షీట్‌పై హాల్‌టికెట్ నెంబర్, పేపర్‌కోడ్, సిరీస్, సంతకాన్ని మరిచిపోరాదన్నారు. పరీక్షలో వర్క్‌షీట్ ప్రదేశంలో మాత్రమే చిత్తు వర్క్ చేయాలని ఇతర ప్రాంతంలో చేయడానికి మాల్ ప్రాక్టీస్‌గా గుర్తిస్తామని తెలిపారు. అభ్యర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే రానున్న పరీక్షలకు అనర్హులుగా చేస్తామన్నారు. ఏపిపిఎస్‌సి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్ష ఉదయం 9 గంటల నుండి 12:30గంటల వరకు జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 51మంది అభ్యర్థులు సహాయకులపై దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి కలుగకుండా పరీక్షాకేంద్రాలవద్ద ఒకే ప్రవేశమార్గం ఉండే విధంగా చూడాలన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో చూపిన ఫొటో, వారి గుర్తింపు కార్డుకు సరిపోవాలన్నారు. ఈకార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్లు బి.పోలీసు, డా.ఐ.శంకరరావు, ప్రిన్సిపాల్స్, డిఎస్పీలు వివేకానంద, కె.మోహనరావు, ఆదినారాయణ, కలెక్టర్ కా ర్యాలయ పరిపాలనాధికారి జి.సురేష్, పర్యవేక్షకులు రాము, తహశీల్దార్లు సుదాసాగర్, ప్రవల్లిక ప్రియ, జి.రామారావు పాల్గొన్నారు.

విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు
* జెడ్పీ సిఇఓ నగేష్

శ్రీకాకుళం, ఫిబ్రవరి 23: విద్యతో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చునని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.నగేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైఎస్‌ఆర్ కల్యాణ మండపంలో కోరమండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కోరమాండల్ గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి జెడ్పీ సిఇఓ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ విద్యతో అన్ని రంగాల్లో రాణించవచ్చునని, ఐసిఐసిఐ సిఇఓ చందాకొచ్చర్, పెప్సీ సిఇఓ ఇంద్రానూయి, 2014లో ఐఏఎస్ టాప్ ర్యాంకర్లు ఇరాసింఘాల్, రేణురాజ్, నిధిగుప్త వీరంతా విద్యతోనే రాణించారని గుర్తుచేశారు. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో గ్రామీణ బాలికల విద్య చాలా ప్రాముఖ్యతతో సంతరించుకుందని తెలిపారు. నేటి బాలికలే రేపటి గృహిణులని, బాలికల విద్యలో బాగా రాణించడం ద్వారా భవిష్యత్‌లో వారే తొలి గురువులు కాగలరన్నారు. తద్వారా వారి పిల్లలకు సరైన మార్గంలో నడిపించి మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా సమసమాజ స్థాపనకు ఉపయోగపడతారని ఉద్బోధించారు. బాలికలకు సరైన తోడ్పాటునిస్తే బాలుర కంటే ముందంజలో ఉంటారన్నారు. బాలిలకు తోడ్పాటునిచ్చేందుకు కోరమాండల్ సంస్థ బాలికల ప్రతిభాపురస్కారాలను ఏర్పాటుచేయడం సంతోషదాయకమన్నారు. ఇటువంటి పురస్కారాలను రాష్ట్ర వ్యాప్తంగా 600మందికి, జిల్లాలో 50మందికి ప్రతిభా పురస్కారాలను అందిస్తున్న కోరమాండల్ సంస్థను అభినందించారు. అనంతరం జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యనభ్యసించి 9వ తరగతిలో ఉత్తీర్ణులై ఈ ఏడాది 10వతరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఎంపిక చేసిన 50మంది బాలికలకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఇందులో ప్రథమ స్థానానికి ఎంపికైన బాలికకు రూ.5వేలు, ద్వితీయ స్థానానికి ఎంపికైన బాలికకు రూ.3500 అందించారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోరమాండల్ సంస్థ విశాఖపట్నం జోనల్ మేనేజర్ ఎం.గోవిందరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిఇఓ సుబ్బారావు, ఉప విద్యాశాఖాధికారి ఏ.ప్రభాకరరావు, వ్యవసాయ శాఖ జెడి రామారావు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి సర్వం సన్నద్ధం
జలుమూరు, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి కోసం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం సర్వం సన్నద్ధమైంది. ఈ ఏడాది భక్తుల క్యూలైన్ల ఏర్పాట్లకు మూడు రోజులు అధికారులు చర్యలు అనంతరం బుధవారంరాత్రి ఒక నిర్ణయం జరిగింది. గురువారం నుండి ఆలయ ప్రాంగణంలో పనులు చకచకా సాగిపోయాయి. మహాశివరాత్రి మొదలుకొని చక్రతీర్థం వరకు ఆలయం లోపల, బయట జరుగుతున్న వాటిని పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు విశేషం. ఆలయ ప్రాంగణంలో భక్తులకు నీడను కల్పించేందుకు పలు షామియానాలు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందికి శ్రీముఖలింగంలో ఎక్కడ పనిచేయాలన్న బాధ్యతలను గురువారం అప్పగించారు. వాహనాల నిలుపుదలకు పార్కింగ్‌లను ఏర్పాటుచేశారు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నగిరికటకం, కొమనాపల్లి సత్యసాయిభక్తబృందం ఆలయ ప్రాంగాణంలో తాగునీరు ఏర్పాటుకు సిద్ధం చేశారు. గురువారం శ్రీకాకుళం డిఎస్పీ భార్గవరావునాయుడు ఆలయ ప్రాంగణం, లోపల పరిశీలించారు.
భారీ భద్రతా ఏర్పాట్లు : సుదూర ప్రాంతాల నుండి శ్రీముఖలింగం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవడంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేసినట్లు సిఐ పైడిపునాయుడు తెలిపారు. డిఎస్పీ భార్గవరావునాయుడు పర్యవేక్షణలో ముగ్గురు సిఐలు, 14మంది ఎస్‌ఐలు, 40 మంది ఏ ఎస్‌ఐలు, 87మంది కానిస్టేబుళ్లు, 20మంది మహిళా పోలీసులు, 62మంది హోంగార్డులు, అదనంగా ప్రత్యేక పోలీసు బృందాలు, కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేసినట్లు సిఐ తెలిపారు.

ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులు
* వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 23: ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం ఉపాధి హామీ సమన్వయంపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఆదాయం వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పనిదినాలను కల్పించవచ్చునన్నారు. ఫారంపాండ్స్, పాఠశాల భవనాలు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, సిసి రోడ్లు, కాలువలు, మరుగుదొడ్లు, గృహ నిర్మాణం అనేక కార్యక్రమాల ద్వారా వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధించవచ్చునని, తద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, వర్శి కంపోస్టు ద్వారా వాతావరణం సమతుల్యత సాధించడం, వ్యవసాయ వ్యర్థాలద్వారా వర్శికంపోస్టును తయారు వంటి చర్యలనున చేపట్టాలన్నారు. నిబద్ధతతో జవాబుదారీతనంతోనూ నిధులను ఖర్చుచేయాలని, దీనికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పక్కా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. ఎక్కువ మంది పనివారలకు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామాలలో వౌలిక సదుపాయాలను అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీపై 19 శాఖల ద్వారా 19 ప్రాజెక్టులుగా చేపడుతున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, చిన్నకారు రైతులకు భూ అభివృద్ధి పథకంలో భాగంగా భూమిని అభివృద్ధి చేపట్టాలని ఆదేశించారు.
స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించి సాంకేతిక పరిజ్ఞానంతో చెత్తను వినియోగించుకోవాలన్నారు. చెరువుల్లో పూడికను తీసి నీటి నిల్వలను పెంచుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములను చదును చేయడం చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉపాధిహామీలో మార్క్‌ఫెడ్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. రసాయన వినియోగాలను తగ్గించి ప్రకృతి వనరులను ఉపయోగించుకోవాలని వ్యవసాయం, ఉద్యానవనం, పంచాయతీరాజ్‌శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో ఎక్కువ ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని, కిలో మీటరుకు 400 మొక్కలు వేసి ఉపాధికి ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ జియోట్యాగింగ్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ప్రతి నాల్గవ శనివారం అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధిహామీలో చేపట్టిన కార్యక్రమాలపై ఫొటోలు తీసి జియోట్యాగింగ్ చేయాలన్నారు. గ్రామాలలో పశువులకు పశుగ్రాసం తయారు వంటి పనులను డ్వాక్రా మహిళలకు అప్పగించాలని చెప్పారు. బోర్‌వెల్స్, సోలార్ పంపుల ద్వారా వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. వ్యవసాయం నుండి ఉద్యానవనానికి మార్చే ప్రణాళికలు తయారుచేసుకోవాలన్నారు. ఉపాధి హామీలో పెద్ద పనులకు యంత్రాలను వినియోగించవచ్చనన్నారు. అన్ని అంగన్‌వాడీ భవనాలను నిర్మించాలన్నారు. అంగన్‌వాడీ భవనాలలో స్వచ్ఛ్భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లను, పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు.
2017-18 సంవత్సరానికి ఏడు వేల రూపాయల కోట్లతో పనులను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ సీనియర్ అధికారులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్ కో-ఆర్డినేటర్‌గా నియమించి వచ్చే ఏడాదికి అన్ని కార్యాలయాలతోనూ పూర్తిస్థాయిలో కంప్యూటరైజేషన్ చేయాలన్నారు. రర్బన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు పక్కా ప్రణాళికలను తయారు చేశారని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ముఖ్యమంత్రికి వివరించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ మరుగుదొడ్ల నిర్మాణాన్ని నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ ద్వారా మెరుగైన సమాజం నిర్మాణానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పిడి జిసి కిశోర్‌కుమార్, డిపిఓ బి.కోటేశ్వరరావు, హౌసింగ్ జిల్లా మేనేజర్ వి.నర్సింగరావు, డుమా పిడి హెచ్.కూర్మారావు, శ్రీకాకుళం, పాలకొండ, ఆర్డీవోలు బి.దయానిధి, ఆర్.గున్నయ్య పాల్గొన్నారు.

విరిగిన రైలు పట్టా
* తప్పిన పెను ప్రమాదం
ఆమదాలవలస, ఫిబ్రవరి 23: పొందూరు రైల్వేస్టేషన్ సమీపం మొదలవలస రైల్వేగేటువద్ద గురువారం అప్‌లైన్‌లో ఉన్న రైలుట్రాక్ విరిగింది. ఈ సంఘటనను రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విరిగిన ఈ పట్టా వలన సుమారు మూడు గంటలపాటు రాకపోకలు నిలుపుదల చేసి మరమ్మతులు చేసి యథాతథంగా రాకపోకలు సాగించారు. ప్రస్తుతం వేసవి కారణంగా ట్రాక్ అక్కడక్కడ పగుళ్లు ఇవ్వడం సహజమేని, ప్రతీరోజూ ఇంజినీరింగ్ సిబ్బంది పరిశీలిస్తున్నామని, అప్రమత్తం కావడం వల్లే ఈ ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.

పోలింగ్ కేంద్రాలో లైవ్ టెలీకాస్ట్ ఉండాలి
* సిఇఓ భన్వర్‌లాల్
బలగ, ఫిబ్రవరి 23: పట్ట్భద్రుల నియోజకవర్గానికి పోలింగ్ కేంద్రాల్లో శతశాతం లైవ్‌టెలీకాస్ట్ ఉండాలని ఏ.పి, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ అన్నారు. పట్ట్భద్రులు, స్థానిక సంస్థల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలపై గురువారం సాయంత్రం రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉండాలన్నారు. తద్వారా జరుగుతున్న ప్రతీ పరిణామం రికార్డు కావాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి లోపాలు ఉండరాదన్నారు. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. డివిజన్ కేంద్రాల్లోస్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల లెక్కింపు శ్రీకాకుళం పురుషుల కళాశాలలో నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల పూర్తికి బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో విఆర్‌వో ఎస్. సత్యన్నారాయణ, ఆర్డివో బలివాడ దయానిధి, ఎం.వెంకటేశ్వరరావు, గున్నయ్య, డీ ఎస్పీ కె.మోహనరావు, కలెక్టరేట్ సిసి పర్యవేక్షకులు రాజేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి
సర్వం సన్నద్ధం
* సిసి కెమెరాలు, క్యూలైన్ల ఏర్పాటు
* వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం
* భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు
జలుమూరు, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి కోసం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం సర్వ ం సన్నద్ధమైంది. ఈ ఏడాది భక్తుల క్యూలైన్ల ఏర్పాట్లకు మూడు రోజు లు అధికారులు చర్యలు అనంతర ం బుధవారంరాత్రి ఒక నిర్ణయం జరిగింది. గురువారం నుండి ఆల య ప్రాంగణంలో పనులు చకచకా సాగిపోయాయి. మహాశివరాత్రి మొదలుకొని చక్రతీర్థం వరకు ఆలయం లోపల, బయట జరుగుతున్న వాటిని పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు విశేషం. ఆలయ ప్రాంగణంలో భక్తులకు నీడను కల్పించేందుకు పలు షామియానాలు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందికి శ్రీముఖలింగంలో ఎక్కడ పనిచేయాలన్న బాధ్యతలను గురువారం అప్పగించారు. వాహనాల నిలుపుదలకు పార్కింగ్‌లను ఏర్పాటుచేశారు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నగిరికటకం, కొమనాపల్లి సత్యసాయి భక్తబృందం ఆలయ ప్రాంగాణంలో తాగునీరు ఏర్పాటుకు సిద్ధం చేశారు. గురువారం శ్రీకాకుళం డిఎస్పీ భార్గవరావునాయుడు ఆలయ ప్రాంగణం, లోపల పరిశీలించారు.
భారీ భద్రతా ఏర్పాట్లు : సుదూర ప్రాంతాల నుండి శ్రీముఖలింగం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవడంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేసినట్లు సిఐ పైడిపునాయుడు తెలిపారు. డిఎస్పీ భార్గవరావునాయుడు పర్యవేక్షణలో ముగ్గురు సిఐలు, 14మంది ఎస్‌ఐలు, 40 మంది ఏ ఎస్‌ఐలు, 87మంది కానిస్టేబుళ్లు, 20మంది మహిళా పోలీసులు, 62మంది హోంగార్డులు, అదనంగా ప్రత్యేక పోలీసు బృందాలు, కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేసినట్లు సిఐ తెలిపారు.

స్కిల్స్‌పై అవగాహన పెంచుకుంటే ఉద్యోగాలు
* ప్రొఫెసర్ వేణుగోపాల్
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 23: విద్యతోపాటు నైపుణ్యంతో కూడిన అంశాలపై అవగాహన పెంచుకుంటే ఉద్యోగాలకు ఇంటర్య్వూలు ఎదుర్కోవడం మరింత సులువౌతుందని హిథోపియో దేశానికి చెందిన గోండ్యావర్శిటీ ప్రొఫెసర్ కె.వేణుగోపాల్ సూచించారు. కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో గురువారం ఇంటర్వ్యూలు ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై ఎం బి ఏ విద్యార్థులకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమన్నారు. ఆత్మస్థైర్యంతో సమాధానం చెప్పగలగాలన్నారు. ఎంబిఏ విద్యార్థులు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు సాధించేందుకు అంగ్ల దినపత్రికల్లో బిజినెస్ పేజీలను ఫాలో కావాలన్నారు. వర్శిటీ ఎగ్జామినేషన్ డీన్ టి.కామరాజు మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధితో కూడిన విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని, ఆ దిశగా విద్యార్థులు స్కిల్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధకులు రంగనాథ్, సంతోష్‌పావని, వెంకటరమణ పాల్గొన్నారు.

చిరస్మరణీయుడు ఎర్రన్నాయుడు
గార, ఫిబ్రవరి 23: దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు చిరస్మరణీయుడని మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు గొండు వెంకటరమణమూర్తి, బడగల వెంకటప్పారావు అన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలుగు యువత అధ్యక్షుడు పీస వెంకటరమణమూర్తి, సర్పంచులు ఆరంగి దశరధరావు, కొంక్యాణ ఆదినారాయణ, అంబటి చక్రధరరావు, ఎంపి.సి. జల్లు రాజీవ్, ప్రగఢ మన్మధరావు, కల్లి యర్రన్నరెడ్డి, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉన్నారు.

సిస్టమ్‌లో క్యాంపస్ డ్రైవ్
గార, ఫిబ్రవరి 23: మండలం అంపోలు శారదా ఇంజనీరింగ్ కళాశాలలో అప్పసామి అసోసియేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్‌ను గురువారం నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం విద్యార్థులు పాల్గోన్నారు. కంపెనీ ప్రొడక్షన్ ఇంజనీర్లు, సర్వీస్ టెక్నిషియన్లు ఉద్యోగాలకు వ్రాత, వౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 15 మంది విద్యార్థ్ధులు ఎంపికైనట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి బౌరౌతు శ్రీనివాసరావు క్యాంపస్ డ్రైవ్‌లో ఎంపికైన విద్యార్థ్ధులను అభినందించారు. మరిన్ని కంపెనీలను రప్పించి కళాశాలలో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహింపజేస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. క్యాంపస్ డ్రైవ్ నిర్వహణలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వెంకటస్వామి, ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ అధికారి జి. జగదీష్‌కుమార్, కంపెనీ ప్రతినిధులు ముత్తు మరియప్పన్, కుమార్ సుబ్రమణియన్‌తోపాటు బోధనా సిబ్బంది ఉన్నారు.

జిల్లా పోటీల్లో ఎంపికైన వారు హాజరు కావాలి
బలగ, ఫిబ్రవరి 23: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా జిల్లా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో హాజరు కావాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ తెలిపాను. వివిధ పోటీలు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు విజయనగరంలో జరుగుతాయన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన 19 ఏళ్లలోపు బాలురు, బాలికలు అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే వారు హాజరు కావాలన్నారు. వీరంతా పిఆర్‌ఎఫ్ ఫారాలు ఫొటోలు అతికించాలని, కులం ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, వయస్సు ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లు తీసుకురావాలన్నారు. హాజరవుతున్న క్రీడాకారులకు క్రీడా కిట్లను జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా అందిస్తారన్నారు.