శ్రీకాకుళం

లక్షలాది భక్తుల నడుమ స్వామి చక్రతీర్థస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, ఫిబ్రవరి 27: శ్రీ మధుకేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు చక్రతీర్థస్నానం వైభవంగా నిర్వహించారు. నందివాహనంపై సుందరంగా ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఉత్తర దిశగా మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా పవిత్ర వంశధార నదీతీరం మిరియాపల్లి తీర్థగట్టంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య లక్షలాది మంది భక్తుల నడుమ స్వామి చక్రతీర్థస్నానం జరిగింది. వంశపారపర్యంగా వస్తున్న అర్చకులు ప్రభాకరరావు చేతుల మీదుగా నందివాహనంపై కొలువుతీర్చారు. ఉత్సవ విగ్రహాలకు హారతులిచ్చి దక్షిణద్వారం గుండా బయటకు తెచ్చే సమయంలో హారతికోసం భక్తులు గుమిగూడటం కనిపించింది. టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం డిఎస్పీ కె.్భర్గవరావునాయుడు, కార్యనిర్వహణాధికారి వెంకటసూర్యనారాయణ, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు నడుమ స్వామి వంశధార నదికి 12:40గంటలకు చేరారు. స్వామివారి స్నానాల సమయంలో ముఖలింగానికి చెందిన రవి అనే యువకుడి చేతిలో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని ఒక ఎస్ ఐ తీసుకొని వేరొకరికి ఇవ్వడంతో స్థానికులకు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. సాంప్రదాయాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని అర్చకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్నానం అనంతరం నూతన వస్త్రాలతో ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయానికి చేర్చారు. క్యూలైన్‌లో ఉండలేని భక్తులు గర్భగుడి గోడలపై ఉన్న శిల్పాల వద్ద అభిషేకాలు చేపట్టారు. భక్తుల సౌకర్యాలపై కార్యనిర్వహణాధికారి వెంకటసూర్యనారాయణ పర్యవేక్షించారు. ఎస్పీ బ్రహ్మారెడ్డి వంశధార నది ఇరువైపులా పరిస్థితులను సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. కొమనాపల్లి, నగరికటకం సత్యసాయి సేవా సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ట్రాఫిక్‌లో ఆర్డీవో : మధుకేశ్వర స్వామి చక్రతీర్థస్నానం ఏర్పాట్లను పరిశీలించేందుకు టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్వరరావు నగిరికటకం ప్రాంతంలో ట్రాఫిక్‌లో గంట కాలంపాటు చిక్కుకున్నారు. పోలీసులు కలుగజేసుకొని సమస్యలను పరిష్కరించారు. సోమవారం ఒక్కరోజులో మూడు దఫాలుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం పోలీస్ శాఖపై పలు విమర్శలు వినిపించాయి. వంశధార నదిలో జంగమ దేవరుల దీవెనలు, పిండ ప్రధానాలు జరిగాయి.
ఆర్టీసీకి ధీటుగా ఆటోలు : చక్రతీర్థ స్నానాలకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన బస్సులకు దీటుగా జిల్లా నలుమూలల నుండి ఆటోలు శ్రీముఖలింగానికి భక్తులతో చేరాయి. ప్రైవేటు వాహనాలలో కూడా భక్తులను తరలించారు. డిపో-2 మేనేజర్ అరుణకుమారి తమ సిబ్బంది సహకారంతో ఆరు గంటలపాటు శ్రీముఖలింగంలో ఉన్నారు.
మధుకేశ్వరుని దర్శించిన సినీనటుటు శరత్‌బాబు
మధుకేశ్వరస్వామిని సినీనటుడు శరత్‌బాబు సోమవారం దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపదను తిలకించారు. వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆయనను దీవించారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు అచ్యుతాపురం పిహెచ్‌సి నాలుగు రోజులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఆలయ ట్రస్ట్‌బోర్డుఅధ్యక్షుడు బైరి బలరాం, సర్పంచ్ మాణిక్యం బలరాం, ఎంపిటిసి ధనలక్ష్మీ సహకరించిన భక్తులకు, అధికారులను అభినందనలు తెలిపారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు
మూడు పోలింగ్ కేంద్రాలు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సభ్యుల ఎన్నికలకు జిల్లాలో మూడు పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జెసి చక్రధరబాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సోమవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మార్చి 17వతేదీన పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 20వతేదీన లెక్కింపు జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 28వతేదీ వరకు నామినేషన్లను వేసేందుకు గడువు ఉందని తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓటు వేయడానికి ఎంపిటిసిలు, జెడ్పీటిసిలు, వార్డు కౌన్సిలర్లు ఆప్షన్ ఇచ్చిన ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఓటర్లుగా ఉంటారని తెలిపారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సభ్యుల సంఖ్యను అందించాలని కాంగ్రెస్ ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి కోరారు. సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.సత్యనారాయణ, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు సింహాచలం, లోకసత్తా ప్రతినిధి వి.అప్పలరాజు, బిజేపి ప్రతినిధులు అట్టాడ రవిబాబ్జీ, ఎస్వీ రమణమూర్తి, వైకాపా ప్రతినిధి పోలిశెట్టి మధుబాబు, టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష పాల్గొన్నారు.