శ్రీకాకుళం

సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 27: కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ విభాగానికి పలు వినతులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం వినతులు స్వీకరించారు. గృహ నిర్మాణం, పింఛన్లు, ఉపాధి కల్పనపై ఎక్కువగా వినతులు వచ్చాయి. భామిని మండలం సొలికిరి గ్రామానికి చెందిన రాజాల లక్ష్మీ,పోలేటి లక్ష్మీ, చంటి తమకు ప్రభుత్వపరంగా గృహాలు నిర్మించాలని కోరారు. నరసన్నపేటకు చెందిన బాడాన లక్ష్మీ తాను 10వ తరగతి చదువుకున్నానని, తన భర్త తనకు విడాకులు ఇచ్చి వేరేగా నివసిస్తున్నాడని, తనకు ఎటువంటి జీవనాధారం లేనందున ఉపాధి కల్పించాలని కోరారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడకి చెందిన రావాడ అప్పారావు వృద్ధ కళాకారుడైనందున తనకు కళాకారుల పింఛన్ మంజూరు చేయాలని కోరారు. బోగస్ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తున్న మందస మండలం బోగబందకి చెందిన కుమారస్వామి నాయక్‌ను ఉద్యోగం నుండి తొలగించాలని కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బి.ప్రభాకరరావు కోరారు.
సముద్రంలో చేపలవేటలో ప్రమాదవశాత్తు తప్పిపోయి మరణించిన మత్స్యకార కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించాలని జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్ముడు కోరారు. 2015-16లో ప్రభుత్వ సబ్సిడీతో నిర్మించిన రెండు ఫౌల్ట్రీ హౌస్‌లను కూల్చివేసి తీసుకెళ్లిన దివాకర్‌పై చర్యలు తీసుకొని వాటిని పునర్నిర్మించి తాను వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించాలని శ్రీనివాస్ వివరించారు. కలెక్టర్ స్పందిస్తే ఆర్థిక లావాదేవీల్లో తేడా వస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలే తప్ప ప్రభుత్వ సబ్సిడీపై నిర్మించిన హౌస్‌ను ధ్వంసం చేసే అధికారం లేదని, ఫౌల్ట్రీ హోమ్‌ను పునర్నిర్మించాలని లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. పాలకొండ మండలం జంపరకోట రిజర్వాయర్ పెండింగ్‌పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర బడ్జెట్‌లోనిధులు మంజూరు చేసి గిరిజన రైతాంగానికి సాగునీరు, తాగునీరు కల్పించాలని జంపరకోట రిజర్వాయర్ సాధన సమితి సభ్యులు బుడితి అప్పలనాయుడు, ద్వారపుడి అప్పలనాయుడు, తంపర బాబూరావు, పి.లక్ష్మునాయుడు కోరారు. సత్వరమే సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జెసి చక్రధరబాబు, జెసి-2 పి.రజనీకాంతారావ, డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్ హాజరయ్యారు.