శ్రీకాకుళం

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఎల్‌ఐసి ఉద్యోగుల మద్ధతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 28: బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా మంగళవారం స్థానిక ఎల్‌ఐసి ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సంద్బంగా ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం కార్యదర్శి టి.ఆచారి మాట్లాడుతూ మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు మద్దతు ప్రకటించామన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని, బ్యాంకులలో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడాన్ని ఆయన ఖండించారు. బ్యాంకులలో పాతపింఛను పధకాన్ని అందరికీ వర్తింపజేయాలని, మొండిబకాయిలు చెల్లించని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, గ్రాట్యుటీ సీలింగ్‌ను ఎత్తివేయాలని, ఖాళీలను వెంటనే భర్తీచేయాలని, నోట్లరద్దు కారణంగా బ్యాంకులపై పడిన అదనపు ఖర్చును ప్రభుత్వమే భరించాలని, అదనపు సమయం పనిచేసిన ఉద్యోగులకు అదనంగా జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు మోహన్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జి. శ్రీనుబాబు, జి.శ్రీరామమూర్తి, కె. రమేష్‌కుమార్, ఐ. వెంకటేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఒడిశా వైపు ఏనుగుల తరలింపునకు చర్యలు
కొత్తూరు, ఫిబ్రవరి 28: దశాబ్ధాల క్రితం నుంచి ఒడిశాలోని లఖేరి అడవుల నుంచి తరలివచ్చిన ఏనుగుల గుంపును తిరిగి అదే ఒడిశా అటవీ ప్రాంతానికి గజరాజులను తరలించేందుకు ప్రణాళికలను సిద్దం చేసే చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అటవీశాఖాధికారి శాంతిస్వరూప్ అన్నారు. మంగళవారం ఆయన ఏనుగులు తిష్టవేసిన నివగాం, మదనాపురం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలను ప్రత్యక్షంగా ఆయన వీక్షించారు. అనంతరం అటవీశాఖ మ్యాప్‌ను ఆధారంగా ఇక్కడ నుంచి ఈ ఏనుగుల గుంపును వంశధార నదిని దాటించి అవతల ఒడిశా అటవీ ప్రాంతానికి ఏ విధంగా తరలించేందుకు అనువుగా ఉంటుందో మ్యాప్‌తో పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తూరు, సీతంపేట, హిరమండలం తదితర ప్రాంతాల్లో ఏనుగులు సంచరించి గిరిజన రైతుల పంటలను నాశనం చేసినట్టు గుర్తించామన్నారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ మార్గాలైతే ఏనుగులకు అనువుగా ఉంటుందో రూట్‌మ్యాప్‌ను తయారు చేసి నివేదిక అందించాలని అటవీశాఖాధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట పాతపట్నం అటవీ రేంజ్ అధికారి సోమశేఖర్, కొత్తూరు అటవీ సెక్షన్ అధికారి తిరుపతిరావు,సిబ్బంది పాల్గొన్నారు.