శ్రీకాకుళం

సామాజిక రుగ్మతలను తరిమేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 10: సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను తరిమేస్తేనే మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగి, వారి అభిరుచులకు అనుగుణంగా అభివృద్ధి దిశలో అడుగులు వేయగలరని, అందుకు పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మహిళలకు పిలుపునిచ్చారు. మహిళల జీవితాల్లో చీకటి కోణాలనే మిగిల్చే కథనాలు వెనుక కొన్ని బలమైన రుగ్మతలు ఉన్నాయని, వాటిని తరిమితరిమి కొట్టాలంటూ కోరారు. గ్రామీణ అక్షరాస్యత శాతాన్ని పెంచితే తద్వారా ఆలోచించే జ్ఞానం పెరుగుతుందన్నారు. అప్పటినుంచే మద్యపానాన్ని గ్రామాల్లో నిషేధించేందుకు మహిళలకు బలం చేకూరుతోందని, బాల్యవివాహాలపై పోరాటం చేసేందుకు అడుగులు ముందుకు పడతాయని, వరకట్న పిశాచీలు ఇంకా ఉన్నాయని, వాటిని గ్రామాల పొలిమేరల వరకూ తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో మార్పు కోసం మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని కలెక్టర్ లక్ష్మీృనృసింహం పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ జెడ్పీ సమావేశమందిరంలో యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమాజంలో ఎటువంటి మార్పు తీసుకురావాలన్నా అది మహిళలకే సాధ్యపడుతుందని చెప్పారు. తమ జీవితాలతోపాటు తోటివారి జీవితాలపై కూడా మహిళలు ఆలోచించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో 64 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారని, అటువంటి వారిని విద్యావంతులు చేయాలన్నారు. మద్యాన్ని నిరోధించగలిగే చొరవ మహిళల్లో ఉండాలని, పురుషులు తప్పు చేస్తే సరిదిద్దగలిగే స్థితిలో మహిళలు ఉండాలని చెప్పారు. వరకట్నం అనేది సమాజంలో లేకుండా మార్పు తీసుకువచ్చేందుకు మహిళలు ముందుకు రావాలన్నారు. బాల్యవివాహాలు జరగకుండా మహిళలే చొరవ చూపాలని కోరారు. బాల్యంలోనే శారీరక పరిస్థితి, మానసికంగా ఎదుగుదల లేని వివాహాలు చేయడం వల్ల తల్లి,బిడ్డలు మరణించే అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు. గృహహింస, మహిళా హింస విపత్కర పరిస్థితులలో మహిళలు ధైర్యంగా పోరాడాలని చెప్పారు. ఇటీవల నువ్వులరేవువద్ద మత్స్యకార గ్రామాలలో సుమారు 400 జంటలు సామూహిక వివాహాలకు సిద్ధపడగా, అందులో 101 జంటలకు మాత్రమే పెళ్ళిళ్ళు జరిపించామని, మిగిలిన బాల్య వివాహాలు కావడంతో వారి తల్లిదండ్రులకు బాల్యవివాహలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా వారిలో పరివర్తన తీసుకురాగలిగామన్నారు. ప్రతి మహిళ సెర్వ్‌లో పాల్గొనాలంటూ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. డిఆర్‌డిఏ. ప్రాజెక్టు డైరక్టర్ డాక్టర్ జె.సి.కిషోర్‌బాబు మాట్లాడుతూ మానవత్వాన్ని చాటిచెప్పేది మహిళలే అన్నారు. పూర్వం వేదాలు, గ్రంథాలను చిన్నపిల్లలు, మహిళలు చదవకూడదనే వారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో మహిళలు ఉంటున్నారని తెలిపారు. మగపిల్లలతో సమానంగా ఆడ పిల్లలను తల్లిదండ్రులు పెంచాలని చెప్పారు. వరకట్నం రూపుమాపడం ద్వారా మహిళలకు ఎంతో మంచి జరుగుతుందని, ఆ దిశగా మహిళలు సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి కె.వి.ఆదిద్యలక్ష్మీ, ఐ.సి.డి.ఎస్ పిడి కె.లీలావతి, సంప్రదాయం సంచాలకుడు స్వాతిసోమనాథ్, సెట్‌శ్రీ సిఇఓ బి.వి.ప్రసాదరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలకు పెయింటింగ్, పాటలు, వ్యాసరచన, వకృత్వపోటీలతోపాటు 2కె-రన్‌లను నిర్వహించి వాటిలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు.

జవాబుదారీతనంతోనే లక్ష్యాల సాధన
* మార్చి నెలాఖరే లక్ష్యాలకు గడువు
* 7 మిషన్స్, 5 గ్రిడ్స్ పూర్తి కావాల్సిందే
* ముఖ్యమంత్రి
అధికారులకు దశాదిశ నిర్దేశం

శ్రీకాకుళం, మార్చి 10: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని, కుటుంబ వికాసం, సమాజ వికాసం కోసం తీసుకున్న పది పాయింట్లు లక్ష్యాలను శతశాతం పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అధికారులకు దశాదిశ నిర్దేశించారు. ముఖ్యంగా 7 మిషన్స్, 5 గ్రిడ్స్, కాంపెన్స్‌ను నిర్దేశించుకున్నామని, వాటిని అమలు చేయాలని ఆదేశించారు. నేరుగా కన్వర్జెన్స్ కింద అన్ని శాఖలతో అనుసంధానం చేయడం, అవసరమైన మానవ వనరులు, నిధులు కేటాయించడం చేసుకోవాలంటూ శాఖాధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. జవాబుదారీతనంతోనే లక్ష్యాలను, అభివృద్ధి సాధించగలమన్నారు. అసాధారణ లక్ష్యాలను సాధిచాలంటే అవిశ్రాంతంగా పనిచేయగలగాలని, ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రెండెంకల అభివృద్ధిని సాధించ గలిగామన్నారు.
2016-17 ఆర్థిక సంవత్సరంలో అంచనాల ప్రకారం 11.61 శాతం వృద్ధిరేటును సాధించామని, ఈ ఏడాది రాష్ట్ర తలసరి ఆదాయం 1,22,370 కాగా దేశ తలసరి ఆదాయం 1,03,010గా ఉందన్నారు. వచ్చే ఏడాది 15 శాతం వృద్ధిరేటు సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర వృద్ధిరేటును ఇంకా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మంది డ్వాక్రా మహిళల కుటుంబాలు ఉన్నాయని, వారిలో పేదలు, నిరుపేదలు ఎక్కువమంది ఉన్నారన్నారు. డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరూ నెలకు రూ. 10 వేల ఆదాయం ఆర్జించగలిగితే రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతుందన్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు ఆశాజనకంగా ఉందన్నారు. మరోవైపు ఆక్వారంగానికి తక్కువ నిధులే కేటాయించినప్పటికీ అద్భుత ఫలితాలు సాధించగలగామని పేర్కొన్నారు. ఉద్యానవన రంగాలపైనా దృష్టిపెడితే మరింత వృద్ధిని సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో ఉద్యానవన రంగంలోనూ 30 శాతం వృద్ధి సాధించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఆక్వారంగాలు సమానంగా ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్టవ్రృద్ధి 30 శాతంగా ఉందని చెప్పారు. మరోవైపు పరిశ్రమల రంగంలో అభివృద్ధిని సాధించామని, పరిశ్రమ రంగంలో రాష్ట్ర వృద్ధి సాధించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఆక్వారంగాలు సమానంగా ఉన్నాయని ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్టవ్రృద్ధి 30 శాతంగా ఉందన్నారు. మరోవైపు పరిశ్రమల రంగంలో కూడా అభివృద్ధిని సాధించామని, పరిశ్రమరంగంలో రాష్ట్ర వృద్ధి 10.05 శాతం కాగా, దేశవృద్ధిలో 5.77 శాతంగా ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల అభివృద్ధితోనే సేవల రంగం వృద్ధి ఆధారపడిఉందన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జెసి-2 పి.రజనీకాంతారావు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు జి.రామారావు, మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకుడు వై.వి.శ్యామ్‌కుమార్, ఉద్యానవన సహాయ సంచాలకులు రహీమ్, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు పాల్గొన్నారు.

జిఎస్‌టిపై అవగాహన పెంచుకోవాలి
* సిటిఓ రాణీమోహన్
శ్రీకాకుళం(రూరల్), మార్చి 10: జిఎస్‌టిపై విద్యార్థులు మరింత అవగాహన పెంచుకోవాలని వాణిజ్యపన్నుల శాఖాధికారిణి రాణీమోహన్ అన్నారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర, అర్థశాస్త్ర విభాగాలు ఏర్పాటుచేస్తున్న వస్తు సేవల పన్ను అవగాహన సదస్సుకి శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.బాబూరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏకీకృత పన్నుల విధానం వినియోగదారుల పాలిట వరమన్నారు. వస్తు సేవల పన్ను పూర్వాపరాలను వివరించారు. జిఎస్‌టి చట్టంలో పొందుపరిచిన అంశాలను ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. చట్టంపై గల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి.లచ్ఛన్న, అర్థశాస్త్ర విభాగాధిపతి ఉషాపద్మిని, అర్థశాస్త్ర అధ్యాపకులు జి.పైడితల్లి, వాణిజ్య అధ్యాపకులు భాస్కరరావు, చంద్రబోస్, జి.ప్రసాద్, లక్ష్మీపతి, బాలకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.