శ్రీకాకుళం

ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతశ్రీకాకుళం, మార్చి 20: ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఫోన్ చేస్తూ ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వజూలు చేస్తున్నారని, వాటి చెల్లింపునకు వేధిస్తున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో విద్యను బోధిస్తారన్నారు. అర్హత సాధించిన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, మధ్యాహ్న భోజనం, నోట్‌పుస్తకాలు, ఏకరూపుదుస్తులు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నందున తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ చెప్పారు. పాఠశాలల్లో మంచి విద్యాభోధన ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, చిన్నారులను చేర్పించాలన్నారు. ఆమదాలవలస మండలం బెలమాం గ్రామానికి చెందిన ఆర్.రాజేశ్వరి ఫోన్‌చేస్తూ ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలన్నారు. వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరుకి చెందిన ఎల్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒంకులూరులో తనకు గల భూమి వెబ్‌ల్యాండ్‌లో చూపించడం లేదని, దానిని నమోదు చేయాలని కోరినప్పటికీ చర్యలు లేవని పేర్కొన్నారు. పలాస మండలం అందర్‌కుద్ద నుండి ఎన్.లక్ష్మణరావుఫోన్ చేస్తూ సుమారు నాలుగు ఎకరాల దేవాదాయ భూమిని కొందరు రియల్ ఎస్టేట్‌వ్యాపారులు ఆక్రమిస్తున్నారని తెలిపారు. రాజాం గాయత్రీ కాలనీ నుండి జె.సింహాచలం మాట్లాడుతూ గాయత్రీనగర్‌లో రహదారుల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని కోరారు. కొత్తూరు మండలం హిరపాడు నుండి పి.సుమన్ ఫోన్ చేస్తూ వంశధార నిర్వాసితులకు ఇళ్ల పట్టాలకు బదులుగా నగదును చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇంకా చెల్లించలేదని, న్యాయం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జెసి చక్రధరబాబు, జెసి-2 పి.రజనీకాంతారావు, డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్, డిఎంఅండ్‌హెచ్‌వో తిరుపతిరావు, వ్యవసాయశాఖ జెడి రామారావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి విఎస్‌కెవి ఎస్.్ధనుంజయరావు, డుమా పి.డి కూర్మారావు, బిసి సంక్షేమాధికారి ఎస్‌ఎస్ ప్రకాశరావు, పశుసంవర్థక శాఖ జెడి ఎం.వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీరు మోహనమురళీ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఆర్.వెంకటేశ్వరరావు, జెడ్పీ సిఇఓ నగేష్, ఉద్యానవన శాఖ ఏడి రహీమ్, మార్కెటింగ్ శాఖ ఏ డి శ్యామ్‌కుమార్, సెరీ కల్చర్ ఏడి కె.సత్యారావు, ఎస్సీ కార్పొరేషన్ ఇ డి ఆదిత్యలక్ష్మీ, బిసి కార్పొరేషన్ ఇడి రామారావు పాల్గొన్నారు.