శ్రీకాకుళం

అరసవల్లి మాస్టర్ ప్లాన్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: కళియుగ ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామివారి దేవాలయం విస్తరణకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన అధికారులు దాని అమలుకు సరైన చర్యలు తీసుకోక పోవడంతో ఆలయ విస్తరణ కష్టతరంగా కనిపిస్తుంది. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన అధికారులు స్థానికుల ఆమోదం పొందే విధంగా వ్యవహరించకలేకపోవడం వలనే మాస్టర్ ప్లాన్ అమలు అట్టర్‌ప్లాప్ అయింది. వాణిజ్య సముదాయాలు ఖాళీ చేయమని అనధికార సమాచారం అందించడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఆలయాభివృద్ధికి తాము వ్యతిరేకత కానప్పటికీ తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా ఖాళీ చేయమంటే చేసే పరిస్థితుల్లో లేమని వారంతా తెగేసి చెబుతున్నారు. అరసవల్లి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వాణిజ్య సముదాయాలద్వారా జీవనోపాధి పొందుతున్నామని, తాము అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారంతా పేర్కొంటున్నారు. బాధితుల మనోభావాలకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తే తాము ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో ఉన్న ఈ ఆలయంలో సూర్యభగవానుడు కొలువైఉన్నాడు. ఆరోగ్యప్రధాతగా స్వామికి ప్రత్యేకత ఉండటంతో వివిధ రకాల రోగాలతో ఉన్నవారు అరసవల్లి వచ్చి సూర్యనారాయణను పూజించుకుంటారు. గ్రహాలకు అధిపతి సూర్యదేవున్ని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. రోగ,శోక బాధలన్నీ తొలగిపోవాలని దేవునికి పూజించేందుకు నిత్యం భక్తులు అధిక సంఖ్యలో అరసవల్లికి తరలివస్తుంటారు. ప్రతీ ఆదివారంతోపాటు పండగ వేళల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఇక సూర్యభగవానుని జయంత్యుత్సవం(రథసప్తమి)నకు స్వామివారిని లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. భక్తులకు తగ్గ వసతులు ఇక్కడ లేవనేదే బహిరంగ రహస్యం. ఇరుకైన రోడ్లు, అరకొర వసతి సదుపాయాలు, నివాస వాణిజ్య సముదాయాల మధ్య సూర్యభగవానుని ఆలయం కొంతమేర భక్తులను ఇబ్బందులకు గురిచేస్తుంది. నిత్యం ఎంతోమంది ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆదిత్యుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారే తప్ప నెరవేర్చలేదు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత ఆలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిఎం ఆదేశాల మేరకు అరసవల్లి అభివృద్ధికి నెలరోజుల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏడాది తరువాత మాస్టర్ ప్లాన్‌ను సిద్ధంచేసి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అరసవల్లి దేవస్థానం అభివృద్ధి చెందాలంటే ముందుగా పరిసర ప్రాంతాల్లో విశాలమైన రోడ్లు ఏర్పాటుచేయాలి. ఇరుకైన రోడ్లతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దేవాలయం చుట్టూ ఉన్న రోడ్లు విస్తరించాలి. అందుకు అడ్డంగా ఆలయం వెనుక ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతోపాటు ఇంద్రపుష్కరిణికి వెళ్లే మార్గాన్ని వెడల్పు చేయాల్సి ఉంది. ఆలయ ప్రవేశ మార్గాన్ని ఎదురుగా ఇంద్రపుష్కరిణి కనిపించేలా అక్కడ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలని, దేవాదాయ, రెవెన్యూ,నగర పాలక సంస్థల సర్వేయర్లు రంగంలోకి దింపి ఆలయాభివృద్ధి చేపట్టేలా అవసరమైన సర్వేలు పూర్తి చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రాప్తికి 72 భవనాలను గుర్తించి వాటి కొలతలు, యజమానుల వివరాలను నమోదుచేశారు.
ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ రోడ్లకు ఇరువైపులా ఉన్న దుకాణాలను, ఇళ్లను తొలగించేందుకు వీలుగా కొలతలు వేశారు. ఈ ప్రకారం ఆలయ అభివృద్ధి జరిగితే కొంతమంది ఇళ్లు, దుకాణాలు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుండటంతో వారు ఇప్పటినుండే ఆందోళన చెందుతున్నారు. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన అధికారులు అదే సమయంలో స్థానికులతో పూర్తిస్థాయిలో చర్చించకుండా వాణిజ్య సముదాయాలను ఖాళీ చేయాలని సమాచారం అందించడంతో బాధితులు భయపడుతున్నారు. వారసత్వంగా సంక్రమించిన ఇళ్లు, వాణిజ్య సముదాయాలలో తాతలు,ముత్తాతలు కాలం నుండి ఇదే ప్రాంతంలో నివసిస్తూ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నామని, ఇప్పుడు మమ్మల్ని వేరొక చోటుకు తరలిస్తే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హయాంలో 40 అడుగుల రోడ్డు వెడల్పులో కొంతభూమిని కోల్పోయామని, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పేరిట పూర్తిగా ఖాళీ చేయాలంటే అంగీకరించేది లేదని తెగేసి చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి 40 అడుగులు ఉన్న రోడ్డును 80 లేదా 100 అడుగుల వెడల్పు చేయడానికి సహకరిస్తామని, పూర్తిగా ఖాళీ చేయమంటే మేమెక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వాణిజ్యసముదాయాల మీద ఆధారపడి వేరొక ఉద్యోగం, వృత్తికూడా తమకు అలవాటు లేదని ఇప్పుడు ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. వేరొక చోట ఇళ్లు ఇస్తామంటున్నారని, ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ముందు మమ్మల్సి ఖాళీ చేయమనడం ఎంతవరకు సబబు అని అంటున్నారు. మా ముందుతరం చెమడోడ్చి సంపాదించుకున్న డబ్బులో ఈ వాణిజ్య సముదాయాలు నిర్మించుకున్నామే తప్ప దేవాదాయ, ప్రభుత్వాల స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటిది ఉన్నపలంగా ఖాళీ చేయమంటే మాకు దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుని దర్శనానికి వచ్చే భక్తులపై మేము ఆధారపడి జీవిస్తున్నామే గాని ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడలేదని, ఉన్నపలంగా రోడ్డున పడేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
నిర్వాసితులు పూర్తిస్థాయిలో ఆదుకునేట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే పర్వాలేదు కాని బలవంతంగా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి గతంలో కలిసి వినతిపత్రం ఇచ్చామని అయితే ఆమె చూస్తానని చెప్పారే తప్ప ఎటువంటి న్యాయం చేస్తారో అన్న భయం బాధితులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.