శ్రీకాకుళం

ఇద్దరు అన్నదమ్ములూ ఎస్‌ఐలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), మార్చి 25: మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన స్వయాన ఇద్దరు అన్నదమ్ములు ఎస్‌ఐలు ఎంపికయ్యారు. శనివారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఇద్దరు అన్నదమ్ములూ ఎంపికవడం పట్ల గోపాలపురం గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సిరిపురపు గోవిందరావు, గౌరమ్మ దంపతులకు చెందిన జనార్దనరావు, జానకిరాంలు ప్రస్తుతం కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. పోలీసులుగా విధులు నిర్వహిస్తూనే దీక్షా పట్టుదలతో ఎస్‌ఐ పరీక్షలకు హాజరయ్యారు. చిన్నతనం నుంచి క్రమశిక్షణ కలిగిన యువకులుగా పెరుగుతూ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని ఎస్‌ఐలుగా ఎంపికైన యువకుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.