శ్రీకాకుళం

నైపుణ్యంతోనే ఉద్యోగాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మార్చి 25: వృత్తినైపుణ్యం పెంపొందించుకుంటే ఉద్యోగాలు పొందడం మరింత సులువవుతుందని డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్ స్పష్టంచేశారు. స్థానిక టిటిడిసిలో టెక్స్‌టైల్స్, ఇంగ్లీష్ రెడీనెస్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను శిక్షణ తీరుతెన్నులపై శనివారం అడిగితెలుసుకున్నారు. ఈసందర్భంగా పిడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అంకితభావం పెంపొందించుకోవాలన్నారు. ఎక్కడైనా ఉద్యోగాలు చేయగలమన్న ఆత్మస్థైర్యాన్ని కూడా అలవర్చుకుంటే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు భారం కారన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం అదే కేంద్రంలో ఎచ్చెర్ల క్లస్టర్ సమావేశాన్ని ఆయన పరిశీలించారు. లావేరు, రణస్థలం, పొందూరు, ఆమదాలవలస మండలాల్లో బ్యాంకు లింకేజీ పంపిణీపై ఆరాతీశారు. మార్చి మాసాంతానికి రూ.132కోట్లు లింకేజీ రుణాలు డ్వాక్రా సభ్యులకు అందివ్వాల్సి ఉన్నప్పటికీ శతశాతం లక్ష్యాలు అధిగమించామని సిబ్బంది పేర్కొన్నారు. చంద్రన్న బీమా పథకంలో సభ్యులుగా మార్చి 31లోగా చేరకుంటే అటువంటివారికి బీమాసౌకర్యం వర్తించదన్నారు. ఇప్పటికే ఈ క్లస్టర్‌లో 1,67,602మంది చంద్రన్న బీమాలో చేరినట్లు సిబ్బంది పిడి దృష్టికి తీసుకెళ్లారు. క్లైమ్‌లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 197మంది వివిధ కారణాల వలన మృత్యువాత పడగా వీరి కుటుంబాలకు ఆర్థిక సహాయం చంద్రన్న బీమా ద్వారా అందించినట్లు ఏరియా కో ఆర్డినేటర్ రవికుమార్ పిడికి వివరించారు. లక్ష్యాలు అధిగమించేందుకు సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలన్నారు. స్ర్తినిధి రుణాల్లో మొత్తాన్ని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఈ విషయాన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని సూచించారు. డిపిఎం నారాయణరావు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని
పంచాయతీలకు అనుసంధానం చేయాలి
నరసన్నపేట, మార్చి 25: నేటి సమాజంలో వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయని ప్రభుత్వ సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృషి విజ్ఞాన కేంద్ర వ్యవసాయ శాస్తవ్రేత్త చిన్నంనాయుడు తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పంచాయితీలకు అనుసంధానం’ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కేవలం కొన్ని పట్టణ ప్రాంతాలకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరువవుతోందని దీనిని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలని స్పష్టంచేశారు. దీనికి సంబంధించి ఆయా పంచాయతీల సర్పంచ్‌లతో, వార్డు సభ్యులతో, ఎంపిటీసీలతో అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి సత్యవతి, వ్యవసాయ శాఖ అధికారులు శ్రీనివాసరావు, ఎస్ గాయిత్రీ, విజయ భాస్కర్, వెంకటరమణ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సిహెచ్ వామనమూర్తి, జెడ్పిటీసీ సభ్యురాలు శకుంతల పాల్గొన్నారు.