శ్రీకాకుళం

239 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 25: జిల్లాలో శ్రీకాకుళం, పలాస యూనిట్ల పరిధిలో 239మద్యం దుకాణాలకు గజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శివప్రసాద్ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శ్రీకాకుళం, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసి సంబంధిత సూపరింటెండెంట్ల ఆమోదం పొందాలన్నారు. ఈదరఖాస్తులను ఈనెల 30న సాయంత్రం 5గంటల లోపు సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలన్నారు. మార్చి 31 మధ్యాహ్నం 2గంటలకు నగరంలోని వైఎస్‌ఆర్ కల్యాణ మండపంలో లాటరీ ద్వారా కలెక్టర్ మద్యం దుకాణాలను విజేతలకు కేటాయిస్తారని తెలిపారు. 5వేల జనాభాలో ఉంటే 7.05 లక్షలు, పదివేల జనాభావరకు 8.05లక్షలు 25వేల జనాభావరకు 9.25లక్షలు , 50వేల జనాభా వరకు 10లక్షలు, 3లక్షల జనాభా వరకు 11.25లక్షలు, 5లక్షల జనాభా వరకు 12.05లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించామన్నారు. దరఖాస్తుతో రూ.5 వేలు, రిజిష్ట్రేషన్ ఫీజు మండలంలో రూ.50వేలు, మున్సిపాలిటీలో రూ.70వేలు, కార్పొరేషన్‌లో లక్ష రూపాయలు ఈఎండి రూ.3లక్షలు జత చేయాలన్నారు. ఒక వ్యక్తికి ఒక దుకాణం మాత్రమే కేటాయిస్తామన్నారు. దరఖాస్తుదారుడు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, రెండు సంవత్సరాల ఐటి రిటర్స్న్ దరఖాస్తుతోపాటు విధిగా జత చేయాలన్నారు.

విద్యుత్ చట్ట సవరణ
బాధ్యతతో చేపట్టండి
ఎంప్లారుూస్ యూనియన్ కార్యదర్శి గణపతి
నరసన్నపేట, మార్చి 25: రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల చట్టసవరణల వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ముఖ్య కార్యదర్శి విఎస్‌ఆర్‌కె గణపతి ఆరోపించారు. జిల్లా స్థాయి ఏపి ట్రాన్స్‌కో సంఘం ఎంప్లాయిస్ యూనియన్ సభ్యుల సర్వసభ్య సమావేశం స్థానిక కల్యాణ మండపంలోజరిగింది. ఈ సమావేశానికి గణపతి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం లక్షలాది మంది వినియోగదారులు పెరుగుతూ ఉంటే ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందన్నారు. ఉద్యోగుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం అక్రమ మార్గాలను ఎంచుకుంటోందని విమర్శించారు. ఈ దిశగానే కాంట్రాక్టర్లను బరిలోకి దింపి కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తూ ఉద్యోగవ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఇటీవల చాలావరకు తమసంస్థ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం, ప్రమాదంలో మరణించడం జరుగుతూనే ఉందని ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.5ను కొనసాగించాలని అంతేకాకుండా తాత్కాలికంగా విడుదల చేసిన జివో నెం.46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు జె ఆర్ ప్రసాద్, రీజనల్ కార్యదర్శి గోపాలరావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ కార్యదర్శి ఏవి రామప్రసాద్, స్థానిక బ్రాంచ్ అధ్యక్షులు లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.