శ్రీకాకుళం

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 30: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదవాడిని కేంద్రబిందువుగా చేసుకొని సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెడుతూ అభివృద్ధి చేస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి, అఖిలభారత బిజెపి మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్జి దగ్గుబాటి పురంధ్రేశ్వరి అన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు నివాస గృహంలో గురువారం విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీగా పివిఎన్ మాధవ్ గెలుపు అభినందనీయమని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలోపేతానికి సంకేతమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా ప్రధానమంత్రి మోదీ పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఆ విమర్శలను తిప్పికొట్టాయన్నారు. జన్‌ధన్‌యోజన, ముద్రాబ్యాంకు, మహిళలకు గ్యాస్ కనెక్షన్లు సంక్షేమపథకాలు పేదవాడికి అందించేందుకే రూపొందించారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు. ఈ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పలుమార్లు పరిశీలించి పనులు వేగవంతంగా జరగడం లేదని అసహనం వ్యక్తం చేయడంతో ప్రధాని మోదీ కాంట్రాక్టర్లను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణంపూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి డిపిఆర్ లేకపోయినా 2050కోట్లు రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం అందించినట్లు తెలిపారు. త్వరితగతిన రాజధాని నిర్మాణంపై డిజైన్స్ ఆమోదించి కేంద్రానికి పంపాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో ముందుంచాలన్నదే మోదీ ధ్యేయమన్నారు. 2014 ఎన్నికల తరువాత రాష్ట్రంలో బిజెపి 2లక్షల సభ్యత్వం ఉంటే, ప్రస్తుతం 40లక్షల మంది సభ్యత్వం ఉన్నట్లు తెలియజేశారు. బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి 2019 నాటికి బలీయమైన శక్తిగా రూపొందించనున్నామన్నారు. ఎన్నికల సమయంలో అగ్రనేతల నిర్ణయం మేరకు పార్టీ పోటీ చేస్తుందన్న విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రస్తుతం పొత్తులో ఉన్నామని, ఎమ్మెల్సీ కైవసం చేసుకున్నట్లు తెలియజేశారు. రెడ్డి నారాయణరావు, దుప్పల రవీంద్రబాబు, కద్దాల ఈశ్వరమ్మ విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు.