శ్రీకాకుళం

నదుల అనుసంధానంతో వ్యవసాయాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మార్చి 30: వ్యవసాయపరంగా జిల్లా అభివృద్ది చెందేందుకు కావాల్సిన నైసర్గిక స్వభా వం ఉంది. ఒకవైపు నాగావళి, మరోవైపు వంశధార ఉండటంతో వ్యవసాయ జిల్లాగా మార్చేందుకు నదుల అనుసంధానం చేయాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. నాగావళి, వంశధార నదులు అనుసంధానం చేసేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని రాష్ట్ర జలవనరులు, నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు తెలిపినట్లు పేర్కొన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దర్శనం చేసుకుని తన నివాసానికి వచ్చిన సూర్యనారాయణ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విషయమై ఇంజినీరింగ్ చీఫ్‌తో మాట్లాడమన్నారు. నదుల అనుసం ధానం కొత్త విషయం కాదని, సిఆర్‌ఎం పట్నాయక్ వంటి ప్రముఖ ఇంజినీరు గతంలో ఈ విషయాన్ని చెప్పారన్నారు. వాటి ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టిడిపి పరిపాలనా ఆమోదం పొందడం ఆనంద దాయకంగా ఉందన్నారు. ఈ చర్యకు టెక్నికల్ ఆమోదం కూడా పొంది ముందుకు వెళితే వంశధార ఉండి 100 టిఎంసిల నీరు సముద్రం పాలు కాకుం డా వాడుకలోకి తీసుకురావచ్చన్నారు. తద్వారా జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ నాగావళి నదిలో రాళ్లు ఉండటం వలన పట్టణానికి తాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదని, అందుకు ప్రత్యామ్నాయంగా గతంలో ఉన్న టిడిపి వంశధార నుండి నీటిని తెచ్చేందుకు ప్రయత్నం చేసిందన్నారు. అందుకు బావులు తవ్వారని గుర్తు చేశారు. వంశధార నీటిని శ్రీకాకుళం నగరానికి తెచ్చేందుకు చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో సహకరిస్తున్న జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడులకు ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు. విలేఖర్ల స మావేశంలో వెంకటేష్, ఎస్‌వి రమణమాదిగ, ప్రధాన విజయరామ్, గంగు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సమాఖ్య అధ్యక్ష ఎన్నిక అప్రజాస్వామికం
* వైకాపా రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని
ఆమదాలవలస, మార్చి 30: ఈనెల 28వతేదీన టిడిపి నాయకులు అధ్యక్షతన నిర్వహించిన పట్టణ సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక అప్రజాస్వామికమని వైకాపా హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. గురువారం ఆయన నివాస గృహంవద్ద విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ 22వతీదీన ఈ పదవికి ఎన్నికలు జరిగి తమపార్టీ అభ్యర్థి అల్లంశెట్టి చిన్నిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని సీతారాం తెలిపారు. దీన్ని సహించలేని టిడిపి నాయకులు రాజకీయ కుతంత్రంతో రికార్డులను తారుమారు చేసి తప్పుడు సంతకాలతో ఎన్నికలు నిర్వహించి సుగుణకుమారి ఎన్నికైనట్లు ప్రకటించడం అప్రజాస్వామికమని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేసి హైకోర్టును ఆశ్రయిస్తామని సీతారాం పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు దుంపల శ్యామ్, పొన్నాడ చిన్నారావు, అల్లంశెట్టి చిన్ని, వైకాపా కౌన్సిలర్లు పాల్గొన్నారు.