శ్రీకాకుళం

చిన్నారిని చిదిమేసింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, ఏప్రిల్ 15: మండలంలోని గొట్ట గ్రామం వద్ద శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో చీకటి అవంతిక (3) అనే చిన్నారి మృతి చెందింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు చక్రాల కింద పడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. నుజ్జునుజ్జయిన మృతదేహం చూపర్లను కలచివేసింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థుల రోదనలు పలువురిని కలచివేశాయి. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కల్లట గ్రామంలో ఉన్న ఇంగ్లీష్ మీడియం పాఠశాల బస్సు ఎప్పటిమాదిరిగానే హిరమండలం నుంచి పాఠశాలకు బయలుదేరింది. గొట్ట గ్రామం వచ్చేసరికి తల్లి రోహిణి కుమారుడు గోపాలరావును బస్సు ఎడమ వైపున ఉన్న డోర్ నుంచి బస్సు ఎక్కించింది. రహదారి పక్కనే కుడివైపున ఇల్లు ఉండడంతో చిన్నారి అవంతిక బస్సు చక్రాల కిందకు దూరిపోయింది. ఈ విషయాన్ని డ్రైవర్‌తో పాటు సిబ్బంది కుటుంబ సభ్యులు ఎవరూ గమనించలేదు. విద్యార్థి గోపాలరావు బస్సు ఎక్కిన వెంటనే యథావిధిగా (మిగతా 2వ పేజీలో) డ్రైవర్ బస్సును లాగించాడు. బస్సు వెళ్లిన తదుపరి జరిగిన ప్రమాదాన్ని గమనించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. జరిగిన ప్రమాదాన్ని చూసి అందరూ గొల్లుమని విలపించారు. ధనుపురం గ్రామానికి చెందిన రోహిణి, వసంతరావు తల్లిదండ్రుల సంతానంలో అవంతిక చిన్నది. వచ్చే నెలలో మేనమామ వివాహం జరగనున్న దృష్ట్యా తాతగారు ఇంటికి గొట్ట గ్రామానికి కుటుంబంతో వచ్చారు. చిన్నారి సోదరుడు కల్లట గ్రామంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. దీంతో కుమారుడు గోపాలరావుపాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి వచ్చింది. ఈ సమయంలో రోడ్డు పక్కనే ఉన్న గృహం నుంచి కుమార్తె రావడాన్ని ఎవరూ గమనించకపోడంతో బస్సు చక్రాల కింద పడి అవంతిక మృతి చెందింది. మృతురాలి తండ్రి వసంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిరమండలం ఎస్‌ఐ కె వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ డెయిరీ
పాల కేంద్రం ప్రారంభం

* ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 15: మండలంలోని సానివాడ గ్రామంలో శనివారం విశాఖ డెయిరీ పాల కేంద్రాన్ని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతులు పాలకేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. విశాఖ డెయిరీకి పాలను అప్పగిస్తే పశువులను దానాతోపాటు మరిన్ని ప్రోత్సహకాలను రాయితీపై అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులకు చెక్కులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొండు జగన్నాధరావు, సర్పంచ్ , రైతులు పాల్గొన్నారు.