శ్రీకాకుళం

ప్రగతి తిరోగమనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 28: జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు దోహదడాల్సిన ప్రభుత్వ శాఖల పనితీరుపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహిస్తే... ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలంటూ అధికారులకు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం క్లాసులు తీసుకున్నారు. ఇక్కడ జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రగతి నివేదికలంటూ అధికారుల చెప్పే వివరాలకు సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీ వాస్తవ పరిస్థితులను వివరిస్తూ అడ్డుతగలడంతో కలెక్టర్ లక్ష్మీనృసింహం ప్రభుత్వం ఉత్తర్వులు, చట్టాలంటూ ఆయనకే క్లాసు తీసుకున్నారు. జిల్లా అంతటా పది మంది ఎమ్మెల్యేలు అధికార, ప్రతిపక్షంలో ఉండగా మంత్రితోపాటు ఇచ్ఛాపురం, సోంపేట ఎమ్మెల్యేలే హాజరవ్వడం సమావేశాలకు గల ప్రాధాన్యం చెప్పకనే చెబుతుంది. జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 58 శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదించారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ, జిల్లా గృహనిర్మాణ సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్, ఎపి ట్రాన్స్‌కో మినహా మిగిలిన ఏ ఒక్క శాఖ సమీక్షను నిర్వహించలేకపోయారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ సమీక్షలో ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ గోపాలసాగరం పనులు చిందరవందరగా ఉన్నాయని, చెరువు పనులు చాలాచోట్ల ప్రారంభించి పూర్తిచేయకుండానే విడిచిపెట్టేస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కల్పించుకొని మార్చి వరకు ఉన్న పనులను పూర్తిచేసి, తరువాత ఆపేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నందున ఆపుచేశామని చెబుతూ, పది లక్షల రూపాయల పనులు దాటిన వాటికి టెండర్లు పిలివాలన్న ఆదేశాలను తెలియజేసారు. అలాగే ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ పనులు ప్రారంభమైన చోట అధికారుల పర్యవేక్షణ లేదని, ఉపాధి పనులను నీటి సంఘాలకు ఇవ్వాల్సివుండగా, జన్మభూమి కమిటీలు ప్రతిపాదించిన వారికి ఇవ్వడం అన్యాయం కాదా అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులు గ్రామ, మండల తీర్మానాలు ఉన్నప్పటికీ చాలా చోట్ల పనులు కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. శివాజీ వంతపాడుతూ తన నియోజకవర్గంలో జనవరి 27న గ్రామ తీర్మానం చేసి పనులకై ప్రతిపాదనలు పంపినా నేటి వరకు ఇవ్వలేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. డుమా పిడి పి.కూర్మనాథ్ సమాధానమిస్తూ ప్రతిపాదనలు వచ్చిన పనులకు జిల్లా పరిషత్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి అనంతరం పనులు కల్పిస్తామని చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ పనుల ప్రతిపాదనలు వచ్చిన వెంటనే జాప్యం లేకుండా దేనికి అదే పంపించాలని, అన్ని గుట్టలుగా పంపిస్తే ఏ పనులు వివరాలు తెలియక జాప్యం అయ్యే అవకాశం ఉంటుందని అధికారులకు సూచనలు చేశారు. మత్స్యకార గ్రామాల్లో ఉపాధి పనులు జరుగడం లేదన్న శివాజీ ప్రశ్నకు ఇసుక ప్రాంతాల్లో కొలతలు వచ్చే అవకాశం లేదని, అందుకే ఆయా గ్రామాల్లో పనులను కల్పించలేకపోతున్నామని అధికారులు అన్నారు. వారు కోరితే వేరే చోట పనులు కల్పిస్తామని చెప్పారు. పలుచోట్ల నీటి సరఫరాకు విద్యుత్ ఆటంకం గూర్చి గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం అధికారులు సమావేశంలో తెలియజేయగా, విద్యుత్‌శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు త్వరితగతిన విద్యుత్ సరఫరా అందజేయాలని ఆదేశించారు. ఉద్ధానం, శాలిహుండాం నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి తక్షణమే ఏవో నిధుల నుండి జీతాలు చెల్లించాలని, లేదంటే వేసవి తీవ్రతలో వారు పనులు మానేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని అధికారులను హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ట్రైమాక్స్ కుంభకోణం గ్రహించలేకపోవడం పట్ల ఆయన రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. దీంతో మంత్రి కల్పించుకుని ట్రైమాక్స్ సంస్థలో లోపాలు ఈనాటివి కావని, పదేళ్లుగా జరుగుతున్న తంతుగా పేర్కొన్నారు. వాటిని విజిలెన్స్‌శాఖ బయటపెట్టడంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంత్రి సమాధానాన్ని వ్యతిరేకించిన శివాజీ గత ప్రభుత్వం నుండి జరుగుతున్నది అయినా మనం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందని, ఇంతవరకూ మిన్నకుండిపోవడం తప్పుకాదా అంటూ ప్రశ్నించారు. అనంతరం నీరు చెట్టు అంశంపై బూర్జ జెడ్‌పిటిసి అనె్నపు రామకృష్ణ మాట్లాడుతూ బొమ్మిక రిజర్వాయరు నుండి పెద్దపేట పంచాయతీకి కాలువ ద్వారా వస్తున్న నీటిని అదే గ్రామానికి చెందిన రైతు ఆపుచేయిస్తున్నారని, తద్వారా సుమారు 200 మంది ఎస్సీ రైతులు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో బి.నగేష్, ఎమ్మెల్యే బెందాళం అశోక్, జెడ్‌పిటిసి సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.