శ్రీకాకుళం

తల్లీబిడ్డల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, ఏప్రిల్ 28: స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన గర్భిణితోపాటు ఆమె కడుపులోని చిన్నారి కూడా హఠాత్తుగా మరణించడంతో మృతురాలు బంధువులు, రత్తకన్నకొండపోలమ్మవాసులు ఆందోళన దిగారు. పండింటి బిడ్డతో ఇంటికి పంపుతారనుకుంటే వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరించి మృతదేహాలను పంపుతున్నారని విలపించారు. మృతురాలు భర్త దామోదర్‌శెట్టి, రత్తకన్నవాసులు కథనం ప్రకారం ఒడిశాలోని చెరోగ్రామానికి చెందిన దామోదర్‌శెట్టి విదేశాల్లో పనిచేస్తుంటాడు. భార్య శైభనిశెట్టి గర్భం దాల్చడంతో మూడు నెలలు కిందట తల్లితో కలిసి కొండపోలమ్మకాలనీకి వచ్చాడు. ఇచ్ఛాపురంలో వైద్యసౌకర్యం అందుబాటులో ఉంటుందని భావించి, ఇల్లు అద్దెకు తీసుకొని నివశిస్తున్నాడు. అప్పటి నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తున్నాడు. గురువారం ఉదయం నొప్పులు రావడంతో ఉదయం 9 గంటల సమయంలో స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుడు దేవేందర్‌రెడ్డి ఆమెను పరీక్షించి సాయంత్రానికి ప్రసవం వస్తుందన్నారు. ఇంతలో ఏమైందో గాని సాయంత్రం 4.30 గంటల సమయంలో శైభనికి ఫిట్స్ వచ్చిందని, క్షణాల్లో ఆమెతోపాటు కడుపులో వున్న చిన్నారికి కూడా మరణించిందని సిబ్బంది వీరికి చెప్పారు. భర్త, తల్లి, స్థానికులు వైద్యులు సరైన చికిత్స అందించకపోవడంతో వారిద్దరూ మరణించారంటూ ఆందోళనకు దిగారు. డాక్టర్ దేవేందర్‌రెడ్డిని గట్టిగా నిలదీశారు. సంఘటన తెలుసుకున్న ఎఎస్‌ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్ళు, టిడిపి నాయకుడు కోటి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయమై డాక్టర్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉదయం నుంచి చికిత్స అందిస్తున్నామని, హఠాత్తుగా పరిస్థితి విషమించడంతో దుర్ఘటన సంభవించిందని విచారం వ్యక్తం చేశారు.