శ్రీకాకుళం

చెక్‌పోస్టుపై ఎసిబి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, మే 11 : మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడి చేశారు. వివిధ శాఖల కౌంటర్లలో సిబ్బంది, ముగ్గురు దళారులు అక్రమంగా వసూలుచేసిన 40,200 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ కరణం రాజేంద్ర విలేఖరులతో మాట్లాడుతూ చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న సమాచారంతో డిజి ఆదేశాల మేరకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో చెక్‌పోస్టులో సోదాలు చేపట్టామని చెప్పారు. వాణిజ్య పన్నులశాఖ కౌంటర్‌లో అక్రమంగా వసూలుచేసిన 24,700 రూపాయలు, అటవీశాఖ కౌంటర్‌లో 500, వ్యవసాయ మార్కెట్ కమిటీ కౌంటర్‌లో 300, ముగ్గురు దళారుల నుంచి 14,700 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెక్‌పోస్టులో జరుగుతున్న అక్రమ వసూళ్లపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. సోదాల్లో సిఐలు శ్రీనివాసరావు, లక్ష్మోజి, రమేష్, 12 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఆగని అక్రమ వసూళ్ల దందా : ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై ఎసిబి అధికారులు ఎన్నిసార్లు దాడి చేసినప్పటికీ అక్రమ వసూళ్లు మాత్రం ఆగటం లేదు. ఎసిబి అధికారుల సోదాలు పూర్తి చేసుకుని వెళ్లిన కొద్దిసేపటికే మళ్లీ దందా ప్రారంభమవుతోంది. ఎసిబి అధికారులు రావటం, పోవటం మామూలేనన్న ధోరణిలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రధానంగా కొందరు దళారులు దందాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 9వతేదీన ఎసిబి అధికారులు జరిపిన దాడిలో 64 వేల రూపాయలు లభ్యమయ్యాయి. అప్పట్లో 8 మంది దళారులు పట్టుబడ్డారు. మూడు రోజుల కిందట చిత్తూరు జిల్లా తడ చెక్‌పోస్టుపై ఎసిబి దాడి జరగటంతో ఇక్కడ కూడా జరగుతుందని సిబ్బంది జాగ్రత్త పడినట్టు సమాచారం. అందువల్లే ఈసారి తక్కువ మొత్తం లభ్యమైందని, పట్టుబడిన దళారుల సంఖ్య తగ్గిందని చెక్‌పోస్టు వర్గాలు తెలిపాయి. జిఎస్‌టి అమలైతే చెక్‌పోస్టు ఎత్తివేయటం ఖాయమని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అది జరిగేవరకు ఇక్కడి దందాను ఆపటం ఎవరి తరమూ కాదన్నది బహిరంగ రహస్యం.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కాలయాపన
* విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలు విరమించుకోవాలి
* యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
శ్రీకాకుళం(రూరల్), మే 11: రాష్ట్ర విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలు విరమించుకోవాలని, బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని యు.టి.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షుడు, జెఏసి ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బదిలీల్లో ఫెర్మార్మెన్స్ పాయింట్స్, వెబ్‌కౌనె్సలింగ్ రద్దు చేయాలని, బదిలీలకు 8 ఏళ్ల కాలపరిమితి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దుకై ఐక్య ఉద్యమాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఉన్నత యుపి, ప్రాథమిక పాఠశాలలకు కొత్త విధానాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ పలుకుబడి, బదిలీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరిట పాఠశాలల మూసివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గురువారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో యుటిఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగం- పరిణామాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా అధ్యక్షుడు రెడ్డి మోహనరావు, ఎస్.కిషోర్‌కుమార్, బమ్మిడి శ్రీరామమూర్తి, జి.రామలక్ష్మీ, పొందూరు అప్పారావు, ధర్మారావు, కామేశ్వరరావు, చంద్రరావు, సురేష్, శైలజ పాల్గొన్నారు.

శాసనసభ కమిటీకి
ఎమ్మెల్యే గుండ కుటుంబం సత్కారం
శ్రీకాకుళం(రూరల్), మే 11: రాష్ట్ర శాసనసభా హామీల అమలు కమిటీ ప్రతినిధులు జిల్లాలో గురువారం పర్యటించారు. తొలుత అరసవల్లిలోని శ్రీసూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికార లాంఛనాలతో శాసనసభా కమిటీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. అరవసల్లిలోని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాస గృహంలో మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబం శాసనసభా కమిటీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. గుండ దంపతులు కమిటీ ప్రతినిధులను సత్కరించారు.