శ్రీకాకుళం

అన్నదాతకు అభయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: కేంద్ర కరవు బృందం పర్యటించింది..రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఖరీఫ్‌ను కాటేసిన కరువుపై అధ్యయనం చేసింది. జిల్లాలో అన్నీ మండలాల్లో కరువు తాండవిస్తుందంటూ అన్నదాతలు గోడును ప్రతీ కేబినెట్‌లో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేరుగా చర్చకు తీసుకువచ్చినప్పటికీ, సగటు వర్షపాతం నమోదు ఆధారంగా పరిగణనలోకి తీసుకుని లెక్కలు కట్టిన వ్యవసాయశాఖ నివేదికలు మేరకు జిల్లాలో ఆరు మండలాలకే కరువు కాటేసినట్టు ప్రభుత్వం నిర్థారణ చేసి ఆ మండలాల్లో అన్నదాతలకు 2016-17 ఖరీఫ్‌కు సంబంధించి పెట్టుబడి రాయితీని వారి ఖాతాల్లోకి జమచేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జె.రామారావు కరువుమండలాలుగా ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, భామిని, సారవకోట మండలాలను గుర్తించినట్టు చెప్పారు. ఈ మండలాలకు సంబంధించి 18,019 మంది రైతులకు సంబంధించిన 4367.716 హెక్టార్లలో వరి పంటను నష్టపోయారని, ఆ పంట నష్టానికిగాను ప్రభుత్వం రూ. 6.55 కోట్లు పెట్టుబడి రాయితీగా విడుదల చేసినట్టు ‘ఆంధ్రభూమి’కి వివరించారు. ఈ పెట్టుబడి రాయితీని సంబంధిత వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, ఖజానాశాఖ ద్వారా ఆయా రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారని చెప్పారు. ఇచ్చాపురం మండలంలో 709 మంది రైతులు, 180.243 హెక్టార్లకుగాను రూ. 27,03,640 రాయితీ పెట్టుబడి కింద రైతుల ఖాతాలకు జమకానున్నది. అలాగే, భామిని మండలంలో 1893 మంది రైతులకు, 996 హెక్టార్లకుగాను రూ. 1,49,40,000, పలాస మండలంలో 994 మంది రైతులకు చెందిన 259.173 హెక్టార్లుకు రూ. 38,87,600, సారవకోట మండలానికి 330 మంది రైతులకు చెందిన 40.40 హెక్టార్లకు 60,6000, సంతబొమ్మాళి మండలంలో 13,165 మంది రైతులకు చెందిన 2657.992 హెక్టార్లకుగాను 3,98,69,900 రూపాయలు, వజ్రపుకొత్తూరు మండలంలో 928 మంది రైతులు, 233.908 హెక్టార్లకుగాను రూ. 35,08,600 రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా, మంత్రి అచ్చెన్న ప్రాతినిధ్యం వహించిన టెక్కలి నియోజకవర్గంలో గల సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో అన్నదాతలకు అపన్నహస్తం అందించారు. జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన ఖరీఫ్ పెట్టుబడి రాయితీ సాయంలో సింహభాగం టెక్కలి ఎమ్మెల్యేగా అచ్చెన్న తన నియోజకవర్గం రైతులను ఆదుకునేలా పెద్దమొత్తంలో వారి ఖాతాల్లోకి కాసులు జమచేయించే పనిని సక్సెస్‌గా నిర్వహించినట్టు గణాంకాలు సుస్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఆరు మండలాలకు 6.65 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ ప్రభుత్వం మంజూరు చేస్తే, అందులో ఒక్క టెక్కలి నియోజకవర్గానికే రూ. 4.33 కోట్లు కేటాయింపులు చేసారంటే, అక్కడ రైతులను ఆదుకోవడంలో అచ్చెన్న వ్యూహాం బాగా ఫలించదనే చెప్పాలి. ఇకపోతే, కరువు మండలాలు, వాటికి కేటాయించిన పెట్టుబడి రాయితీలు పంపకాల్లో కూడా జిల్లా మంత్రిగా సమతూల్యత బాగా పాటించారనే చెప్పాలి. తనకు అనుకూల నియోజకవర్గాలు, మద్దతు పలికిన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్చాపురం (బెందాళం అశోక్), పలాస (గౌతు శ్యామసుందరశివాజీ), నరసన్నపేట (బగ్గు రమణమూర్తి) ప్రాంతాలకు చెందిన రైతులను ఆదుకుని, అక్కడ ఎమ్మెల్యేల పట్ల అన్నదాతకు గౌరవం పెరిగేలా పెట్టుబడి రాయితీ రప్పించడంలో వేసిన పాచిక ‘పవర్’్ఫల్‌గా పనిచేసిందనే చెప్పాలి. ప్రతిపక్షాల నోట మాట రాకుండా, పలు సందర్భాలు, సభలు, సమావేశాలు, సమీక్షల్లో వైకాపా గళం నొక్కేసేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొండ నియోజకవర్గంలో భామిని మండలాన్ని కూడా కరువుకాటు జాబితాల్లో చేర్చి, అక్కడ రైతులకు సుమారు కోటిన్నర రూపాయలు పెట్టుబడి రాయితీ ఇచ్చేలా మంత్రి అచ్చెన్న ప్రతిపాదనకు ప్రభుత్వం రబ్బర్‌స్టాంప్ వేసేసింది. దీంతో ఏకపక్షం అనే మాట ఊసేలేకుండా పోయేలా జాగ్రత్త తీసుకున్నట్టు అయ్యింది. కాని - ముందునుంచి అధికారపార్టీ ఎమ్మెల్యేలతో సర్దుకుపోయే నైజం కలిగివుండడంతోనే ఎస్.కళావతి ఎమ్మెల్యేగా ఉన్న పాలకొండ నియోజకవర్గంలో అన్నదాతలకు మేలుజరిగిందని చెప్పకతప్పదు. ఏదిఏమైనప్పటికీ, సమతూల్యతతోపాటు, తొలివిడతలో గత ఖరీఫ్‌ను కాటేసిన కరువు నుంచి అన్నదాతలను అపన్నహస్తం అందించడంలో అభాసుపాలుకాకుండా జిల్లాలో అధికార పార్టీ అన్నదాతలను ఆదుకుందంటూ రాజకీయ విశే్లషకులు శతశాతం సక్సెస్‌గా చెబుతున్నారు.