శ్రీకాకుళం

ఆదివాసీ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 19: ఆదివాసీ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆల్ ఇండియా ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి, త్రిపుర ఎంపి జితేంద్రచౌదరీ ప్రభుత్వాన్ని కొరారు. స్థానిక కమర్షియల్ ట్యాక్స్ అతిధి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి దానిని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. అటవీహక్కుల చట్టాన్ని అమలు చేయడంలేదని పెర్కోన్నారు. కేంద్రంలో బిజేపి, రాష్ట్రంలో టిడిపి ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. కేవలం ప్రచారాలకే కోట్లాది రూపాయల ధానాన్ని వ్యయం చేస్తున్నారన్నారు. ఈ నెల 20నుండి 22వ తేది వరకు విశాఖపట్నంలో ఆదివాసీ అర్గనైజేషన్ అధ్వర్యంలో మూడు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. యూపి ఎ మూడేళ్ళ పాలనలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయ భూములను కార్పోరేట్ సంస్థలకు అప్పగిస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని పెర్కోన్నారు. స్వామినాధన్ కమీషన్ సిపార్సులను అమలు చేయాలన్నారు. ఉత్తరాంధ్రలో అరుకులో ఎక్కువమంది ఆదివాసులు ఉన్నారని తెలియజేశారు. విలేఖర్ల సమావేశంలో సిపి ఎం సినియర్ నాయకులు చౌదరి తేజేశ్వరరావుతదితరులు ఉన్నారు.

ఐసిడిఎస్ ప్రైవేటీకరణను విరమించుకోవాలి
శ్రీకాకుళం(రూరల్), జూన్ 19: ఐసిడిఎస్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని అంగన్వాడీ ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యాదర్శి ఎన్.హిమప్రభ కోరారు. సోమవారం ఐసిడిఎస్ పిడి లీలావతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ వేతనాలు, బిల్లులు,ట్రాన్స్‌పోర్టు చార్జీలు వెంటనే ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే 7 ప్రోజెక్టులలో అన్న అమృతహస్తం పథకం 10 నెలలుగా బిల్లులు లేక కార్యకర్తలు చేతి డబ్బులు పెట్టి వంటలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు, బిల్లులు లేక ఇబ్బందు పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మూడు నెలల బిల్లులు అడ్వాన్స్‌గా అకౌంట్‌లో వేస్తే ఖచ్చితంగా అమృత హస్తం ద్వారా గర్బీణి,బాలింతలకు పోషకాహారం వండిపెడతారని తెలియజేశారు. మున్సిపల్, అర్బన్ అంగన్వాడీ కేంద్రాలను నారాయణవిద్యా సంస్థలకు అప్పజెప్పి సెంటర్సును మెర్జ్‌చేసి కార్పొరేట్‌ల తరహాలో విద్యను అందిస్తామనడం చాల అన్యాయమన్నారు. దీనిని అంగన్వాడీ యూనియన్ వ్యతిరేకిస్తుందని తెలియచేశారు. జూలై 3వ తేదిన కలెక్టరే ట్ వద్ద నిర్వహించునున్న థర్నాను జయప్రధం చేయాలని కోరారు. పిడిని కలిసిన వారిలో ఎం.జయలక్ష్మీ,లు పాల్గొన్నారు.

అభివృద్ధికి టిడిపి నేతలు అర్ధం చెప్పాలి
శ్రీకాకుళం(రూరల్), జూన్ 19 : అభివృద్ధి అంటే అర్ధం తెలుగుదేశం పార్టీనేతలు తెలియజేయాలని వైకాపా అధికార ప్రతినిధి జె. ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గంతో పాటు జిల్లాలో శాశ్వత పనులు చేపట్టి అభివృద్ధిచేశారని అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ రోజుకో ప్రెస్‌మీట్ పెడుతూ అవినీతిని అంతమొందించడానికి టిడిపి పుట్టిందని చెప్పుకోవడం హాస్యస్పదమన్నారు. హుదూద్ ఇళ్ళనిర్మాణం పూర్తయినప్పటికి వాటిని ఇంతవరకు లబ్ధిదారులకు ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. లబ్ధిదారుల వద్ద నుండి గుండ అనుచరులు పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నించారు. అ విషయం ఎక్కడ బయటపడుతుందేమోనని లబ్ధిదారులకు కేటాయించడం లేదని ఇది అవినీతి కాదా అని అన్నారు. నగరంలో అంబేద్కర్ జంక్షన్ సమీపంలో జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తికాకుండానే కొంతమంది లబ్ధిదారుల వద్ద నుంచి డబ్బులు కలెక్షన్ చేయలేదా అని ప్రశ్నించారు. ఇంతటి అవినీతి పరులను అక్కున చేర్చుకొని అవినీతిని అంతమొందిస్తామనడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందన్నారు. అభివృద్ధి కోసం పదేపదే మాట్లాడుతూ ధర్మాన చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. ధర్మాన చేసిన శాశ్వతాభివృద్ధిని పరిశీలిస్తే గత మూడేళ్లలో ఏ ఒక్క శాశ్వతాభివృద్ధి పనైన చేశారా అని అన్నారు. స్థానిక అరసవల్లి మిల్లు జంక్షన్ నుంచి రామఅక్ష్మణ జంక్షన్ వరకు రోడ్డు నిర్మిస్తామని చెప్పి అక్కడ చిల్లర వ్యాపారులను తొలగిస్తూ మహిళ కళాశాల రక్షణ గోడను కూల్చివేసి పనులను తాస్సారం చేయడం ఇదేనా అభివృద్ధి అని అన్నారు. ఇప్పటికైన అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలన్నారు. విలేఖర్ల సమావేశంలో కొరాడ రమేష్, ఆదిత్య శ్రీనివాస్, కర్రి రంగాజీదేవ్ తదితరులు ఉన్నారు.