శ్రీకాకుళం

చిన్నబగ్గ గ్రామ సమీపంలో ఏనుగుల సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, ఏప్రిల్ 28: సీతంపేట ఏజెన్సీలో చిన్నబగ్గ గ్రామ సమీపంలోని ఏనుగులు సంచరిస్తున్నాయి. గ్రామానికి అతి సమీపంలో గురువారం అర్ధరాత్రి సమయంలో ఏనుగులు ఘీంకారాలు చేయడంతో ఆరుబయట నిద్రిస్తున్న గిరిజనులు దాబాలుపైకి వెళ్లిపోయారు. ఏనుగులు ఘీంకారాలు రాత్రంతా కంటిమీదు కనుకులేకుండా జాగారం చేశామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలో ఉన్న జీడి, మామిడి చెట్లు ఏనుగులు నాశనం చేశాయని గిరిజన రైతులు వాపోతున్నారు. ఏనుగులను ఏజెన్సీ నుంచి పంపించకపోతే జీవనం కష్టవౌతుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు.

బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి
* డిఇవో దేవానందరెడ్డి
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 28: విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చేరడం ద్వారా ఉన్నత ఫలితాలను సాధించవచ్చునని డిఇవో దేవానందరెడ్డి పేర్కొన్నారు. మన ఊరు మన బడి అవగాహన ర్యాలీలో భాగంగా గురువారం స్థానిక ఏడురోడ్ల కూడలి నుండి పాతబస్టాండ మీదుగా జెడ్పి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఇవో జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు.ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం ద్వారా వారికి సరైన విద్యను అందించే వీలు కలుగుతుందని, మధ్యాహ్న భోజనం తదితర పథకాల వలన పిల్లలకు పోషకాహారంతోపాటు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. డిప్యూటీ డిఇవో సుబ్బారావు, సర్వశిక్ష అభియాన్ పివో త్రినాథరావు, ఎంఇవోలు సింహాచలంతోపాటు పలువురు హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయం
నరసన్నపేట, ఏప్రిల్ 28: జిల్లాలో ప్రతీ గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుజరుగుతుందని జిల్లాసాక్షరభారతీ ప్రాజెక్ట్ అధికారి రామకృష్ణ తెలిపారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాక్షరభారతీ కో ఆర్డినేటర్ల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూజిల్లాలో శ్రీకాకుళం మండలం అక్షరాస్యతలో ముందంజలో ఉందని రెండవ స్థానంలో నరసన్నపేట ఉందని పేర్కొన్నారు. అయితే సంపూర్ణంగా అక్షరాస్యతను సాధించేందుకు గాను పలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.