శ్రీకాకుళం

టిడీపీ.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్‌నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శులు సీనియర్ నేతలు ఇ.పెద్దిరెడ్డి, ఎం.ఎ.షరీఫ్, యువతరం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, ఐ.టి.శాఖల మంత్రి నారా లోకేష్ వ్యవహారిస్తున్నారు. యువత కోటా నుంచి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకి అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎం.పి. రామ్మోహన్‌నాయుడుకి ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో పార్టీలో పదోన్నతి లభించినట్టు అయ్యింది. 2012లో దివంగత కేంద్ర మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు అకాల మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్మోహన్‌నాయుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు సైకిల్ యాత్ర చేశారు. 2014లో శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ తరుఫున పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రామ్మోహన్‌నాయుడు సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి శనివారం శ్రీకాకుళం ఎం.పి. కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా ఎం.పి. రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. తనను నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఎం.పి. కృతజ్ఞతలు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికలకు ముఖ్యమంత్రి సమాయత్తమై పోతున్నారన్న సంకేతాన్ని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో తేటతెల్లమైంది. అవసరమైతే ముందస్తు ఎన్నికలు అయినా ఉండవచ్చన్న సంకేతాలు నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ఎపీలో ఎదుర్కొనేందుకు తన కొత్త టీంను రెడీ చేసారు. శనివారం అమరావతిలో సమావేశంలో శ్రీకాకుళం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో విధేయుతకు పెద్దపీఠ వేయడంతోపాటు, సామాజిక సమీకరణాలను భేరీజువేసుకుని సమతుల్యతతో కొత్త కమిటీలు, పోలిటిబ్యూరోలో చోటు కల్పించారు. ఎపీ టిడీపీ అధ్యక్షులుగా ఇంధనశాఖ మంత్రి కిమిడి కళావెంకటరావును మార్చలేదు. వాస్తవానికి మంత్రిగా ఉన్న కళాను తప్పించి ఆ స్థానంలో ఆనం రామనారాయణకు ఇస్తారన్న ఊహాగానాలు మొన్నటి వరకూ రాష్టమ్రంతటా చక్కర్లు కొట్టాయి. కాని - బాబు మాత్రం కళాను తిరిగి ఏపీ టిడీపీ అధ్యక్షుడుగా కొనసాగించారు. అలాగే, పోలిట్ బ్యూరో సభ్యురాలుగావున్న కావలి ప్రతిభాభారతిని కూడా జాతీయ అధ్యక్షుడు మార్పు చేయలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి టిడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యురాలు ఇలా సామాజిక సమీకరణాలతోపాటు, పార్టీని బలోపేతం చేసేవారికి బాబు చోటు ఇచ్చారు. అందులో శ్రీకాకుళం జిల్లా ముందు వరుసలో ఉందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే - రానున్న రాజకీయాల్లో యువతే కీలక బాధ్యలన్నీ వహించేలా వ్యూహాన్ని రచిస్తున్న తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే భవిష్యత్తు తరాలకు బాబు తనయుడు నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ పార్టీలో సీనియర్లు, జూనియర్లు ఎప్పటికప్పుడు, వేదికల నుంచి సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అదే రీతిలో ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటన చేసిన ఐటీ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పార్టీ బలం ఇక్కడ వాపు కాదన్న వాస్తవాన్ని గ్రహించడంతోపాటు, కంచుకోటగా వున్న సిక్కోల్ టిడీపీ నుంచే తన యువనాయకత్వం ఫార్ములాను తెరమీదకు తీసుకురావాలన్న ఆలోచనతో జిల్లా పర్యటన ముగించుకుని వెళ్ళిన కొద్దిరోజులకే యువ పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడుకి తనతోపాటు పనిచేసేందుకు కేంద్ర పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు లోకేష్ ఫార్ములా బాగా పనిచేసింది. ఇంతటితోకాకుండా, లోకేష్ టీంలో తొలి పేరుగా ఉన్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలతోపాటు, లోకేష్ టీంకు ప్రధాన సైనికుడుగా పనిచేసేందుకు అవకాశాలు కల్పించడానికి ఇప్పుడు లోకేష్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం దక్కింది. ఇటీవల పలాస బహిరంగ సభలో మంత్రి లోకేష్ తమ్ముడు రామ్మోహన్‌నాయుడు, తాను కలిసి పనిచేస్తామని చెప్పే మాట నిజమైంది!!